iDreamPost

భారత్ లో విజృంభిస్తోన్న కరోనా.. 36 వేలకు చేరిన యాక్టివ్ కేసులు

భారత్ లో విజృంభిస్తోన్న కరోనా.. 36 వేలకు చేరిన యాక్టివ్ కేసులు

భారత్ లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. వరుసగా రెండోరోజు దేశంలో 7 వేలకు పైగా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్నటి బులెటిన్ లో 7,240 కేసులు నమోదవ్వగా.. గడిచిన 24 గంటల్లో దేశంలో 3.35 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 7,584 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. ఇదే సమయంలో 24 మంది కరోనాతో మృతి చెందగా.. మృతుల సంఖ్య 5,24,747కి పెరిగింది.

గత 24 గంటల్లో 3,791 మంది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీల సంఖ్య 4,26,44,092గా ఉంది. రెండ్రోజుల్లో నమోదైన కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 8813 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాతి స్థానంలో కేరళ, ఢిల్లీ, కర్ణాటక, హర్యానా ఉన్నాయి. కేరళలో 2,193, ఢిల్లీలో 622, కర్ణాటకలో 471, హర్యానాలో 348 కేసులు నిర్ధారణ అయ్యాయి. కొత్తకేసుల సంఖ్య పెరగడంతో.. రికవరీ రేటు 98.70 శాతానికి పడిపోయింది. నిన్న ఒక్క రోజే 15.31 లక్షల మంది కరోనా వ్యాక్సిన్లు వేయించుకోగా.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 194 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయినట్లు కేంద్రం వెల్లడించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి