iDreamPost
android-app
ios-app

AUS vs PAK: ఒక్క బాల్‌కి 5 రన్స్‌! నో బాల్‌ కాదు, బౌండరీ పోలేదు.. జస్ట్‌ పాకిస్థాన్‌ థింక్స్‌!

  • Published Dec 29, 2023 | 2:48 PM Updated Updated Dec 30, 2023 | 8:58 AM

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఒకే ఒక్క బాల్ కు ఏకంగా 5 రన్స్ సమర్పించుకున్నారు. అయితే అది నో బాల్ కాదు.. బౌండరీ పోలేదు, కానీ 5 రన్స్ వచ్చాయి. మరి ఇదెలా సాధ్యం అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఒకే ఒక్క బాల్ కు ఏకంగా 5 రన్స్ సమర్పించుకున్నారు. అయితే అది నో బాల్ కాదు.. బౌండరీ పోలేదు, కానీ 5 రన్స్ వచ్చాయి. మరి ఇదెలా సాధ్యం అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.

AUS vs PAK: ఒక్క బాల్‌కి 5 రన్స్‌! నో బాల్‌ కాదు, బౌండరీ పోలేదు.. జస్ట్‌ పాకిస్థాన్‌ థింక్స్‌!

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది కంగారూ జట్టు. తొలి టెస్ట్ లో 360 పరుగుల భారీ తేడాతో పాకిస్తాన్ ఓడించిన ఆసీస్ అదే జోరును రెండో టెస్ట్ లోనూ చూపించింది. ఈ పోరులో 79 రన్స్ తో పాక్ ను చిత్తు చేసింది. మ్యాచ్ పై పట్టు బిగించినట్లే బిగించి.. వదిలేసింది పాక్. చెత్త ఫీల్డింగ్ తో విమర్శల పాలవ్వడమే కాకుండా.. సిరీస్ ను కూడా కోల్పోయింది. కాగా.. ఈ మ్యాచ్ లో ఓ ఆశ్చర్యకరమైన సన్నివేశం చోటుచేసుకుంది. పాకిస్తాన్ ఆటగాళ్లు ఒకే ఒక్క బాల్ కు ఏకంగా 5 రన్స్ సమర్పించుకున్నారు. అయితే అది నో బాల్ కాదు.. బౌండరీ పోలేదు, కానీ 5 రన్స్ వచ్చాయి. మరి ఇదెలా సాధ్యం అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.

మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ లో పాకిస్తాన్ 79 పరుగులతో ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడింది. దీంతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను చేజిక్కించుకుంది కంగారూ టీమ్. ఈ మ్యాచ్ లో తొలుత పాకిస్తాన్ జట్టుదే పై చేయి.. కానీ, తమ చెత్త ఫీల్డింగ్ తో మరోసారి వార్తల్లో నిలుస్తూ, విమర్శల పాలవుతూ.. ఓటమి చవిచూసింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో ఓ విచిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్నక్రమంలో విచిత్రమైన సంఘటన నమోదు అయ్యింది. కేవలం ఒకే ఒక్క బాల్ కు 5 రన్స్ ఇచ్చారు పాక్ ఆటగాళ్లు. అయితే అది నోబాల్ అనుకుంటే మీరు పొరపడినట్లే. అది నో బాల్ కాదు, బౌండరీ పోలేదు.. మరెలా 5 వచ్చాయి? అసలేం జరిగిందంటే?

ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో భాగంగా క్రీజ్ లో ప్యాట్ కమ్మిన్స్, వికెట్ కీపర్ అలెక్స్ కేరీలు బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పాక్ బౌలర్ జమాల్ వేసిన ఓ బాల్ ను కమ్మిన్స్ షాట్ ఆడాడు. ఆ బాల్ కాస్త ఇద్దరు ఫీల్డర్ల మధ్యలో నుంచి వెళ్తున్న బాల్ ను ఆపి బౌలర్ వైపు త్రో చేశాడు పాక్ ఫీల్డర్. అయితే ఆ బాల్ ను పట్టుకోవడంలో షాహీన్ అఫ్రిది విఫలం కావడంతో.. బాల్ బౌండరీ వైపు దూసుకెళ్లింది. అప్పటికే వీరిద్దరు రెండు పరుగులు పూర్తి చేశారు. మిస్ ఫీల్డ్ కావడంతో.. మరో మూడు పరుగులు పూర్తిచేశారు. మెుత్తంగా ఒక్క బాల్ కు ఐదు రన్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో.. నెటిజన్లు పాక్ ప్లేయర్లను ఓ ఆటాడుకుంటున్నారు. పాకిస్తాన్ ఫీల్డర్లు అంతే.. అంతే అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

తొలి టెస్ట్ నుంచి తాజాగా మ్యాచ్ వరకు క్యాచ్ లు జారవిడుస్తూనే వస్తున్నారు పాక్ ఆటగాళ్లు. అత్యంత చెత్త ఫీల్డింగ్ తో తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటున్న వీరు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఒక బాల్ కు 5 పరుగులు ఇవ్వడం ఏంటి సామీ, అది విడిచిపెట్టినా.. బౌండరీ వెళ్లి 4 పరుగులే వచ్చేవి కదా అంటూ హేళన చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 318, రెండో ఇన్నింగ్స్ లో 262 పరుగులు చేసింది. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 264, రెండో ఇన్నింగ్స్ లో 237 రన్స్ చేసి.. 79 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరి ఒక్క బాల్ కు 5 రన్స్ ఇచ్చిన పాక్ ఫీల్డర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.