iDreamPost

తెలుగు రాష్ట్రాల్లో అల్లాడిస్తున్న ఎండలు.. ఒక్క తిరుమలలో మాత్రమే ఎందుకీ ప్రత్యేకం?

Tirumala Rain: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి తన విశ్వరూపంతో నిప్పులకొలిమిలా మారాయి. మాడు పగిలే ఎండలతో జనం విలవిలలాడిపోతున్నారు.  ఇలా ఉంటే... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు భిన్నంగా తిరుమలలో వానలు కురుస్తున్నాయి. మరి.. ఇక్కడే ఎందుకీ ప్రత్యేకత అంటే..

Tirumala Rain: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి తన విశ్వరూపంతో నిప్పులకొలిమిలా మారాయి. మాడు పగిలే ఎండలతో జనం విలవిలలాడిపోతున్నారు.  ఇలా ఉంటే... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు భిన్నంగా తిరుమలలో వానలు కురుస్తున్నాయి. మరి.. ఇక్కడే ఎందుకీ ప్రత్యేకత అంటే..

తెలుగు రాష్ట్రాల్లో అల్లాడిస్తున్న ఎండలు.. ఒక్క తిరుమలలో మాత్రమే ఎందుకీ ప్రత్యేకం?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.  భానుడి ప్రతాపం రోజు రోజూకు పెరిగిపోతుంది. ఆంధ్ర, తెలంగాణాల్లోని పలు ప్రాంతాలు నిప్పులు కొలిమిని తలపిస్తున్నాయి. రోజు వారి ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 మధ్య ఉంది. ఇటీవలే ప్రకాశం జిల్లాలోని ఓ ప్రాంతంలో ఏకంగా 47.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇలా అన్ని ప్రాంతాల్లో మండే అగ్నిగోళం తలపిస్తుంటే..తిరుమల మాత్రం మూడు రోజుల నుంచి పూర్తి భిన్నంగా ఉంది. అన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతుంటే.. తిరుమలలో మాత్రం వానలు కూరుస్తున్నాయి. దీంతో ఆమె ప్రాంత వాసులు చల్లని వాతావరణం సేద తీరుతున్నారు.

గత మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని తిరుమలలో వానలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలోని మిగిలిన  చాలా ప్రాంతాలు మండే అగ్నిగోళంలా ఉన్నాయి. శనివారం సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. రోజు రోజుకు ఎండల తీవ్ర పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో శనివారం తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శనివారం మధ్యాహ్నం నుంచి వాతారణం చల్లబడటంతో పాటు వర్షం కురవడంతో జనం ఉపశమనం పొందారు. శ్రీవారి దర్శనంకు వచ్చిన భక్తులు చల్లని వాతావరణంలో సేదతీరారు. వరుసగా మూడో రోజు తిరుమలలో వర్షం కురిసింది.

రాష్ట్రంలో ఎండలు మండుతున్న వేళ తిరుమలలో మాత్రం గత మూడు రోజుల నుంచి వాతావరణం మారిపోయింది. శుక్రవారం సైతం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. ఇదే సమయంలో భారీ వృక్షాలు నేలకూలాయి. శుక్ర, శనివారాలు మధ్యాహ్నం వేల నల్లటి మేఘాలు తిరుమలను కప్పేశాయి.  శనివారం  సుమారు గంటన్నర పాటు వర్షం కురిసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి తన విశ్వరూపంతో నిప్పులకొలిమిలా మారాయి. మాడు పగిలే ఎండలతో జనం విలవిలలాడిపోతున్నారు.  ఇలా ఉంటే… రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు భిన్నంగా ఇక్కడ ఎండలు పరార్ అయ్యాయి.

తిరుమల కొండ సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండటం, అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ వానలు కురుస్తున్నాయని పలువురు అభిప్రాయా పడుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మండిపోతున్న ఎండల ధాటికి జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఎండలకు తోడు వడగాలులు వీస్తుండటంతో జనం విలవిల్లాడిపోతున్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో ఇంకా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తంగా రాష్ట్రమంతటా ఎండలు వీస్తుంటే..తిరుమలలో మాత్రం మూడు రోజులుగా వానాలు పడుతుంటడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి