Nidhan
టీమిండియా మరో సూపర్ ఫైట్‌కు సిద్ధమైంది. బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది రోహిత్ సేన. ఆఫ్ఘానిస్థాన్ మ్యాచ్‌తో టచ్‌లోకి వచ్చిన కింగ్ కోహ్లీ.. ఇవాళ ఎలా ఆడతాడో చూడాలి.
టీమిండియా మరో సూపర్ ఫైట్‌కు సిద్ధమైంది. బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది రోహిత్ సేన. ఆఫ్ఘానిస్థాన్ మ్యాచ్‌తో టచ్‌లోకి వచ్చిన కింగ్ కోహ్లీ.. ఇవాళ ఎలా ఆడతాడో చూడాలి.
Nidhan
టీమిండియా మరో సూపర్ ఫైట్‌కు సిద్ధమైంది. బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది రోహిత్ సేన. ఆఫ్ఘానిస్థాన్‌పై గెలుపుతో సూపర్-8ని అద్భుతంగా స్టార్ట్ చేసిన భారత్.. అదే జోరును బంగ్లా మీద కూడా కొనసాగించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే సెమీస్ బెర్త్ దాదాపు కన్ఫర్మ్ అవుతుంది. అందుకే బంగ్లాను చితగ్గొట్టాలని చూస్తోంది మెన్ ఇన్ బ్లూ. అటు షకీబల్ సేన కూడా గెలవాలని కసిగా ఉంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో మట్టికరిచిన నేపథ్యంలో ఇవాళ ఓడితే ఆ టీమ్ ఇంటిదారి పట్టాల్సిందే. సెమీస్ రేసులో ఉండాలంటే విజయం కంపల్సరీ కాబట్టి తమ సర్వశక్తులూ ఒడ్డి భారత్‌ను అడ్డుకోవాలని చూస్తోంది. దీంతో ఈ మ్యాచ్ నువ్వానేనా అంటూ సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, ఈ మ్యాచ్‌లో అందరి ఫోకస్ కింగ్ కోహ్లీ మీద ఉండనుంది.
ఆఫ్ఘానిస్థాన్ మ్యాచ్‌తో టచ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. ఇవాళ ఎలా ఆడతాడోననేది ఆసక్తికరంగా మారింది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లో అతడు దారుణంగా పెర్ఫార్మ్ చేశాడు. కేవలం 5 పరుగులే చేసి అందర్నీ తీవ్రంగా నిరాశపర్చాడు. అయితే ఆఫ్ఘాన్ మీద 24 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. క్రీజులో చాలా సేపు గడిపిన కింగ్.. ఓపికగా పరుగులు చేసేందుకు ప్రయత్నించాడు. డిఫరెంట్ షాట్స్ కొడుతూ ఫామ్ అందుకున్నట్లే కనిపించాడు. అయితే భారీ స్కోరు బాదుతాడనుకుంటే ఔటై పెవిలియన్‌కు చేరాడు. బంగ్లాతో మ్యాచ్‌లో మరింత కసిగా ఆడాలని అతడు భావిస్తున్నాడు. ఈ తరుణంలో కోహ్లీ గురించి మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అభిమానులు ఆశించినంత మేర తాను పరుగులు చేయడం లేదని అతడు హర్ట్ అయ్యాడని అన్నాడు.
‘పవర్ఫుల్ పర్సన్స్ తమ పవర్ చూపించకపోతే హర్ట్ అవుతారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అతడో పవర్ఫుల్ బ్యాటర్. కానీ వరల్డ్ కప్‌లో తన సామర్థ్యం మేర రాణించలేదు. దీంతో అతడు హర్ట్ అయ్యాడు. అతడు ఆకలి మీద ఉన్నాడు. పరుగుల వరద పారించాలని పట్టుదలతో ఉన్నాడు. హర్ట్ అయిన కోహ్లీ మరింత ప్రమాదకరం. అతడు మానసికంగా చాలా బలంగా ఉన్నాడు. తన తప్పులను అదుపు చేసి వాటి మీద స్వారీ చేసే సత్తా అతడికి ఉంది. ట్రెయినింగ్ ద్వారా మిస్టేక్స్‌ను అతడు తగ్గించుకుంటాడు. అలాంటోడు హర్ట్ అయితేనే మంచిది. ఫెయిల్యూర్ ద్వారా మరింత స్ట్రాంగ్‌గా అతడు కమ్‌బ్యాక్ ఇస్తాడు’ అని సిద్ధు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కోహ్లీ డేంజరస్‌గా ఉన్నాడని.. అతడ్ని ఆపడం ఎవరి వల్లా కాదన్నాడు. మరి.. కోహ్లీ హర్ట్ అయితేనే మంచిది అంటూ సిద్ధు చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Navjot Singh Sidhu said – “If a powerful person doesn’t showcase his power, then that person get hurt. And hurt Virat Kohli is more dangerous and He is mentally very strong”. (Star Sports). pic.twitter.com/4LQl9J3WUN
— Tanuj Singh (@ImTanujSingh) June 22, 2024