iDreamPost

IND vs AFG: టీమ్‌లోకి తీసుకోవడమే దండగ అన్నారు! అతనే గెలిపించాడు!

  • Published Jan 12, 2024 | 10:02 AMUpdated Jan 12, 2024 | 10:02 AM

టీమ్​లోకి అతడ్ని తీసుకోవడమే దండగ అన్నారు. ఆ ప్లేయర్​ను పక్కనపెట్టి ఇతర యంగ్​స్టర్స్​కు చోటు ఇవ్వాలన్నారు. కానీ ఇప్పుడు అతడే గెలిపించాడు. తనపై నోరు పారేసుకున్న వాళ్లకు స్ట్రాంగ్​గా ఇచ్చి పడేశాడు.

టీమ్​లోకి అతడ్ని తీసుకోవడమే దండగ అన్నారు. ఆ ప్లేయర్​ను పక్కనపెట్టి ఇతర యంగ్​స్టర్స్​కు చోటు ఇవ్వాలన్నారు. కానీ ఇప్పుడు అతడే గెలిపించాడు. తనపై నోరు పారేసుకున్న వాళ్లకు స్ట్రాంగ్​గా ఇచ్చి పడేశాడు.

  • Published Jan 12, 2024 | 10:02 AMUpdated Jan 12, 2024 | 10:02 AM
IND vs AFG: టీమ్‌లోకి తీసుకోవడమే దండగ అన్నారు! అతనే గెలిపించాడు!

ఆఫ్ఘానిస్థాన్​తో జరిగిన తొలి టీ20లో భారత్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్​లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గురువారం మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్​కు ఆహ్వానించాడు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయండంతో ఆఫ్ఘాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్​పై మోస్తరు టార్గెట్​ను ఛేజ్ చేసేందుకు దిగిన భారత్​కు మొదట్లోనే రోహిత్ శర్మ (0) రూపంలో భారీ షాక్ తగిలింది. అయితే కెప్టెన్ గోల్డెన్​ డక్​గా వెనుదిరిగినా మిగిలిన యంగ్​స్టర్స్ అందరూ బాగా ఆడటంతో టీమిండియా సిరీస్​లో శుభారంభం చేసింది. అయితే ఈ విజయంలో ఎక్కువ క్రెడిట్ ఒక ప్లేయర్​కు ఇవ్వాలి. టీమ్​లోకి తీసుకోవడం దండగ అనుకున్న ఆ ఆటగాడే సింగిల్ హ్యాండ్​తో భారత్​ను గెలిపించాడు. అతడే బ్యాటింగ్ ఆల్​రౌండర్ శివమ్ దూబె.

భారత్-ఆఫ్ఘాన్ మధ్య జరిగిన ఫస్ట్ టీ20లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​ గెలుచుకొని హీరోగా నిలిచాడు శివమ్ దూబె. మొదట బంతితో రాణించిన ఈ ఆల్​రౌండర్.. ఆ తర్వాత బ్యాట్​తోనూ దుమ్మురేపాడు. రాకరాక వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్న దూబె అదరగొట్టాడు. ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్​ సమయంలో ఇబ్రహీం జాద్రాన్ (25) వికెట్ తీశాడు. మంచి స్టార్ట్ అందుకున్న జాద్రాన్ భారీ స్కోరు చేసేలాగే కనిపించాడు. ఈ టైమ్​లో దూబె అతడ్ని వెనక్కి పంపాడు. 2 ఓవర్లు వేసిన అతడు.. కేవలం 9 పరుగులే మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత భారత ఇన్నింగ్స్​ సమయంలో బ్యాట్​తో చెలరేగిపోయాడు దూబె. గిల్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన అతడు ఆఖరి వరకు నిలబడి మ్యాచ్​ను ఫినిష్ చేశాడు. సింగిల్స్, డబుల్స్ తీస్తూనే చెత్త బంతులకు భారీ షాట్లు బాదాడు. చివర్లో నవీనుల్ హక్ బౌలింగ్​లో వరుసగా ఒక సిక్స్, ఫోర్ కొట్టి మ్యాచ్​ను ఫినిష్ చేశాడు. తిలక్ వర్మ (26), జితేష్ శర్మ (31), రింకూ సింగ్ (16)తో కలసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. తిలక్, జితేష్ ఔటైనా దూబె సంయమనం కోల్పోలేదు.

He said that it is better to be included in the team! He won!

మ్యాచ్​ పూర్తయ్యే వరకు క్రీజులో ఉండాలనే పట్టుదల దూబేలో కనిపించింది. అనవసర షాట్లకు పోకుండా బాల్ మెరిట్​ను బట్టి ఆడాడు. మంచి బంతుల్ని గౌరవిస్తూనే, చెత్త బంతులకు షాట్స్ కొట్టాడు. బౌలింగ్​లోనూ కీలక బ్రేక్ త్రూతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో దూబేను పూర్తిగా బెంచ్​కే పరిమితం చేశారు. వన్డే వరల్డ్ కప్ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్, సౌతాఫ్రికా టూర్​లోనూ ఈ ఆల్​రౌండర్​కు అవకాశాలు ఇవ్వలేదు. దీంతో దూబె కెరీర్​తో ఆడుకుంటున్నారనే విమర్శలు వచ్చాయి. అయితే టీమ్ మేనేజ్​మెంట్ మొత్తానికి అవకాశం ఇవ్వడంతో చెలరేగి ఆడాడు. తన విలువ ఏంటో చూపించాడు దూబె. బ్యాట్​తో పాటు బాల్​తోనూ రాణించి టీ20 వరల్డ్ కప్​లో తనను తీసుకోవాల్సిందేనని సెలక్టర్లకూ హెచ్చరికలు పంపాడు. టీమ్​లో అవసరమా? ఇతడ్ని తీసేయండి.. వేస్ట్ అంటూ విమర్శించిన వారికి ఒక్క మ్యాచ్​తో గట్టిగా బదులిచ్చాడు. దూబె ఆటతీరుపై నెట్టింట ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత మంచి ప్లేయర్​ను ఇన్నాళ్లూ ఎందుకు బెంచ్ మీద కూర్చోబెట్టారని క్వశ్చన్ చేస్తున్నారు. మరి.. ఫస్ట్ టీ20లో దూబె పెర్ఫార్మెన్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20.. కొత్త చరిత్ర లిఖించిన రోహిత్‌ శర్మ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి