iDreamPost

యువకుడి బట్టలు బాగోలేవని మెట్రో రైలు ఎక్కనీయలేదు! ఎక్కడంటే?

  • Published Apr 10, 2024 | 7:07 PMUpdated Apr 10, 2024 | 7:07 PM

తాజాగా మెట్రోలో ప్రయాణించాలి అనుకున్న ఓ కూలీకి ఊహించిన చేదు ఘటన ఎదురైంది. కేవలం తన బట్టలు బాగోలేదని కారణంతో అక్కడున్న మెట్రో సిబ్బంది అతనిని రైలు ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు. ఇంతకి ఈ దారుణమైన ఘటన ఎక్కడ చోటు చేసుకుందంటే..

తాజాగా మెట్రోలో ప్రయాణించాలి అనుకున్న ఓ కూలీకి ఊహించిన చేదు ఘటన ఎదురైంది. కేవలం తన బట్టలు బాగోలేదని కారణంతో అక్కడున్న మెట్రో సిబ్బంది అతనిని రైలు ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు. ఇంతకి ఈ దారుణమైన ఘటన ఎక్కడ చోటు చేసుకుందంటే..

  • Published Apr 10, 2024 | 7:07 PMUpdated Apr 10, 2024 | 7:07 PM
యువకుడి బట్టలు బాగోలేవని మెట్రో రైలు ఎక్కనీయలేదు! ఎక్కడంటే?

ప్రస్తుత సమాజంలో కొంతమంది మనుషులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా.. ఎదుట వ్యక్తుల పట్ల డబ్బు, హోదాలను బట్టి వారికి విలువను కూడా ఇస్తున్నారు. అయితే ఇలా ఎదుట వారి పట్ల అమానుషంగా.. అంటరానితనంగా ప్రవర్తించిన వారిలో ఎక్కువ శాతం చదువుకున్న ముర్ఖులు కూడా ఉండటం గమన్హారం. అసలు చదువకుని.. మంచి ఉన్నత హోదాలో ఉన్నవారు సైతం లేని వారి పట్ల చులకనగా చూస్తూంటారు. అయితే ఈరోజుల్లో ఎదుట డబ్బుకు ఎంతో విలువ ఉందో ఎదుట వ్యక్తి కట్టుకున్న బట్టలకు కూడా అంతా విలువ ఉంటుంది. ఎందుకంటే.. మనిషి వేసుకున్న బట్టలను కూడా చూసి కొందరు విలువను ఇస్తూ ఉంటారు. అయితే ఒక మనిషి వేసుకున్న బట్టలను బట్టి అతని స్థాయిని అంచనా వేయటం అనేది చాలా తప్పు. కానీ, అచ్చం దీనికి అద్దం పట్టినట్టుగా.. బెంగళూరులో జరిగిన ఓ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

బెంగళూరు సిటీ దొడ్డకళ్లసంద్ర ప్రాంతంలోని మెట్రో స్టేషన్ లో చాలా దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి బట్టలు బాగాలేవని మెట్రో సిబ్బంది అతనిని రైలు ఎక్కనీయలేదు. అయితే ఈ అవమానీషమైన ఘటన 2024, ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం చోటు చేసుకుంది. బెంగుళూరు మెట్రో స్టేషన్ కు వచ్చిన ఓ వ్యక్తి.. టికెట్ తీసుకొని మెట్రో ఎక్కాలని నిర్ణయించుకున్నాడు. అయితే అప్పుడు అక్కడ ఉన్న మెట్రో సిబ్బంది అతనిని అడ్డుకొని, నీ బట్టలు శుభ్రంగా లేవు, నువ్వు వాటని క్లీన్ చేసుకొని మళ్లీ వచ్చి రైలు ఎక్కాని చెప్పారు. అంతేకాకుండా.. నీ షర్ట్ బటన్స్ సరిగ్గా పెట్టుకొని శుభ్రంగా.. వస్తేనే మెట్రో రైలులోకి పంపిస్తాం అంటూ అతడిని అడ్డుకున్నారు. అయితే ఈ విషయాన్ని అక్కడే ఉన్న ప్రయాణికులు గమనించి అక్కడ సిబ్బందిని ప్రశ్నించారు. అలాగే అతని దగ్గర టికెట్ కూడా ఉంది, అయిన ఎందుకు అతనిని అడ్డుకుంటున్నారని మెట్రో సిబ్బందిని నిలదీశారు. దీంతో అక్కడ సిబ్బంది చెప్పిన సమాధానం విని అందరూ షాక్ గురయ్యారు.

ఎందుకంటే..ఆ వ్యక్తి బట్టలు బాగోలేవని, పైగా చొక్కా బటన్స్ కూడా పెట్టుకోలేదు. అతను తాగి ఉన్నాడేమో.. అలాంటి వ్యక్తిని రైలులోకి అనుమతిస్తే.. మహిళలు, పిల్లలను ఇబ్బంది పెడితే ఎవరు బాధ్యులంటూ తిరిగి ప్రయాణికులను మెట్రో సిబ్బంది ప్రశ్నించారు. ఇక బాధితుడుడిని ప్రశ్నంచిగా.. విచారించగా అతను కూలీ పనులు చేసే ఓ యువకుడు అని, అతడి పని నిమిత్తం ఇంటికి వెళ్తూ మెట్రో రైలు కోసం వచ్చాడని స్పష్టం అయ్యింది. అయితే ఈరోజుల్లో ఓ మనిషి వేసుకునే బట్టల బట్టి అతని విలువను డిసైడ్ చేసి, తప్పుగా ఎలా అవమానిస్తారంటూ.. ఆ మెట్రో సిబ్బంది పై విమర్శలు గుప్పుమన్నాయి. మొత్తానికి బట్టలు బాగోలేదంటూ అడ్డుకున్న వ్యక్తిని.. చివరకు మిగతా ప్రయాణికులు ఒత్తిడితో.. అక్కడ సిబ్బంది మెట్రో రైలులోకి అనుమతించారు. అయితే ఇలాంటి ఘటన బెంగళూర్ లో కొత్తమీ కాదని, గతంలో ఓ రైతును కూడా ఇలానే బట్టలను చూస్తూ.. మెట్రోలో అనుమాతించాకుండా అడ్డుకున్నారు. అయితే ఆ ఘటన మరువక ముందే మరోసారి ఓ ప్రయాణికుడు పట్ల మెట్రో సిబ్బంది ఇలా అవమానకరంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెట్రో సిబ్బంది పై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.మరి, బట్టలు బాగోలేదని మెట్రో సిబ్బంది ఓ వ్యక్తిని రైలు ఎక్కనివ్వకుండా చేసిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి