iDreamPost
android-app
ios-app

100వ టెస్టులో చరిత్ర సృష్టించిన అశ్విన్‌.. తొలి భారత క్రికెటర్​గా అరుదైన రికార్డు!

  • Published Mar 09, 2024 | 12:44 PM Updated Updated Mar 09, 2024 | 1:22 PM

ధర్మశాల టెస్టులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. తొలి భారత క్రికెటర్​గా అరుదైన రికార్డును నమోదు చేశాడు.

ధర్మశాల టెస్టులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. తొలి భారత క్రికెటర్​గా అరుదైన రికార్డును నమోదు చేశాడు.

  • Published Mar 09, 2024 | 12:44 PMUpdated Mar 09, 2024 | 1:22 PM
100వ టెస్టులో చరిత్ర సృష్టించిన అశ్విన్‌.. తొలి భారత క్రికెటర్​గా అరుదైన రికార్డు!

ధర్మశాల టెస్టులో టీమిండియా విజయం ముంగిట నిలిచింది. కెరీర్​లో 100వ టెస్టు ఆడుతున్న సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్​తో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్​లో 5 వికెట్లు తీశాడతను. టెస్టుల్లో 5 వికెట్లు తీయడం అతడికి ఇది 36వ సారి కావడం విశేషం. లాంగ్ ఫార్మాట్​లో అత్యధిక సార్లు 5 వికెట్లు (ఫైవ్ వికెట్ హాల్) తీసిన భారత బౌలర్​గా రికార్డు క్రియేట్ చేశాడతను. ఈ మ్యాచ్​లో బెన్ ఫోక్స్ (8) వికెట్ తీయడం ద్వారా అతడు ఈ ఫీట్​ను నమోదు చేశాడు. ఫోక్స్​తో పాటు జాక్ క్రాలీ (0), బెన్ డకెట్ (2), ఓలీ పోప్ (19), బెన్ స్టోక్స్ (2)ను కూడా అశ్వినే వెనక్కి పంపాడు.

వందో టెస్టు ఆడుతున్న అశ్విన్ ఓ భారత లెజెండ్​ను అధిగమించాడు. కెరీర్​లో 36వ సారి 5 వికెట్లు తీసిన ఈ స్పిన్నర్.. ఈ లిస్టులో టాప్​లో ఉన్న అనిల్ కుంబ్లేను అధిగమించాడు. కుంబ్లే 132 టెస్టుల్లో 35 సార్లు 5 వికెట్ హాల్స్​ నమోదు చేశాడు. అయితే అశ్విన్ మాత్రం 100 టెస్టుల్లోనే ఆయన్ను అధిగమించి టాప్ ప్లేస్​ను దక్కించుకొని ఆల్​టైమ్ గ్రేట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు సంపాదించాడు. ఈ జాబితాలో టర్బనేటర్ హర్భజన్ సింగ్ 103 టెస్టుల్లో 25 సార్లు 5 వికెట్లు తీసి మూడో స్థానంలో నిలిచాడు. ఇక, ఇప్పటికే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని దాటేసిన అశ్విన్.. ఇప్పుడు 5 వికెట్ హాల్స్ విషయంలో కుంబ్లేను దాటేశాడు. అతడు ఇలాగే మరికొన్నేళ్లు ఆడితే మరిన్ని రికార్డులు బ్రేక్ అవడం ఖాయం. మరి.. అశ్విన్ అరుదైన రికార్డుపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.