iDreamPost

సంజూ శాంసన్​కు ఇన్ని కష్టాలు ఎందుకు? అతడ్ని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

  • Author singhj Published - 10:42 AM, Thu - 23 November 23

సంజూ శాంసన్​ను కష్టాలు వీడటం లేదు. భారత జట్టులో తన ప్లేస్​ను పర్మినెంట్​ చేసుకుందామని అనుకుంటున్న ఈ బ్యాటర్​కు మరోసారి మొండిచెయ్యి ఎదురైంది.

సంజూ శాంసన్​ను కష్టాలు వీడటం లేదు. భారత జట్టులో తన ప్లేస్​ను పర్మినెంట్​ చేసుకుందామని అనుకుంటున్న ఈ బ్యాటర్​కు మరోసారి మొండిచెయ్యి ఎదురైంది.

  • Author singhj Published - 10:42 AM, Thu - 23 November 23
సంజూ శాంసన్​కు ఇన్ని కష్టాలు ఎందుకు? అతడ్ని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

వన్డే వరల్డ్ కప్-2023 టోర్నమెంట్ ముగియడంతో ఇప్పుడు ఫోకస్ వేరే సిరీస్​లపై మళ్లింది. ప్రతిష్టాత్మక మెగా టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి భారత్ కప్పును మిస్‌ చేసుకుంది. దీంతో టీమిండియా క్రికెటర్లు సహా ఫ్యాన్స్, ఆడియెన్స్ అందరూ ఎంతో నిరాశకు లోనయ్యారు. కప్పు కోల్పోయామనే బాధలో నుంచి బయటకు రావడం లేదు. అయితే మరో 7 నెలల్లో టీ20 వరల్డ్ కప్ ఉన్నందున ఇక ఆ వైపు దృష్టి పెట్టేందుకు రెడీ అవుతున్నారు. పొట్టి ఫార్మాట్​లో కప్పు కొట్టే వేటను ఆసీస్​తో టీ20 సిరీస్​తో మొదలుపెట్టనుంది. నవంబర్ 23 నుంచి ఈ రెండు టీమ్స్ మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్ మొదలవ్వనుంది.

వరల్డ్‌ కప్ ఫైనల్ ఓటమికి ఆస్ట్రేలియాపై రివేంజ్ తీసుకోవడంతో పాటు తమ టీ20 సన్నాహాలను మరింత పదును పెట్టేందుకు ఈ సిరీస్​ను చేజిక్కించుకోవాలని టీమిండియా అనుకుంటోంది. ఈ సిరీస్​ కోసం 15 మంది సభ్యులతో టీమ్​ను ప్రకటించింది సెలక్షన్ కమిటీ. అయితే ఇందులో యంగ్ బ్యాటర్ సంజూ శాంసన్​కు మాత్రం చోటు దక్కలేదు. దీంతో సెలక్టర్ల తీరుపై సోషల్ మీడియాల నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. సంజూ మీద ఎందుకంత కక్ష అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అతడ్ని వరల్డ్ కప్​కు సెలక్ట్ చేయలేదు.. ఏషియా గేమ్స్​కూ పంపలేదు.. కనీసం ఆసీస్​తో సిరీస్​కైనా తీసుకోవాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో చూసుకుంటే భారత జట్టు తరఫున తనకు ఛాన్స్ వచ్చిన ప్రతి సిరీస్​తో సంజూ శాంసన్ ఆకట్టుకున్నాడు. అయినా సరే ఎందుకో అతడ్ని దూరంగా ఉంచుతూ వస్తున్నారు. గత టీ20 వరల్డ్ కప్​లో సంజూకు అవకాశం ఇస్తారని అనుకున్నారు. కానీ అతడికి ఛాన్స్ దక్కలేదు. అయితే ఈ వికెట్ కీపింగ్ బ్యాట్స్​మన్​ను వన్డే వరల్డ్ కప్ కోసం రెడీ చేస్తున్నామని.. అందుకే 50 ఓవర్ల ఫార్మాట్​లో ఆడిస్తున్నామని టీమ్ మేనేజ్​మెంట్ చెప్పింది. కానీ ఈ ఏడాది స్టార్టింగ్​లో సడన్​గా ప్లాన్ మార్చేసి అతడ్ని వన్డే వరల్డ్ కప్ కాదు.. టీ20 ప్రపంచ కప్​లో ఆడించాలని నిర్ణయించుకుంది. అందుకే ఆసియా కప్​కు, ఆ తర్వాత ఆసీస్​తో వన్డే సిరీస్​కు అతడ్ని సెలక్ట్ చేయలేదు.

ఆసియా క్రీడలకు సంజూ శాంసన్​ను పంపుతారని అంతా అనుకున్నారు. కానీ ఆ జట్టులోనూ అతడికి ఛాన్స్ దక్కలేదు. టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్​లో ఉండాలంటే ఇప్పటి నుంచి జరిగే పొట్టి ఫార్మాట్ సిరీస్​ల్లో అతడ్ని ఆడించాలి. కానీ తాజాగా కంగారూలతో టీ20 సిరీస్​కూ సంజూకు అవకాశం ఇవ్వలేదు సెలక్టర్లు. దీన్ని బట్టి టీమ్ మేనెజ్​మెంట్, సెలక్టర్లకు సంజూపై ఇంట్రెస్ట్ లేదని.. నెక్స్ట్ వరల్డ్ కప్​లో ఆడించే ఛాన్స్ లేదని తేలిపోయింది. ఇదంతా చూసిన ఫ్యాన్స్.. బీసీసీఐపై సీరియస్ అవుతున్నారు.

సంజూ శాంసన్ కెరీర్​ను కావాలనే నాశనం చేస్తున్నారని అతడి అభిమానులు విమర్శిస్తున్నారు. మరోవైపు భారత్ టీమ్ తరఫున తనకు వచ్చిన ఛాన్సులను అతడు యూజ్ చేసుకున్నప్పటికీ భారీ ఇన్నింగ్స్​లు ఆడటంలో, మ్యాచ్​లు ఫినిష్ చేయడంలో ఫెయిలయ్యాడు. ఇటీవల ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ పూర్తిగా నిరాశపర్చాడు. కేరళ తరఫున ఆడిన ఎనిమిది మ్యాచుల్లో కేవలం 138 రన్స్ చేశాడు శాంసన్. అయినా కూడా అతడ్ని తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేయడం సరికాదని కొందరు నెటిజన్స్ అంటున్నారు. మరి.. సంజూ శాంసన్ విషయంలో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: క్రికెట్​లో మరో కొత్త రూల్ తీసుకొచ్చిన ICC.. ఇక మీదట అలా చేస్తే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి