iDreamPost

IND vs AFG: ఆఫ్ఘాన్​తో సెకండ్ T20.. రెండు మార్పులతో బరిలోకి భారత్!

  • Published Jan 14, 2024 | 11:00 AMUpdated Jan 14, 2024 | 11:00 AM

టీమిండియా మరో సిరీస్​ గెలిచేందుకు అడుగు దూరంలో ఉంది. ఆఫ్ఘానిస్థాన్​తో జరిగే రెండో టీ20లో నెగ్గితే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​లో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా మరో సిరీస్​ గెలిచేందుకు అడుగు దూరంలో ఉంది. ఆఫ్ఘానిస్థాన్​తో జరిగే రెండో టీ20లో నెగ్గితే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​లో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 14, 2024 | 11:00 AMUpdated Jan 14, 2024 | 11:00 AM
IND vs AFG: ఆఫ్ఘాన్​తో సెకండ్ T20.. రెండు మార్పులతో బరిలోకి భారత్!

ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్​ను ఊహించినట్లుగానే గ్రాండ్​గా స్టార్ట్ చేసింది టీమిండియా. తొలి మ్యాచ్​లో 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘాన్​ను చిత్తు చేసింది. ఇప్పుడు రెండో మ్యాచులోనూ నెగ్గి సిరీస్​ను పట్టేయాలని చూస్తోంది. ఈ సిరీస్ గెలవడం రోహిత్ సేనకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఈ ఏడాది జూన్​లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో సాధ్యమైనన్ని ప్రయోగాలు చేయాలని అనుకుంటోంది టీమిండియా. పొట్టి ఫార్మాట్​లో జరిగే ప్రపంచ కప్​కు ముందు భారత్ ఆడే ఆఖరి టీ20 సిరీస్ ఇదే కానుంది. ఆ తర్వాత ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్, ఐపీఎల్ అంటూ బిజీ అయిపోనుంది. దీంతో టీమ్ కాంబినేషన్ విషయంలో ఒక అంచనాకు వచ్చేందుకు మిగిలిన రెండు టీ20లను ఫుల్​గా యూజ్ చేసుకోవాలని కెప్టెన్ రోహిత్​తో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ ఫిక్స్ అయ్యారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కమ్​బ్యాక్ ఇవ్వనుండటంతో ఇవాళ జరిగే రెండో టీ20 ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

సెకండ్ టీ20లో భారత జట్టులో ప్రధానంగా రెండు మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ ఆటగాడు కోహ్లీ రీఎంట్రీ ఇస్తుండటంతో హైదరాబాదీ తిలక్ వర్మ బెంచ్​కు పరిమితం అవుతాడు. టీ20 కెరీర్​ను గొప్పగా స్టార్ట్ చేసిన తిలక్ దాన్ని కంటిన్యూ చేయడంలో మాత్రం తడబడుతున్నాడు. గత 13 ఇన్నింగ్స్​ల్లో ఈ లెఫ్టాండర్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. కాబట్టి కోహ్లీ రాకతో తిలక్ బెంచ్​కు వెళ్లడం ఖాయం. శుబ్​మన్ గిల్ కూడా ఆడేది కష్టంగానే ఉంది. ఆరోగ్య సమస్యలతో ఫస్ట్ టీ20కి దూరమైన ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫిట్​నెస్​ సాధిస్తే గిల్​ కూడా బెంచ్​పై కూర్చోవాల్సిందే. కాబట్టి రోహిత్ శర్మకు జతగా గిల్, జైస్వాల్​ల్లో ఒకరు మాత్రమే ఓపెనర్​గా ఆడాల్సి ఉంటుంది. ఆల్​రౌండర్ శివమ్ దూబేపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. తొలి టీ20లో అటు బౌలింగ్​లో కీలక వికెట్ తీయడంతో పాటు ఇటు బ్యాటింగ్​లో విధ్వంసక ఇన్నింగ్స్​ ఆడటంతో మరోసారి తనపై అందరి ఫోకస్ పడేలా చేశాడు.

టీ20 వరల్డ్ కప్-2024 స్క్వాడ్​లో చోటు దక్కించుకోవాలంటే ఆఫ్ఘాన్​తో జరిగే తదుపరి రెండు టీ20లనూ దూబె చక్కగా వినియోగించుకోవాలి. బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ అతడు మరింత ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాతో అతడు పోటీపడే ఛాన్స్ ఉంటుంది. ఇక, రెండో టీ20లో బ్యాటింగ్​లో రోహిత్, కోహ్లీ, దూబెతో పాటు వికెట్ కీపర్ జితేష్ శర్మ, రింకూ సింగ్​ ప్లేసెస్ ఫిక్స్. జైస్వాల్, గిల్​లో ఎవరో ఒకరు మాత్రమే ఆడతారు. బౌలింగ్ ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ కంటిన్యూ అవుతాడు. తొలి టీ20లో ఆడిన పేసర్లు అర్ష్​దీప్ సింగ్, ముకేష్ కుమార్​ను రెండో టీ20లోనూ ఆడించొచ్చు. ఫస్ట్ మ్యాచ్​లో విఫలమైన వాషింగ్టన్ సుందర్​నూ కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. చాన్నాళ్లుగా బెంచ్​ పైనే ఉంటున్న సుందర్​కు మరికొన్ని అవకాశాలు ఇవ్వాలని టీమ్ మేనేజ్​మెంట్ భావిస్తోందట. ఈ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న ఇండోర్​లోని హోల్కర్ స్టేడియం బ్యాటింగ్​ హెవెన్​గా మారింది. మంచు పడే ఛాన్స్ ఉంది కాబట్టి టాస్ నెగ్గిన జట్టు ఛేజింగ్​కు వెళ్లే ఆస్కారం ఉంది. మరి.. రెండో టీ20లో భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్​లో ఇంకేమైనా మార్పులు చేస్తే బాగుంటుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

భారత జట్టు (అంచనా):

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్/శుబ్​మన్ గిల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబె, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్​దీప్ సింగ్, ముకేశ్ కుమార్.

ఇదీ చదవండి: రోహిత్​పై యువీ షాకింగ్ కామెంట్స్.. గ్రేట్ కెప్టెనే కానీ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి