iDreamPost

క్రికెట్​లో మరో కొత్త రూల్ తీసుకొచ్చిన ICC.. ఇక మీదట అలా చేస్తే..!

  • Author singhj Updated - 03:51 PM, Thu - 23 November 23

క్రికెట్​లో మరో కొత్త రూల్​ను తీసుకొచ్చేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సిద్ధమైంది. ఈ నిబంధనను అతిక్రమిస్తే మ్యాచ్ రిజల్ట్ తారుమారయ్యే ప్రమాదం ఉంది.

క్రికెట్​లో మరో కొత్త రూల్​ను తీసుకొచ్చేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సిద్ధమైంది. ఈ నిబంధనను అతిక్రమిస్తే మ్యాచ్ రిజల్ట్ తారుమారయ్యే ప్రమాదం ఉంది.

  • Author singhj Updated - 03:51 PM, Thu - 23 November 23
క్రికెట్​లో మరో కొత్త రూల్ తీసుకొచ్చిన ICC.. ఇక మీదట అలా చేస్తే..!

ఎంతో ఉత్కంఠగా సాగుతూ, దాదాపు ఏడు వారాల పాటు క్రికెట్ లవర్స్​ను ఎంతగానో అలరించిన వన్డే వరల్డ్ కప్-2023 ముగిసింది. ఒక దానికి మించి మరో మ్యాచ్, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్​తో ఆడియెన్స్​ను కట్టిపడేసింది మెగా టోర్నీ. ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ కోసం జరిగిన ఫైనల్లో ఫేవరెట్ టీమ్స్ అయిన ఆస్ట్రేలియా, ఇండియా పోటీపడ్డాయి. టోర్నమెంట్ మొత్తం బెస్ట్ క్రికెట్ ఆడిన ఈ రెండు జట్లు ఫైనల్​కు చేరుకోవడంతో తుది పోరు అదిరిపోతుందని, టైటిల్ కోసం ఆసీస్-భారత్ కొదమసింహాల్లా పోరాడతాయని అందరూ భావించారు. అయితే ఎవరూ ఎక్స్​పెక్ట్ చేయని విధంగా కంగారూ జట్టు మ్యాచ్​ను దాదాపుగా వన్​సైడ్​గా గెలిచింది.

ఫైనల్లో రోహిత్ సేన అనుకున్న ప్లాన్స్​ను ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిలైంది. మరోవైపు కమిన్స్ సేన మాత్రం ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్​లో తాము అనుకున్న తీరుగా డామినేట్ చేస్తూ భారత్​కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ఆరోసారి వరల్డ్ కప్ ట్రోఫీని ఆ టీమ్ గెలుచుకుంది. వరల్డ్ కప్​ను ముచ్చటగా మూడోసారి ఎత్తుకోవాలనుకున్న టీమిండియా కల నెరవేరలేదు. ఫైనల్లో ఓటమితో భారత క్రికెటర్లు, ఫ్యాన్స్, ఆడియెన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. మరో 7 నెలల్లో టీ20 ప్రపంచ కప్ ఉన్నందున ఇకపై టీమిండియా ఆడే పొట్టి ఫార్మాట్ మ్యాచులపై అందరి ఫోకస్ నెలకొంటుంది. ఆ టోర్నీలోనైనా భారత్ కప్పు గెలుస్తుందేమో చూడాలి.

ఇక, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అవసరాన్ని బట్టి క్రికెట్​లో కొత్త రూల్స్​ను తీసుకురావడం, పాత నిబంధనలను సవరించడం చేస్తుండటం కామనే. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్​లో తాజా మరో కొత్త రూల్ ప్రవేశపెట్టేందుకు ఐసీసీ రెడీ అయిపోయింది. బ్యాట్స్​మెన్​ టైమ్డ్ ఔట్ తరహాలోనే.. బౌలర్ ఆలస్యం చేస్తే పెనాల్టీ విధించాలని ఐసీసీ డిసైడ్ అయింది. బౌలింగ్ టైమ్​లో టీమ్స్ సుదీర్ఘ సమయం తీసుకుంటుండటంతో మ్యాచ్​లు లేట్​గా ముగుస్తున్నాయి. బౌలింగ్ టీమ్స్ సుదీర్ఘ సమయం తీసుకోవడం వల్ల మ్యాచ్​లు ఆలస్యంగా ముగుస్తుండటంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటికే స్లో ఓవర్ రేట్ పేరిట కెప్టెన్లతో పాటు ప్లేయర్లకు ఐసీసీ ఫైన్ వేస్తున్న సంగతి తెలిసిందే.

నిర్ణీత టైమ్​లో బౌలింగ్ చేయకపోతే 30 యార్డ్ సర్కిల్ బయట ఒక ఫీల్డర్​ను తక్కువ పెట్టే నిబంధనను కూడా తీసుకొచ్చింది. అయినా స్లో ఓవర్ రేట్ విషయంలో మార్పులు రాకపోవడంతో ఐసీసీ మరో కొత్త రూల్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. బౌలింగ్ టీమ్ మూడు సార్లు 60 సెకన్ల తర్వాత ఓవర్ స్టార్ట్ చేయడంలో గనుక విఫలమైతే 5 రన్స్ పెనాల్టీగా విధించనున్నారు. డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. ఇకపై స్టాప్ క్లాక్ సాయంతో ఓవర్ల మధ్య ఆలస్యాన్ని గుర్తించనున్నారు. ఈ రూల్ అమలై బౌలింగ్ టీమ్​పై 5 రన్స్ పెనాల్టీ విధిస్తే రిజల్ట్ తారుమారయ్యే ఛాన్స్ ఉంది. ఈ రూల్ బౌలర్లకు వ్యతిరేకంగా ఉందని.. దీని వల్ల క్రికెట్​లో అసలు మజా తగ్గుతుందని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. మరి.. ఐసీసీ కొత్త రూల్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆస్ట్రేలియాతో ఫస్ట్ టీ20.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి