iDreamPost
android-app
ios-app

టీమిండియా అరుదైన ఘనత.. వన్డే క్రికెట్​లో తొలి జట్టుగా ప్రపంచ రికార్డు!

  • Author singhj Published - 08:32 AM, Mon - 25 September 23
  • Author singhj Published - 08:32 AM, Mon - 25 September 23
టీమిండియా అరుదైన ఘనత.. వన్డే క్రికెట్​లో తొలి జట్టుగా ప్రపంచ రికార్డు!

వన్డే వరల్డ్ కప్​కు ముందు టీమిండియా ప్లేయర్లు ఒక్కొక్కరుగా అందరూ ఫామ్​లోకి వస్తున్నారు. ఆసియా కప్​లోనే చాలా మంది భారత ఆటగాళ్లు గాడిలో పడగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్​లో మిగిలిన వాళ్లు కూడా సత్తా చాటుతున్నారు. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ వరకు భారత్​కు ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా అన్నీ పరిష్కారమవుతున్నాయి. ఇదే చివరి ఛాన్స్, ఇప్పుడు ఆడకపోతే ప్రపంచ కప్ టీమ్​లో చోటు కష్టమే అనే కామెంట్స్ మధ్య శ్రేయాస్ అయ్యర్ చెలరేగిపోయాడు. ఆందోళనలు, అనుమానాలు, భయాలను పోగొడుతూ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో శతక్కొట్టాడు. ఫామ్​ను, ఫిట్​నెస్​ను నిరూపించుకున్నాడు.

ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో శ్రేయాస్ అయ్యర్​ (105)తో పాటు సూపర్ ఫామ్​లో ఉన్న యువ ఓపెనర్ శుబ్​మన్ గిల్ (104) అదరగొట్టాడు. తన మీద ఉన్న అంచనాలను, జట్టు ధీమాను పెంచుతూ అలవోకగా మరో సెంచరీ బాదేశాడు. కెప్టెన్​ కేఎల్ రాహుల్​ (52)తో పాటు సూర్యకుమార్ యాదవ్ (72 నాటౌట్) కూడా తమ ఫామ్​ను చాటుకున్నారు. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు భారీ స్కోరు చేసింది. వాన కారణంగా ఆసీస్ లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 రన్స్​కు సవరించారు. అయితే అశ్విన్ (3/41), జడేజా (3/42), ప్రసిద్ధ్ కృష్ణ (2/56) ధాటికి ఆ టీమ్ 28.2 ఓవర్లలో 217 రన్స్​కే ఆలౌటైంది.

ఆసీస్ జట్టులో అబాట్ (54) టాప్ స్కోరర్. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (53) కూడా రాణించాడు. ఈ విక్టరీతో టీమిండియా సిరీస్​లో 2-0 ఆధిక్యం సంపాదించింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరుగుతుంది. ఇక, రెండో వన్డేలో భారత జట్టు చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్​లో టీమిండియా క్రికెటర్లు రికార్డు స్థాయిలో 18 సిక్సర్లు బాదారు. దీంతో వన్డే క్రికెట్​లో 3,000 సిక్సర్ల మార్క్​ను తాకిన ఫస్ట్ టీమ్​గా భారత్ (3,007) వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. వన్డేల్లో ఇప్పటిదాకా ఏ జట్టు కూడా 3 వేల సిక్సర్లు కొట్టలేదు. భారత్ తర్వాతి ప్లేసులో వెస్టిండీస్ (2,953), పాకిస్థాన్ (2,566), ఆస్ట్రేలియా (2,476). న్యూజిలాండ్ (2,387), ఇంగ్లండ్ (2,032) ఉన్నాయి.

ఇదీ చదవండి: అయ్యర్ మెరుపు సెంచరీ.. అసలైన కమ్​బ్యాక్ ఇది!