iDreamPost

కొడుకులున్న అనాథలు.. కలెక్టర్ వద్దకి చేరిన ఓ అమ్మ, నాన్న కథ!

  • Published Apr 19, 2024 | 1:16 PMUpdated Apr 19, 2024 | 1:16 PM

చాలామందికి ఎంతమంది పిల్లలు ఉన్నా వృద్ధప్యంలో మాత్రం అండగా తోడు ఉండి బాధ్యతలను స్వీకరించేవారు ఎవరు ఉండారు. ఇక ఆ ముసలి వయసులో కష్టపడడానికి ఒంట్లో శక్తి లేక, కడుపుకు తిండిలేక, ఆనారోగ్యాలతో బాధపడుతుంటారు. అలాంటి సమయంలో తాము కాసిన బిడ్డలలో ఎవరు ఒకరు తమ అలానా పాలానా చూసుకుంటే బాగున్నని ఆశపడుతుంటారు. కానీ, పిల్లలు మాత్రం కొంత వయసు వచ్చాక తమ తల్లిదండ్రులపై నిర్లక్ష్యం వహిస్తుంటారు. తాజగా ఇలాాంటి ఓ వృద్ధ దంపతులకు కూడా అచ్చం ఇలాంటి పరిస్థితే ఎదురవ్వడంతో చావు తప్ప మరొక దిక్కు లేదని ఆత్మహత్యకు సిద్ధమయ్యారు.

చాలామందికి ఎంతమంది పిల్లలు ఉన్నా వృద్ధప్యంలో మాత్రం అండగా తోడు ఉండి బాధ్యతలను స్వీకరించేవారు ఎవరు ఉండారు. ఇక ఆ ముసలి వయసులో కష్టపడడానికి ఒంట్లో శక్తి లేక, కడుపుకు తిండిలేక, ఆనారోగ్యాలతో బాధపడుతుంటారు. అలాంటి సమయంలో తాము కాసిన బిడ్డలలో ఎవరు ఒకరు తమ అలానా పాలానా చూసుకుంటే బాగున్నని ఆశపడుతుంటారు. కానీ, పిల్లలు మాత్రం కొంత వయసు వచ్చాక తమ తల్లిదండ్రులపై నిర్లక్ష్యం వహిస్తుంటారు. తాజగా ఇలాాంటి ఓ వృద్ధ దంపతులకు కూడా అచ్చం ఇలాంటి పరిస్థితే ఎదురవ్వడంతో చావు తప్ప మరొక దిక్కు లేదని ఆత్మహత్యకు సిద్ధమయ్యారు.

  • Published Apr 19, 2024 | 1:16 PMUpdated Apr 19, 2024 | 1:16 PM
కొడుకులున్న అనాథలు.. కలెక్టర్ వద్దకి చేరిన ఓ అమ్మ, నాన్న కథ!

ఈ సృష్టిలో తల్లిదండ్రులకు మించిన దైవం మరొకటి లేదంటారు పెద్దలు. ఎందుకంటే.. ఎన్ని కష్టాలు ఎదురైనా , మరెన్ని ఇబ్బందులు ఎదురైనా తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డల చేయిని అసలు విడిచిపెట్టారు. కష్టమో, నష్టమో తామే భరించే తమ పిల్లలకు ఎటువంటి కష్టం రాకుండా.. కంటికి రెప్పాలా కాపాడుకుంటారు. చిన్న వయసు నుంచి పెద్ద వాళ్లు అయినంత వరకే తమ బాధ్యత అని అనుకోకుండా.. మన కాళ్ల మీద మనం నిలబడే వరకు మనకు అండగా నిలుస్తారు. తమ రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దుతారు. అందుకే తల్లిదండ్రుల రుణం ఎన్ని జన్మాలెత్తినా, ఎన్ని సంవత్సరాలు శ్రమించిన తీర్చలేనిది అంటారు. మరి, అలాంటి తల్లిదండ్రులు.. పిల్లలు ఓ స్థాయికి వచ్చినప్పుడు తమకి గొప్పగా చూడాలని ఆశ పడారు. కానీ, వృద్ధపంలో తమ బాధ్యతలను స్వీకరించాలి కోరుకుంటారు. అయితే ఈ రోజుల్లో వారు ఆశించిన ఆ చిన్న కోరికే నేటి తారానికి ఓ పెద్ద భారంగా మారిపోయింది. ఈ క్రమంలోనే.. చాలామంది తల్లిదండ్రులు అలానా పాలానా పట్టించుకోక వారు వృద్ధశ్రమంలో, రోడ్డుల మీద పడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వృద్ధప్యంలోనే ఓ జంట కొడుకులున్న అనాథలం అంటూ.. ఏకంగా ఆత్మహత్యకు సిద్ధమయ్యారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

చాలామందికి ఎంతమంది పిల్లలు ఉన్నా వృద్ధప్యంలో మాత్రం అండగా తోడు ఉండి బాధ్యతలను స్వీకరించేవారు ఎవరు ఉండారు. ఇక ఆ ముసలి వయసులో కష్టపడడానికి ఒంట్లో శక్తి లేక, కడుపుకు తిండిలేక, ఆనారోగ్యాలతో బాధపడుతుంటారు. అలాంటి సమయంలో తాము కాసిన బిడ్డలలో ఎవరు ఒకరు తమ అలానా పాలానా చూసుకుంటే బాగున్నని ఆశపడుతుంటారు. కానీ చిన్నప్పటి నుంచి తమను కంటికి రెప్పాలా కాపాడుకుంటు వచ్చిన తల్లిదండ్రులపై కొంత వయసు వచ్చాక చాలామంది నిర్లక్ష్యం వహిస్తుంటారు. తాజగా భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన క్యాతం భూమయ్య, వరలక్ష్మి అనే వృద్ధ దంపతులకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.

కాగా, వాళ్లకి ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు.అయితే ముగ్గురు కొడుకులు ఉన్నా తాము అనాథలుగా బతుకుతున్నామని వాపోయారు. అయితే తాము సంపాదించిన ఆస్తి వ్యవసాయ భూమిని గత కొన్ని ఏళ్ళ క్రితం పెద్ద కొడుకుకు 20 గుంటలు ఎక్కువగా, మిగతా ఇద్దరు కొడుకులకు సమాన వాటా లుగా కూతురుకు ఒక ఎకరం భూమిని పంచి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ పెద్ద కొడుకు క్యాతం రమేష్ చిన్న కొడుకు క్యాతం సతీష్ లు ఇద్దరు మమ్మల్ని హింసిస్తూ వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆ వృద్ధ దంపతులు ఆ గ్రామంలో ఫోటోలతో కూడిన వాల్ పోస్టర్ లు వేసి ఎక్కడికి పోయినా కూడా మాకు న్యాయం జరుగుత లేదంటూ పురుగుల మందు డబ్బా పట్టుకుని చావే మాకు దిక్కని ఇప్పటికైనా అధికారులు మాకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు.

ఈ సందర్భంగా వృద్ధ దంపతులు మాట్లాడుతూ.. వృద్ధులైన మాకు గత కొన్ని సంవత్సరాలుగా పంటలు పండకపోవడం తో పాటు పాత ఇల్లు కూలి పోయే దశలో ఉండగా కొత్త ఇల్లు నిర్మించుకున్నాము. దీంతో మాకు కొన్ని అప్పులు కాగా పంటలు పండక పోతాయా అన్న ఆశతో పంట పండిస్తున్నప్పటికీ పంటలు దిగుబడి రాక పోవడం తో అప్పులు పెరిగి పోయాయి. ఈ క్రమంలో నేను నా కొడుకుల ను పెద్ద మనుషులు దగ్గరికి పలు మార్లు పిలిపించి నేను ఉంచుకున్న భూమి నా పట్టా భూమిలోని 20 గుంటలు అమ్మి అప్పు కడుదామంటే నా పెద్ద కొడుకు రమేష్ చిన్న కొడుకు సతీష్ లు నన్ను నానా భుతులు తిడుతూ భూమిని అమ్మ నీయకుండా అడ్డు పడుతున్నారు. ఇకపోతే అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో నేను ఎక్కడికి వెల్లి నా బాధను చెప్పుకున్నా కూడా మాకు న్యాయం జరుగుతాలేదు. వృద్దులమైన మాకు పోలీస్ స్టేషన్ కు వెళ్లి మా భాధ చెప్పుకున్నా కూడా మాకు న్యాయం జరుగక పొగా నా ఇద్దరు కొడుకులు నా మీదనే వ్యతిరేకంగా కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అందుకే పురుగుల మందు డబ్బాను పట్టుకుని మాకు న్యాయం కావాలంటూ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ స్పందిచాలంటూ తమ గోడును వెళ్ళ బోసుకున్నారు. మరి, ముగ్గురు కొడుకులు ఉన్నా వృద్ధ్యపంలో అనాథులైనా ఆ తల్లిదండ్రుల వేదన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి