iDreamPost

Team India: ఒంటికాలితో ఉన్నా ఆ ప్లేయర్​ను సెలక్ట్ చేయాల్సిందే: సునీల్ గవాస్కర్

  • Published Jan 11, 2024 | 9:46 AMUpdated Jan 11, 2024 | 8:57 PM

లెజెండ్ సునీల్ గవాస్కర్ ఓ టీమిండియా క్రికెటర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఒంటికాలితో ఉన్నా ఆ ప్లేయర్​ను సెలక్ట్ చేయాల్సిందేనని చెప్పాడు. గవాస్కర్ ఎవరి గురించి మాట్లాడాడో ఇప్పుడు తెలుసుకుందాం..

లెజెండ్ సునీల్ గవాస్కర్ ఓ టీమిండియా క్రికెటర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఒంటికాలితో ఉన్నా ఆ ప్లేయర్​ను సెలక్ట్ చేయాల్సిందేనని చెప్పాడు. గవాస్కర్ ఎవరి గురించి మాట్లాడాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 11, 2024 | 9:46 AMUpdated Jan 11, 2024 | 8:57 PM
Team India: ఒంటికాలితో ఉన్నా ఆ ప్లేయర్​ను సెలక్ట్ చేయాల్సిందే: సునీల్ గవాస్కర్

క్రికెట్​లో ప్రతి ప్లేయర్ కూడా కీలకమే. ఏ ఒక్కరి వల్లో గెలుపోటములు డిసైడ్ అవ్వవు. పదకొండు మంది కలసికట్టుగా ఆడితేనే జట్టు విజయం సాధిస్తుంది. ఒక మంచి ఆటగాడి వల్ల అన్నీ డిసైడ్ అవ్వకున్నా ఇంపాక్ట్ మాత్రం ఉంటుంది. టీమ్​లో అతడు ఉంటే చాలు.. మ్యాచ్​ గెలవడం పక్కా అనే ధీమా వస్తుంది. కొందరు సింగిల్ హ్యాండ్​తో మ్యాచ్​లను తారుమారు చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఆటగాళ్లు దొరికితే టీమ్స్​ అస్సలు వదులుకోవు. వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్లలో బిగ్ మ్యాచెస్​లో ఇలాంటి ఇంపాక్ట్ ప్లేయర్లు టీమ్​లో ఉండటం ఎంతో అవసరం. అలాంటి ఓ ఆటగాడి గురించి భారత దిగ్గజ బ్యాట్స్​మన్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ క్రికెటర్ ఒంటికాలితో ఉన్నా అతడ్ని భారత టీమ్​లోకి తీసుకోవాలని అన్నాడు. రిషబ్ పంత్​ను ఉద్దేశించే గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

రిషబ్ పంత్ ఒక్క కాలితో ఫిట్​గా ఉన్నా అతడ్ని టీ20 వరల్డ్ కప్-2024లో ఆడించాలన్నాడు గవాస్కర్. పంత్ గేమ్ ఛేంజర్ అని.. అతడ్ని టీమ్​లోకి తీసుకురావాలని తాను గట్టిగా కోరుకుంటున్నానని తెలిపాడు. తాను సెలక్టర్​ అయితే ఆ పనిని తప్పక చేస్తానన్నాడు గవాస్కర్. ‘పంత్ ఒంటికాలితో ఆడేలా ఉన్నా అతడ్ని టీమ్​లో తీసుకోవాలి. అన్ని ఫార్మాట్లలోనూ సింగిల్ హ్యాండ్​తో మ్యాచ్​ను మలుపు తిప్పగల సత్తా అతడికి ఉంది. నేను సెలక్టర్​ను అయితే మొదట పంత్ పేరే రాస్తా. ఒకవేళ అతడు అందుబాటులో లేకపోతే కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడం బెటర్. రాహుల్ టీమ్​లో ఉంటే మంచి బ్యాలెన్స్ కూడా వస్తుంది. అతడ్ని ఓపెనర్​గా లేదా మిడిలార్డర్​లో 5, 6 స్థానాల్లో ఫినిషర్​గా వినియోగించుకోవచ్చు’ అని గవాస్కర్ తెలిపాడు. పంత్​కు రాహుల్ మంచి ప్రత్యామ్నాయం కాగలడని.. అయితే రిషబ్ జట్టులోకి వస్తే భారత్ మరింత బలంగా మారుతుందన్నాడు.

sunil kavaskar comments on rishab pant

ఇక, 2022 చివర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత క్రమంగా కోలుకున్న ఈ స్టార్ బ్యాట్స్​మన్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్నాడు. అక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. అప్పుడప్పుడు తాను జిమ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట షేర్ చేస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయ్యే టైమ్​కు అతడు పూర్తి ఫిట్​నెస్ సాధిస్తాడని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ఆ సమయానికి కోలుకోకుంటే క్యాష్ రిచ్​ లీగ్ ఆరంభంలో కొన్ని మ్యాచులకు దూరమవ్వొచ్చు. కాగా, పంత్​కు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి సిరీస్​కు ఒకరు చొప్పున పార్ట్​టైమ్ వికెట్ కీపర్లతో భారత్ నెట్టుకొస్తోంది. అయితే ఇటీవల కాలంలో కేఎల్ రాహుల్ ఆ రోల్​లో పర్ఫెక్ట్​గా ఫిట్ అయ్యాడు. మరి.. పంత్​పై గవాస్కర్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: భారీ సెంచరీ చేసినా నో సెలబ్రేషన్స్.. అసలు కారణం చెప్పిన రికీ భుయ్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి