iDreamPost

Rohit-Kohli: T20ల్లోకి రోహిత్-కోహ్లీ.. షాకింగ్ కామెంట్స్ చేసిన కోచ్ ద్రవిడ్!

  • Published Jan 11, 2024 | 11:25 AMUpdated Jan 11, 2024 | 11:25 AM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చాన్నాళ్ల తర్వాత టీ20ల్లోకి కమ్​బ్యాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కోచ్ రాహుల్ ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చాన్నాళ్ల తర్వాత టీ20ల్లోకి కమ్​బ్యాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కోచ్ రాహుల్ ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

  • Published Jan 11, 2024 | 11:25 AMUpdated Jan 11, 2024 | 11:25 AM
Rohit-Kohli: T20ల్లోకి రోహిత్-కోహ్లీ.. షాకింగ్ కామెంట్స్ చేసిన కోచ్ ద్రవిడ్!

భారత క్రికెట్ జట్టు మరో ఇంట్రెస్టింగ్ సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఆఫ్ఘానిస్థాన్​తో మూడు టీ20ల సిరీస్​కు రోహిత్ సేన రెడీ అయింది. ఈ రెండు జట్ల మధ్య మొహాలీ వేదికగా ఇవాళ తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్​తో కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్​లోకి కమ్​బ్యాక్ ఇవ్వనున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా బరిలోకి దిగాల్సి ఉంది. కానీ అతడు ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. రోహిత్-కోహ్లీలు టీ20లు ఆడి దాదాపు 14 నెలలు దాటింది. గతేడాది వన్డే వరల్డ్ కప్ ఉండటంతో దాని మీదే వీళ్లిద్దరూ ఫోకస్ చేస్తూ వచ్చారు. మెగాటోర్నీ ముగిసి చాన్నాళ్లు కావడంతో వీళ్లు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్​ ఉండటంతో రోహిత్-కోహ్లీని మళ్లీ దించుతోంది బీసీసీఐ. అందులో భాగంగా ఆఫ్ఘాన్ సిరీస్​కు ఇద్దర్నీ సెలక్ట్ చేసింది. అయితే టీ20 క్రికెట్​లో వీళ్లిద్దరూ కమ్​బ్యాక్ ఇవ్వనుండటం​పై కోచ్ రాహుల్ ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

రోహిత్, కోహ్లీ సామర్థ్యంపై తనకు ఏమాత్రం డౌట్ లేదన్నాడు ద్రవిడ్. వాళ్లిద్దరూ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశాల్ని కొట్టి పారేయలేమని చెప్పాడు. ఎలాంటి బౌలింగ్ యూనిట్ మీదైనా రన్స్ చేయగల సత్తా వాళ్ల సొంతమన్నాడు. ఆఫ్ఘాన్​తో ఫస్ట్ టీ20కి ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్​లో భారత కోచ్ పైవ్యాఖ్యలు చేశాడు. ‘రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా ఆడతారు. టీమ్ అవసరాలను బట్టి ఛేంజెస్ చేసుకునే సౌలభ్యం మనకు ఉంది. ఓపెనర్​గా జైస్వాల్ ఆడుతున్న తీరు బాగుంది. అతడి విషయంలో మేం సంతోషంగా ఉన్నాం. అంతేగాక ఓపెనింగ్​లో లెఫ్ట్, రైట్ కాంబినేషన్ కూడా ఉంటుంది. అయితే విరాట్, రోహిత్ ఓపెనర్లుగా దిగే ఛాన్సులనూ కొట్టి పారేయలేం. వాళ్లిద్దరి సామర్థ్యం మీద సందేహమే లేదు. రింకూ సింగ్, జైస్వాల్, తిలక్ వర్మ వంటి లెఫ్టాండ్ ప్లేయర్స్ జట్టులో ఉండటం మంచిదే. కానీ పెర్ఫార్మెన్స్​ను బట్టే సెలక్షన్ ఉంటుంది. ఫినిషర్​గా రింకూ అదరగొడుతున్నాడు’ అని ద్రవిడ్ మెచ్చుకున్నాడు.

గత టీ20 వరల్డ్ కప్ తర్వాత వన్డే ప్రపంచ కప్ మీద ఫోకస్ పెట్టామని.. కానీ ఈ టోర్నీ తర్వాత తమకు ఎక్కువగా టీ20లు ఆడే ఛాన్స్ రాలేదన్నాడు ద్రవిడ్. ఈసారి పొట్టి కప్పుకు ప్రిపేర్ అయ్యేందుకు ఎక్కువ టైమ్ లేదన్నాడు. మిగిలిన మూడు మ్యాచులు, ఐపీఎల్ మీదే డిపెండ్ అవ్వాల్సి వస్తోందన్నాడు. ఇంగ్లండ్​తో 5 టెస్టులను దృష్టిలో పెట్టుకొని ఈ టీ20 సిరీస్​కు జస్​ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్​ను దూరం పెట్టాల్సి వచ్చిందన్నాడు ద్రవిడ్. పర్సనల్ రీజన్స్ వల్ల తొలి టీ20లో కోహ్లీ ఆడట్లేదని తెలిపాడు. అయితే రెండు, మూడు టీ20ల్లో విరాట్ పక్కాగా బరిలోకి దిగుతాడని పేర్కొన్నాడు. మరి.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీపై ద్రవిడ్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ఒంటికాలితో ఉన్నా ఆ ప్లేయర్​ను సెలక్ట్ చేయాల్సిందే: సునీల్ గవాస్కర్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి