iDreamPost
android-app
ios-app

IND vs ENG: వీడియో: ఎగతాళి చేస్తూ.. జడేజాను దారుణంగా అవమానించిన అండర్సన్‌!

  • Published Feb 16, 2024 | 3:30 PM Updated Updated Feb 16, 2024 | 3:30 PM

ఇంగ్లండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీతో చెలరేగాడు. అయితే శతకం బాదిన జడ్డూను ఇంగ్లీష్ పేసర్ అండర్సన్ ఎగతాళి చేశాడు.

ఇంగ్లండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీతో చెలరేగాడు. అయితే శతకం బాదిన జడ్డూను ఇంగ్లీష్ పేసర్ అండర్సన్ ఎగతాళి చేశాడు.

  • Published Feb 16, 2024 | 3:30 PMUpdated Feb 16, 2024 | 3:30 PM
IND vs ENG: వీడియో: ఎగతాళి చేస్తూ.. జడేజాను దారుణంగా అవమానించిన అండర్సన్‌!

రాజ్​కోట్ టెస్టులో భారత స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా (112) సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ సెలక్ట్ చేసుకున్నాడు. అయితే మన టీమ్​కు సరైన స్టార్ట్ దొరకలేదు. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10) తక్కువ స్కోరుకే ఔట్ అయ్యాడు. ఫస్ట్​ డౌన్​లో బ్యాటింగ్​కు దిగిన శుబ్​మన్ గిల్ (0) గోల్డెన్ డక్​గా వెనుదిరిగాడు. రజత్ పాటిదార్ (5) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. దీంతో తీవ్ర ఇబ్బందుల్లో పడిన భారత్​ను సారథి రోహిత్ (131) ఆదుకున్నాడు. జడ్డూతో కలసి ఇన్నింగ్స్​ను ముందుకు నడిపించాడు. వీళ్లిద్దరూ నాలుగో వికెట్​కు 204 పరుగులు జోడించారు. ఆ తర్వాత హిట్​మ్యాన్ ఔటైనా జడ్డూ ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లాడు. అయితే సెంచరీ తర్వాత అతడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా ఇంగ్లీష్ పేసర్ జేమ్స్ అండర్సన్ అతడ్ని ఎగతాళి చేశాడు.

జడేజా 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు అనవసర రన్​కు ప్రయత్నించడంతో సర్ఫరాజ్ ఖాన్ (62) బలయ్యాడు. తన వల్ల సర్ఫరాజ్ రనౌట్ కావడంతో జడ్డూ నిరాశలో కూరుకుపోయాడు. అయినా బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అండర్సన్ బౌలింగ్​లో సింగిల్​తో సెంచరీ పూర్తి చేసుకున్న స్టార్ ఆల్​రౌండర్ తన ట్రేడ్ మార్క్ స్టయిల్​లో బ్యాట్​ను కత్తిలా తిప్పాడు. స్టేడియంలోని ఆడియెన్స్ అందరూ ఈలలు, గోలలతో హోరెత్తించగా.. జడ్డూ బ్యాట్​ను తిప్పుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే అతడ్ని అండర్సన్ అవమానించాడు. బ్యాట్​ను ఇలా తిప్పడం ఏంటంటూ చేతితో సంజ్ఞ చేస్తూ జడ్డూను అవమానించాడు. ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మానుకో అంటూ ఎగతాళి చేశాడు. అయినా జడేజా సంయమనం కోల్పోలేదు.

అండర్సన్ అవమానించినా సంయమనం కోల్పోని జడేజా తన పని తాను చేసుకుంటూ పోయాడు. జడ్డూను అండర్సన్ ఎగతాళి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ ఇంగ్లీష్ పేసర్​కు ఇచ్చిపడేస్తున్నారు. అంత అనుభవం ఉన్న బౌలర్ అయి ఉండి ఇలా బిహేవ్ చేయడం ఏంటని సీరియస్ అవుతున్నారు. సెంచరీ పూర్తయ్యాక సెలబ్రేట్ చేసుకోవడం మామూలేనని.. సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడినోడ్ని మెచ్చుకోవాల్సింది పోయి ఇలా అవమానించడం సరికాదని సీరియస్ అవుతున్నారు. దీనికి జడేజా, భారత టీమ్ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుందని అంటున్నారు. అండర్సన్ అంతకంతా అనుభవించక తప్పదని.. జడ్డూ అతడ్ని ఇక్కడితో వదలడని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. అండర్సన్-జడేజా వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs ENG: బ్యాటింగ్‌కు దిగకుండానే ఇంగ్లండ్‌కు ఫ్రీగా 5 రన్స్‌! అశ్విన్‌ చేసిన పనితో..