iDreamPost

Rohit Sharma: వీడియో: రోహిత్ స్విచ్‌ హిట్.. దీని ముందు మ్యాక్స్​వెల్​ కూడా పనికిరాడు!

  • Published Jan 17, 2024 | 10:01 PMUpdated Jan 17, 2024 | 10:01 PM

కెప్టెన్ రోహిత్ శర్మ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది అతడి పుల్ షాటే. కానీ దీంతో పాటు అతడి అమ్ములపొదిలో చాలా షాట్స్ ఉన్నాయి. అవన్నీ ఆఫ్ఘానిస్థాన్​తో మూడో టీ20లో బయటకు తీశాడు హిట్​మ్యాన్.

కెప్టెన్ రోహిత్ శర్మ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది అతడి పుల్ షాటే. కానీ దీంతో పాటు అతడి అమ్ములపొదిలో చాలా షాట్స్ ఉన్నాయి. అవన్నీ ఆఫ్ఘానిస్థాన్​తో మూడో టీ20లో బయటకు తీశాడు హిట్​మ్యాన్.

  • Published Jan 17, 2024 | 10:01 PMUpdated Jan 17, 2024 | 10:01 PM
Rohit Sharma: వీడియో: రోహిత్ స్విచ్‌ హిట్.. దీని ముందు మ్యాక్స్​వెల్​ కూడా పనికిరాడు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన విశ్వరూపం చూపించాడు. ఆఫ్ఘానిస్థాన్​తో జరుగుతున్న మూడో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు హిట్​మ్యాన్. ఎదురొచ్చిన ప్రతి బౌలర్​ను చితగ్గొడుతూ సెంచరీతో వీరవిహారం చేశాడు. 69 బంతుల్లో 11 బౌండరీలు, 8 సిక్సులతో ఏకంగా 121 పరుగులు చేశాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన హిట్​మ్యాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) మూడో ఓవర్​లోనే ఔటయ్యాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (0) కూడా అదే ఓవర్​లో గోల్డెన్ డక్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబె (1), సంజూ శాంసన్ (0) కూడా ఫెయిలయ్యారు. ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రోహిత్​పై పడింది. దీంతో రింకూ సింగ్ (69 నాటౌట్)తో కలసి చెలరేగిపోయాడు హిట్​మ్యాన్.

రోహిత్ శర్మ అంటే అందరికీ పుల్ షాట్ మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ ఆఫ్ఘాన్​తో చివరి టీ20లో తన అమ్ములపొదిలోని అన్ని షాట్లను బయటకు తీశాడు హిట్​మ్యాన్. క్రికెట్​ బుక్​లోని షాట్స్ ఆడుతూనే టీ20ల్లో బాగా ఫేమస్ అయిన స్విచ్ హిట్ కూడా ప్రయత్నించాడు రోహిత్. పిచ్ నుంచి స్పిన్నర్లకు మద్దతు లభిస్తుండటంతో వారి రిథమ్​ను దెబ్బతీసేందుకు హిట్​మ్యాన్ ఎక్కువగా స్విచ్ షాట్లు కొట్టాడు. అవి భలేగా వర్కౌట్ అయ్యాయి. ఈ క్రమంలో షరాఫుద్దీన్ అష్రాఫ్​ వేసిన ఓ బాల్​ను ఏకంగా సిక్స్​కు తరలించాడు. బాల్ రిలీజ్ కాగానే స్టాన్స్ మార్చిన రోహిత్ స్విచ్ షాట్​తో బాల్​ను పర్ఫెక్ట్​గా కనెక్ట్ చేశాడు. దీంతో బాల్ వెళ్లి స్టాండ్స్​లో పడింది. ఈ షాట్​కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన అభిమానులు సూపర్బ్ షాట్ అని మెచ్చుకుంటున్నారు.

రోహిత్ ఇన్నింగ్స్​లో స్విచ్ షాట్ హైలైట్ అని అంటున్నారు ఫ్యాన్స్. టీ20లకు తగ్గట్లుగా అతడు తన బ్యాటింగ్ శైలిని మార్చుకోవడాన్ని మెచ్చుకోవాల్సిందేనని చెబుతున్నారు. ఇలాంటి డిఫరెంట్ షాట్స్​ కూడా హిట్​మ్యాన్ అమ్ములపొదిలో చేరితే అతడ్ని ఆపడం ఎవరి తరం కాదంటున్నారు. అసలైన స్విచ్ హిట్ అంటే ఇది అంటున్నారు. దీని ముందు ఆస్ట్రేలియా ఆల్​రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ స్విచ్ హిట్ పనికి రాదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్​లో కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘాన్ ప్రస్తుతం 11.1 ఓవర్లకు 93/1 స్కోరుతో ఉంది. ఇబ్రహీం జాద్రాన్ (39 నాటౌట్), గుల్బదీన్ నయీబ్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఆఫ్ఘాన్ నెగ్గాలంటే 51 బంతుల్లో 120 పరుగులు చేయాల్సి ఉంటుంది. మరి.. రోహిత్ శర్మ స్విచ్ హిట్​ చూశాక మీకేం అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Sanju Samson: రాకరాక అవకాశం వస్తే నేలపాలు చేశాడు.. సంజూ తప్పు నీదే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి