ఆసీస్‌తో ఆఖరి టీ20లో స్పీడ్‌స్టర్ అర్ష్‌దీప్ సింగ్ వేసిన చివరి ఓవర్ మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పాలి. అతడి బౌలింగ్ చూసి ఏం వేశాడు భయ్యా అంటున్నారు అభిమానులు.
ఆసీస్‌తో ఆఖరి టీ20లో స్పీడ్‌స్టర్ అర్ష్‌దీప్ సింగ్ వేసిన చివరి ఓవర్ మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పాలి. అతడి బౌలింగ్ చూసి ఏం వేశాడు భయ్యా అంటున్నారు అభిమానులు.
యంగ్ భారత్ దూకుడు మామూలుగా లేదు. సీనియర్లతో కూడిన పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా.. లాస్ట్ పంచ్ కూడా ఇచ్చి ఫ్యాన్స్‌కు ఆనందాన్ని పంచింది. కంగారూ జట్టుతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌ను 4-1తో ముగించింది. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఉండటంతో హైదరాబాద్‌లో జరగాల్సిన ఐదో టీ20ని బెంగళూరుకు షిఫ్ట్ చేశారు. అక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది టీమిండియా. ట్రిక్కీ పిచ్ మీద టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 రన్స్ మాత్రమే చేయగలిగింది. 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన మన జట్టు.. ఆ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే శ్రేయస్ అయ్యర్ (53) వల్లేనని చెప్పాలి.
బ్యాటింగ్‌కు కష్టంగా మారిన పిచ్ మీద నిలబడితే రన్స్ ఈజీగా వస్తాయని గ్రహించాడు అయ్యర్. తొలుత జితేష్ శర్మ (24) ఆ తర్వాత అక్షర్ పటేల్ (31)తో కలసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయ్యర్ పట్టుదలతో ఆడకపోయి ఉంటే టీమిండియా 160 చేయగలిగేది కాదు. ఇది తక్కువ స్కోరుగా అనిపించినా మందకొడి పిచ్ మీద ఛేజింగ్ కష్టం కాబట్టి భారత్‌కు గెలుపు అవకాశాలు కనిపించాయి. ఛేజింగ్‌కు దిగిన ఆసీస్‌ను ఆదిలోనే దెబ్బకొట్టాడు పేసర్ ముకేష్ కుమార్. జోష్ ఫిలిప్ (4)ను వెనక్కి పంపాడు. ట్రావిస్ హెడ్ (28) కాసేపు భయపెట్టినప్పటికీ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అతడ్ని బౌల్డ్ చేశాడు.
ఆరోన్ హార్డ్ (6)నూ బిష్ణోయే ఔట్ చేశాడు. అయితే టిమ్ డేవిడ్ (17), మ్యాట్ షార్ట్ (16)తో కలసి చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పాడు బెన్ మెక్‌డెర్మాట్ (54). ఐదు భారీ సిక్సులు బాదిన బెన్.. ఆసీస్‌ను గెలిపించేలా కనిపించాడు. కానీ అతడ్ని పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేశాడు. ఆఖర్లో మ్యాథ్యూ వేడ్ (22) తన టీమ్‌ను గెలిపించేందుకు ఎంతగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో అసలైన హీరో మాత్రం అర్ష్‌దీప్ అనే చెప్పాలి. ఆఖరి ఓవర్లో ఆస్ట్రేలియా గెలుపునకు 10 రన్స్ కావాలి. క్రీజులో ఉన్నది డేంజరస్ బ్యాటర్ మ్యాథ్యూ వేడ్. అంతకుముందు 3 ఓవర్లు వేసిన అర్ష్‌దీప్ 37 రన్స్ ఇచ్చుకున్నాడు. దీంతో అతడితో లాస్ట్ ఓవర్ వేయించి సూర్యకుమార్ తప్పు చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ కెప్టెన్ డెసిజన్ వర్కౌట్ అయింది. చివరి ఓవర్లో కేవలం 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు అర్ష్‌దీప్.
ఒక్కసారిగా రిథమ్‌లోకి వచ్చిన అర్ష్‌దీప్ సూపర్బ్‌గా బౌలింగ్ చేశాడు. 138 కిలోమీటర్ల నుంచి 145 కిలోమీటర్ల స్పీడ్‌తో బౌలింగ్ చేస్తూ వేడ్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. అతడికి రన్స్ ఇవ్వడం పక్కనబెడితే బాల్ కూడా టచ్ కాకుండా చూసుకున్నాడు. దీంతో ఫ్రస్టేషన్లో షాట్ కొట్టబోయి ఔటయ్యాడు వేడ్. ఆ తర్వాత కూడా ఆఖరి మూడు బంతులు అద్భుతంగా వేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు అర్ష్‌దీప్. అంతుకుముందు ఓవర్లో ముకేశ్ భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. వేడ్ సూపర్ టచ్‌లో ఉన్నాడు గనుక 10 రన్స్ ఈజీగా కొట్టేస్తారని అంతా అనుకున్నారు. కానీ కూల్‌గా, కంపోజ్‌గా కనిపించిన అర్ష్‌దీప్ తన పని తాను చేసుకుపోయాడు. బ్యాటింగ్‌లో అయ్యర్ చేసిన పనిని బౌలింగ్‌లో అర్ష్‌దీప్ చేసి జట్టును గెలిపించాడు. అందుకే ఇది చూసిన ఫ్యాన్స్ ఈ ఓవర్ శానా యేళ్లు యాదుంటాది అంటున్నారు. మరి.. అర్ష్‌దీప్ లాస్ట్ ఓవర్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IND vs AUS: ఆసీస్‌తో ఆఖరి టీ20.. టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు ఇవే!
ARSHDEEP SINGH THE HERO….!!!
Australia needed 10 in 6 – 0,0,W,1,1,1 to win it for India! What a victory, a fantastic series win. pic.twitter.com/599g0NNMYG
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 3, 2023
Arshdeep Singh is still in the ring 🥊
A death-bowling masterclass by #TeamIndia bowling super 🌟 seals victory!🫶#IDFCFirstBankT20ITrophy #JioCinemaSports #INDvAUS pic.twitter.com/njXsZHBvlq
— JioCinema (@JioCinema) December 3, 2023