Somesekhar
14 సంవత్సరాల వయసులో ఇంటి నుంచి పారిపోయాడు.. కట్ చేస్తే.. ప్రస్తుతం టీమిండియా జాతీయా జట్టుకు ఎంపికైయ్యాడు. ఇక తన కొడుకు కల నిజం చేయడానికి ఆ తల్లి బంగారాన్ని తాకట్టుపెట్టింది. ధృవ్ జురెల్ ఇన్స్పైరింగ్ స్టోరీని ఓసారి పరిశీలిద్దాం పదండి.
14 సంవత్సరాల వయసులో ఇంటి నుంచి పారిపోయాడు.. కట్ చేస్తే.. ప్రస్తుతం టీమిండియా జాతీయా జట్టుకు ఎంపికైయ్యాడు. ఇక తన కొడుకు కల నిజం చేయడానికి ఆ తల్లి బంగారాన్ని తాకట్టుపెట్టింది. ధృవ్ జురెల్ ఇన్స్పైరింగ్ స్టోరీని ఓసారి పరిశీలిద్దాం పదండి.
Somesekhar
టీమిండియాకు ఆడాలనేది ప్రతీ ఒక్క యువ క్రికెటర్ కల. అందుకోసం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. అన్ని సమస్యలను దాటితేనే విజయం వరిస్తుందన్నది కాదనలేని సత్యం. ఇలాంటి విజయాన్నే సాధించాడు 22 ఏళ్ల యూపీ కుర్రాడు ధృవ్ జురెల్. డిఫెన్స్ లో లేదా ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ చేయాలన్నది తండ్రి కల, కానీ క్రికెటర్ కావాలన్నది జురెల్ కల. ఈ విపత్కర పరిస్థితుల్లో 14 సంవత్సరాల వయసులో ఇల్లు వదలి పారిపోవాలనుకున్నాడు. కానీ అతడి తల్లి ధృవ్ ను వెళ్లనివ్వలేదు. తన బంగారం తాకట్టుపెట్టి మరీ అతడికి క్రికెట్ కిట్ కొనిచ్చింది. ఇది తండ్రికి నచ్చక రోజూ తిట్టేవాడు. ఇన్ని సమస్యల మధ్య తన ఆటను కొనసాగించిన ధృవ్.. ఇప్పుడు ఏకంగా టీమిండియాలోకి దూసుకొచ్చాడు. అతడి కెరీర్ ను ఓసారి పరిశీలిద్దాం.
ధృవ్ జురెల్.. ప్రస్తుతం టీమిండియాలో హాట్ టాపిక్ గా మారిన ప్లేయర్. సీనియర్ ప్లేయర్లు అయిన పుజారా, రహానే, సంజూ శాంసన్ లాంటి ప్లేయర్లను కాదని.. ఈ 22 ఏళ్ల కుర్రాడిని టీమిండియా జట్టులోకి తీసుకుంది. ఇంగ్లాండ్ తో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి రెండు మ్యాచ్ లకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన టీమ్ లో చోటు దక్కించుకున్నాడు ఈ యంగ్ వికెట్ కీపర్. కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ తర్వాత టీమిండియాకు బ్యాకప్ వికెట్ కీపర్ గా ఇతడిని ఎంపిక చేసింది మేనేజ్ మెంట్. దీంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు జురెల్. అతడు ఎవరు? బ్యాగ్రౌండ్ ఏంటి? అన్న విషయాలను వెతికే పనిలోపడారు నెటిజన్లు. మరి అతడి లైఫ్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ధృవ్ చంద్ జురెల్.. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జన్మించాడు. తండ్రి ఆర్మీలో ఉద్యోగం చేసి పదవీ విరమణపొందాడు. కార్గిల్ వార్ లో సైతం పాల్గొన్నాడు. ఇక జురెల్ కు చిన్నప్పటినుంచే క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. కానీ తండ్రికి మాత్రం అతడిని డిఫెన్స్ లోకి పంపించాలని, లేదా ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ చేయాలని ఉండేది. దీంతో ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేది. ఈ క్రమంలోనే 14 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలిపారిపోవాలనుకున్నాడు. దీంతో కొడుకుపై ఉన్న ప్రేమ.. కొడుకుకు క్రికెట్ పై ఉన్న ఇష్టం చూసి, తన బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ జురెల్ కు క్రికెట్ కిట్ కొనిచ్చింది. ఇది అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటనగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు జురెల్.
ఈ క్రమంలోనే 2021లో డొమెస్టిక్ క్రికెట్ ఆడటం మెుదలుపెట్టిన ధృవ్ తక్కువ కాలంలోనే జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు. 2021 సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో పాల్గొన్నాడు. వికెట్ కీపింగ్ తో పాటుగా డ్యాషింగ్ బ్యాటింగ్ చేయడంలో సిద్దహస్తుడు ధృవ్. దీంతో 2022 ఐపీఎల్ వేలంలో రాజస్తాన్ రాయల్స్ రూ. 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఇక ఈ సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడిన అతడు 152 రన్స్ చేశాడు. ఇక ధృవ్ జురెల్ గతేడాదే ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేశాడు. 15 మ్యాచ్ ల్లో 46 సగటుతో 790 రన్స్ చేశాడు. ఇతడిపై శ్రీలంక దిగ్గజ బ్యాటర్, మాజీ ప్లేయర్ కుమార సంగక్కర గతంలోనే ప్రశంసలు కురిపించాడు. ధృవ్ అద్భుతమైన వికెట్ కీపరే కాకుండా, ఒత్తిడిని తట్టుకుని సూపర్ బ్యాటింగ్ కూడా చేయగలడు అంటూ కితాబిచ్చాడు. మరి బ్యాకప్ వికెట్ కీపర్ గా జాతీయ జట్టులోకి దూసుకొచ్చిన జురెల్ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. తన తల్లి బంగారం తాకట్టు పెట్టి మరీ క్రికెట్ లో రాణిస్తున్న ధృవ్ జురెల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Kumar Sangakkara ” Dhruv Jurel is very hard working and handles the pressure really well. He is the match winner and scored some really tough runs for Rajasthan “#INDvENG #IshanKishan #Dhoni #Babar #Jurel #CricketTwitterpic.twitter.com/jKB8bZ4WbA
— Sujeet Suman (@sujeetsuman1991) January 13, 2024