iDreamPost

IND vs ENG: గెలుపు కాదు.. అందులో బెస్ట్ అవ్వాలనేదే మా అందరి కల: రోహిత్ శర్మ

  • Published Feb 06, 2024 | 5:20 PMUpdated Feb 06, 2024 | 10:12 PM

రెండో టెస్టులో ఇంగ్లండ్​ను చిత్తు చేసిన సంతోషంలో ఉన్నాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే తమకు గెలుపు కంటే అందులో బెస్ట్ అవ్వడమే ముఖ్యమన్నాడు.

రెండో టెస్టులో ఇంగ్లండ్​ను చిత్తు చేసిన సంతోషంలో ఉన్నాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే తమకు గెలుపు కంటే అందులో బెస్ట్ అవ్వడమే ముఖ్యమన్నాడు.

  • Published Feb 06, 2024 | 5:20 PMUpdated Feb 06, 2024 | 10:12 PM
IND vs ENG: గెలుపు కాదు.. అందులో బెస్ట్ అవ్వాలనేదే మా అందరి కల: రోహిత్ శర్మ

బజ్​బాల్​ క్రికెట్​తో అందర్నీ భయపెడుతూ వస్తున్న ఇంగ్లండ్​ బెండు తీసింది భారత్. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో ఇంగ్లీష్ టీమ్​ను చిత్తు చేసింది. ఉప్పల్ టెస్టులో ఓడిన బాధలో నుంచి వెంటనే తేరుకున్న రోహిత్ సేన.. పక్కా ప్లాన్​తో ఆడుతూ ఇంగ్లండ్​ను మట్టికరిపించింది. ఈ విజయంతో సిరీస్​ను 1-1తో సమం చేసి జోష్​లో ఉంది. ఈ మ్యాచ్​లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్​లో శుబ్​మన్ గిల్ సెంచరీతో పాటు పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా బుల్లెట్ బంతులు హైలైట్​గా నిలిచాయి. కాగా, మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జట్టులోని అందరు ఆటగాళ్లు కలసికట్టుగా ఆడటం వల్లే విజయం సాధించామని తెలిపాడు. అయితే తమకు గెలుపు కంటే ఆ విషయంలో బెస్ట్​గా ఉండాలనేదే ముఖ్యమని చెప్పాడు.

ఫీల్డింగ్ మీద చాలా ఫోకస్ పెడుతున్నామని రోహిత్ తెలిపాడు. ఇందులో మెరుగయ్యేందుకు చాలా కృషి చేస్తున్నామని అన్నాడు. వరల్డ్ క్రికెట్​లో బెస్ట్ ఫీల్డింగ్ టీమ్​గా పేరు తెచ్చుకోవాలని ఉందన్నాడు హిట్​మ్యాన్. ‘ఫీల్డింగ్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం. బెస్ట్ ఫీల్డింగ్ టీమ్​గా పేరు తెచ్చుకోవాలనేది మా కోరిక. ఈ మ్యాచ్​లో బౌలింగ్​తో పాటు బ్యాటింగ్​లోనూ రాణించాం. జస్​ప్రీత్ బుమ్రా ఓ ఛాంపియన్ బౌలర్. గతంలోనూ అతడు ఇలాంటి గొప్ప ప్రదర్శనలు చేశాడు. అయితే విక్టరీ కొట్టాలంటే మాత్రం టీమ్​మేట్స్ అందరూ కలసికట్టుగా ఆడాలి. ఇలాంటి సిచ్యువేషన్​లో టెస్టును గెలవడం అంత ఈజీ కాదు. మా బ్యాటర్లు, బౌలర్లు అదరగొట్టారు’ అని రోహిత్ మెచ్చుకున్నాడు. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్​కు మంచి ఫ్యూచర్ ఉందన్నాడు.

జైస్వాల్ మంచి ప్లేయర్ అని పొగిడిన రోహిత్.. అతడు గేమ్​ను బాగా అర్థం చేసుకుంటాడని తెలిపాడు. టీమ్ తరఫున వచ్చే మరిన్ని ఛాన్సులను అతడు సద్వినియోగం చేసుకుంటాడని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు హిట్​మ్యాన్. శుబ్​మన్ గిల్ కూడా బాగా ఆడాడని ప్రశంసించాడు. అయితే తమ బ్యాటర్స్​కు మంచి స్టార్ట్స్ లభిస్తున్నా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నారని రోహిత్ ఆందోళన వ్యక్తం చేశాడు. మంచి ఆరంభాలను బిగ్ ఇన్నింగ్స్​గా మలచడం మీద బ్యాటర్లు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా ఆలోచించాలన్నాడు రోహిత్. అయితే టీమ్​లో చాలా మంది యంగ్​స్టర్స్ ఉన్నారని.. వారికి అంతగా ఎక్స్​పీరియెన్స్ లేదన్నాడు. కాస్త టైమ్, భరోసా ఇస్తే వాళ్లు సత్తాచాటడం తథ్యమని హిట్​మ్యాన్ వ్యాఖ్యానించాడు. మరి.. బెస్ట్ ఫీల్డింగ్ టీమ్​గా పేరు తెచ్చుకోవాలని ఉందంటూ రోహిత్ అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి