Nidhan
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంటేనే వాళ్లు భయపడుతున్నారు. తోపు బౌలర్లు అందర్నీ చితకబాదిన ఆ మోడర్న్ మాస్టర్స్ జడ్డూ పేరు చెబితేనే జడుసుకుంటున్నారు.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంటేనే వాళ్లు భయపడుతున్నారు. తోపు బౌలర్లు అందర్నీ చితకబాదిన ఆ మోడర్న్ మాస్టర్స్ జడ్డూ పేరు చెబితేనే జడుసుకుంటున్నారు.
Nidhan
రవీంద్ర జడేజా.. ఈ టీమిండియా స్టార్ గురించి క్రికెట్ అభిమానులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన స్పిన్ బౌలింగ్, అదే స్థాయి బ్యాటింగ్‌తో స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు జడేజా. ఫీల్డింగ్‌లో ప్రస్తుత క్రికెట్లో అతడ్ని మించినోడు లేడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా ప్రతి విభాగంలోనూ తనదైన శైలిలో రాణిస్తూ భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు జడ్డూ. ముఖ్యంగా టెస్టుల్లో రోహిత్ సేన వరుస విక్టరీలు సాధిస్తుందంటే అందులో అతడికి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సిందే. బౌలింగ్‌లో బ్రేక్ త్రూ కావాలన్నా, బ్యాటింగ్‌లో వికెట్లు పడిన సమయంలో టీమ్‌ను ఆదుకోవాలన్నా జడ్డూ మీదే రోహిత్ ఆధారపడతాడు. అలాంటి ఈ డాషింగ్ లెఫ్టాండర్ దిగ్గజ బ్యాటర్లకు పీడకలగా మారాడు. ఈ జనరేషన్లో బ్యాటింగ్ గ్రేట్‌లుగా పేరు తెచ్చుకున్న వారికి ఓ రేంజ్లో పోయిస్తున్నాడు జడ్డూ.
ప్రస్తుత తరంలో ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తోపులుగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా టెస్టుల్లో వీళ్లిద్దరూ టాప్ లెవల్లో ఆడుతున్నారు. క్రీజులో కుదురుకోవడం, ఓపిగ్గా గంటల కొద్దీ బ్యాటింగ్ చేయగలగడం, ఎంతటి బౌలర్‌ను అయినా చీల్చి చెండాడటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఈ జనరేషన్లో బెస్ట్ అనదగ్గ వారందరి బౌలింగ్‌లోనూ వీళ్లిద్దరూ భారీగా రన్స్ చేశారు. కానీ జడేజా ముందు మాత్రం స్మిత్, రూట్ పప్పులు ఉడకడం లేదు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో వాళ్లిద్దరూ తరచూ ఫెయిల్ అవుతున్నారు. దానికి రికార్డులే ప్రూఫ్. ఇప్పటిదాకా టెస్టుల్లో స్మిత్‌ను ఏకంగా 8 సార్లు ఔట్ చేశాడు జడేజా.
స్మిత్‌నే కాదు.. జో రూట్‌ను కూడా లాంగ్ ఫార్మాట్లో 8 సార్లు వెనక్కి పంపాడు జడేజా. ప్రతి టీమ్‌లోని టాప్ బౌలర్ బౌలింగ్‌ను చిత్తు చేస్తూ పరుగుల వరద పారిస్తున్న ఈ ఇద్దరు బ్యాటర్లు.. భారత స్టార్ బౌలింగ్‌లో మాత్రం తడబడుతున్నారు. ధర్మశాల ఆతిథ్యం ఇస్తున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ జడ్డూ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు రూట్. జడ్డూ వేసిన బాల్‌ను అర్థం చేసుకోలేక డిఫెన్స్ చేయబోయి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, అదనపు వేగంతో బంతులు వేయగలగడం, వేరియేషన్స్‌తో బౌలింగ్ చేయగలగడం.. సిచ్యువేషన్, పిచ్‌కు తగ్గట్లు బౌలింగ్‌లో మార్పులు చేసుకోవడం వల్లే జడేజా ఇంతగా సక్సెస్ అవుతున్నాడని అనొచ్చు.
ఎంతో ఓపిగ్గా ఆడే స్మిత్, రూట్‌కు పెద్దగా బలహీనతలు లేవు. కానీ తన బలమైన వేరియేషన్స్, ఎక్స్ట్రా పేస్, లైన్ అండ్ లెంగ్త్, మంచి టర్న్‌తో మ్యాజిక్ చేసి ఆ ఇద్దర్నీ తప్పు చేసేలా చేస్తున్నాడు జడ్డూ. అతడి మాయలో పడి వాళ్లు కూడా వికెట్లు సమర్పించుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. మోడ్రన్ మాస్టర్స్‌కు జడేజా మొగుడిలా తయారయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు. జడ్డూతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని చెబుతున్నారు. మరి.. జడ్డూ బౌలింగ్ మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: సర్ఫరాజ్‌ను నమ్మని రోహిత్! చేతులారా వికెట్ మిస్! ఇలా చేశాడేంటి..?
Jadeja dismissed Steven Smith 8 times in Tests.
Jadeja dismissed Joe Root 8 times in Tests.
– One of the most prolific records against two greats of the game! 👌 pic.twitter.com/nSDKf80yy6
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 7, 2024