iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు!

  • Published Nov 29, 2023 | 10:00 AMUpdated Nov 29, 2023 | 10:00 AM

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

  • Published Nov 29, 2023 | 10:00 AMUpdated Nov 29, 2023 | 10:00 AM
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు!

గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతమైన ఉంది.. పగటి పూట చల్లని మంచు కప్పి ఉంటుంది.  ఇదిలా ఉంటే.. తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. నేడు వాయుగుండంగా బలపడనుంది.. వాయవ్య దిశగా పయనించి 48 గంటల్లో తుఫాన్‌గా మారే ఛాన్స్.. దక్షిణ రాష్ట్రాలపై తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని.. అలాగే తెలంగాణలో రాబోయే 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వివరాల్లోకి వెళితే..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం క్రమంగా వాయుగుంగంగా బలపడుతుందని.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి బారీ వర్షాలు కురిసే ఛాన్సు ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నవంబర్ 30 నాటికి పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ‌లోని భద్రాద్రి-కొత్తగూడెం, నల్లగొండ, సిరిసిల్ల, ఖమ్మం, జనగాం, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తమ పంట కోతకు సిద్దంగా ఉంటే వెంటనే కోయాలని ఐఎండీ రైతులకు సూచించింది.

ఏపీలో తుఫాన్ ముప్పు పొంచి ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. రాయలసీమ, దక్షిణ కోస్తాల్లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. తూర్పున ఉధృతమైన గాలులు వీస్తాయని.. వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అన్నారు. రాష్ట్రంలోని దక్షిణ కోస్తా ప్రాంతంలో గురువారం కూడా ఇలాంటి పరిస్థితి ఉండవొచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, లోతట్లు ప్రాంత ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు తమ పంటల విషయంలో తగు జాగ్రత్తాలు పాటించాలని ఐఎండీ అధికారులు సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి