iDreamPost

నాణ్యత లోపించిన చైనా కిట్లను తిరస్కరించిన భారత్!

నాణ్యత లోపించిన చైనా కిట్లను తిరస్కరించిన భారత్!

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు పోరాడుతున్న భారత్ కు తాము అండగా ఉంటామని వెల్లడించిన చైనా, అవసరమైన మేరకు మెడికల్ కిట్స్ అందచేస్తాము అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల ఏప్రిల్ 5న భారత్ కు చైనా పెద్ద ఎత్తున వ్యక్తిగత సంరక్షణ కిట్లు (పి.పి.ఈ)లు పంపింది. అయితే భారత్ కి చేరుకున్న ఆ పి.పి.ఈ కిట్ల నాణ్యత పరీక్షంచగా వాటిలో కొంతమేరకు నాణ్యత లోపించిన కిట్లు ఉన్నట్టు భారత ప్రభుత్వం గుర్తించి వాటిని వెనక్కి పంపే ఆలోచన చేస్తునట్టు చెప్పుకొచ్చింది.

భారత్ లో సరిపడనన్ని వ్యక్తిగత పరిరక్షణ కిట్లు ఉండటంతో చైనా సుమారు 1.7 లక్షల కిట్లను పంపగా వాటిని భారత్ గ్వాలియర్ లోని డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లాబరేటరీలో పరీక్షించగా వాటిలో సుమారు 50వేల కిట్లు క్వాలిటీ టెస్ట్ లో నాణ్యతా లోపం ఉన్నట్టు గుర్తించి అవి వాడకానికి పనికిరావు అని నిర్ధారించింది. దీంతో భారత్ ప్రభుత్వం లోపం ఉన్న ఆ 50వేల పి.పి.ఈ కిట్లను తిరిగి చైనాకు పంపే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే తాజాగా గురువారం నాడు చైనా భారత్ కు మరో 6.5 లక్షల వ్యక్తిగత పరిరక్షణ కిట్లను పంపినట్టు అక్కడ భారత్ రాయబారి విక్రం మిస్రీ వెళ్ళడించారు. ప్రపంచ వ్యాప్తంగా వైద్య సామాగ్రి ముఖ్యంగా వెంటిలేటర్లు, పర్సనల్ ప్రోటక్షన్ ఎక్యుపెమంట్లు కొరత ఉండటంతో చైనా ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునే విదంగా అడుగులు వేస్తుంది. పి.పి.ఈ కిట్లను పెద్ద ఎత్తున తయారు చేసి స్టాక్ పెట్టుకోవడంతో చైనాకు ప్రపంచ దేశాలనుండి కిట్ల కొనుగోల్ల కోసం ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే చైనా తయారు చేస్తున్న కిట్లలో నాణ్యతా లోపం గుర్తించడంతో ఆ కిట్లు కొనుగోలు చెయడం ఎంతవరకు ఉపయోగం అనే ప్రశ్న తాజాగా తలెత్తింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి