iDreamPost
android-app
ios-app

Akhil Akkineni: సలార్-2లో అఖిల్.. ప్రశాంత్ నీల్ భార్య ఏమన్నారంటే..?

Akhil Akkineni in Salaar-2.. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన మూవీ సలార్.. బాక్సాఫీసు వద్ద ఊచకోత కోసిన సంగతి విదితమే. అయితే ఇటీవల సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది చిత్ర యూనిట్. అందులో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అయ్యాడు అఖిల్ అక్కినేని. దీంతో ..

Akhil Akkineni in Salaar-2.. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన మూవీ సలార్.. బాక్సాఫీసు వద్ద ఊచకోత కోసిన సంగతి విదితమే. అయితే ఇటీవల సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది చిత్ర యూనిట్. అందులో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అయ్యాడు అఖిల్ అక్కినేని. దీంతో ..

Akhil Akkineni: సలార్-2లో అఖిల్.. ప్రశాంత్ నీల్ భార్య ఏమన్నారంటే..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన మూవీ సలార్-ది సీజ్ ఫైర్. గత ఏడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి విదితమే. ప్రభాస్ మాస్ యాక్షన్, ఎలివేషన్స్‌తో ఫుల్ మీల్స్ తిన్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ప్రపంచ వ్యాప్తంగా రూ. 630 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టిందీ పిక్చర్. ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. నెల రోజులు తిరగకుండానే నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరోసారి ఈ మూవీ చూసి ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. ఇటీవల సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా  నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ వేడుకల్లో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అయిపోయాడు మన అయ్యగారు.

సలార్ సెలబ్రేషన్స్ ఈవెంట్‌లో అఖిల్ అక్కినేని కనిపించే సరికి ఒక్కసారిగా అవాక్కయ్యారు సినీ ప్రేక్షకులు. చేతికి కట్టుతో కనిపించే సరికి ఫస్ట్ అతడికి ఏమందని ఆరా తీస్తూనే.. అనుమానం కూడా వ్యక్తం చేశారు. సలార్-2లో అఖిల్ ఉన్నాడని, క్యామియో రోల్ ప్లే చేస్తున్నాడని, దేవ తమ్ముడు అతడేనని పలు పుకార్లు షికార్లు చేశాయి. అయితే వాటికి సమాధానం ఇచ్చారు ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. నీల్ సినిమాకు సంబంధి మూవీ అప్ డేట్స్ పంచుకుంటూ ఉంటారు ఆమె. తాజాగా ఇన్ స్టా వేదికగా.. సినిమా నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని చెబుతూనే.. సలార్ సినిమాలో అబ్జర్వేషన్ చేసినవి అలాగే సమాధానం లేని ప్రశ్నలన్నింటిని అడగండి అంటూ ఓ కశ్వన్స్ అవర్ కండెక్ట్ చేశారు.

prashant neel wife clarity on akhils cameo in salar 2

ఈ సందర్భంగా నెటిజన్లు పలు ప్రశ్నలు సంధించారు. ‘దేవ ఫాదర్ ఎవరు, దేవ ఫాదర్ ప్లే చేసింది ఎవరు’ అని ప్రశ్నించగా.. శౌర్యంగ పర్వంలో( సలార్-2) ధారా పాత్ర ఉండబోతుందని చెప్పకనే చెప్పేశారు. అలాగే డైనోసార్ డైలాగ్ గ్లింప్స్‌ గురించి అడగ్గా.. అది కూడా పార్ట్ -2లో ఉండబోతుందని రిప్లై ఇచ్చారు. దేవకు బ్రదర్ ఉన్నాడా అన్న ప్రశ్నకు.. ఆమె కూడా క్వశ్చన్ మార్కు విత్ సింబల్ ఆన్సర్ చేశారు. ‘ సలార్-2లో అఖిల్ స్పెషల్ క్యామియో చేస్తున్నాడని రూమర్లు వస్తున్నాయి.. ఇది నిజమా ’అన్న ప్రశ్నకు.. అది ఓ రూమర్ అని వెల్లడించారు లిఖితా రెడ్డి. దీనిబట్టి చూస్తే అఖిల్ శౌర్యంగ పర్వంలో లేనట్లే అని తెలుస్తోంది. అయితే అఖిల్.. హోంబలే ఫిలింస్ బ్యానర్ ఓ సినిమా చేస్తున్నాడు. అందుకే సలార్ సెలబ్రేషన్స్ ఈవెంట్‌కు ఆయన్ను కూడా పిలవడంతో వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ శౌర్యంపర్వంలో ఉంటే బాగుణ్ణు అనుకుంటున్న వారంతా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş