iDreamPost

నైట్ మొత్తం Wifi ఆన్ లో ఉంచితే.. ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయంటే..!

నైట్ మొత్తం Wifi ఆన్ లో ఉంచితే.. ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయంటే..!

ప్రస్తుత రోజుల్లో అందరి ఇళ్లలో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ గ్యాడ్జెట్స్, వైఫై కనెక్షన్స్ చూస్తూనే ఉన్నాం. చిన్న పిల్లలు కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వాడేస్తున్నారు. పైగా ఇప్పుడు పెరిగిన డేటా వాడకం వల్ల అందరూ ఇళ్లలో వైఫైని వినియోగిస్తున్నారు. సాధారణంగా వైఫై కోసం రూటర్ ని వాడతారు. ఆ రూటర్ ని ఒకసారి ఆన్ చేస్తే.. తిరిగి ఆపడం అనేది సామాన్యంగా జరగదు. చాలా మంది ఏదైనా ఊరు వెళ్లేటప్పుడు, ఎక్కవ రోజులు ఇంట్లో ఉండని సమయంలో మాత్రమే వైఫై రూటర్ ని ఆఫ్ చేస్తుంటారు.

ఇప్పటి వరకు అందరూ వైఫై రూటర్ ఆన్ లో ఉంటే కరెంట్ బిల్లు వస్తుంది, సరైన పాస్ వర్డ్ లేకపోతే మన డేటా వాడేస్తారు అని మాత్రమే తెలుసు. కానీ, రాత్రుళ్లు వైఫై రూటర్ ఆఫ్ చేయకపోతే.. ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ మాట వినడానికి కూడా కాస్త విచిత్రంగానే ఉంటుంది. ఎందుకంటే వైఫై ఆఫ్ చేయకపోతే ఆరోగ్య సమస్యలు రావడం ఏంటి అనే అనుమానం రావచ్చు. అయితే మీరు రాత్రంతా వైఫై రూటర్ ని ఆన్ లో ఉంచడం వల్ల.. ఆ రేడియేషన్ కారణంగా మీకు నిద్రలేమి సమస్య వస్తుంది.

అంటే మీకు రాత్రి సమయంలో సరిగ్గా నిద్రపట్టక పోవడం, నిద్రపోవడానికి ఇబ్బంది పడటం జరుగుతుంది. అంతేకాకుండా వైఫై కనెక్షన్ ఉండటం వల్ల రాత్రిపూట స్మార్ట్ ఫోన్ ని పట్టుకుని అదే పనిగా వీడియోలు, రీల్స్, షాట్స్ అంటూ సమయం వృథా చేయడమే కాకుండా.. అరోగ్య సమస్యలను కూడా తెచ్చుకుంటారు. వైద్యులు చెప్పే వివరాల ప్రకారం.. పెద్దలు రోజూ 6 నుంచి 7 గంటలు, పిల్లలు 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. అంతేకాకుండా 10 కలలా నిద్రపోయి.. తెల్లవారుజామున 5 కల్లా లేవాలి అంటారు. అలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

ఎప్పుడు పడితే అప్పుడు పడుకుని, సరిపడా నిద్రపోకపోతే నిద్రలేమి సమస్య బాధితులు అవుతారు. ఆ ఒక్క సమస్య వస్తే మీకు ఆటోమేటిక్ గా అన్ని రోగాలు వస్తాయి. కంటి నిద్ర లేకపోవడం అనేది పెద్ద సమస్య. అది మీరు రాత్రి పూట్ వైఫై రూటర్ ని ఆఫ్ చేయకపోవడం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. రాత్రిపూట, వినియోగంలో లేని సమయ్లం వైఫై రూటర్ ని ఆఫ్ చేయడమే మంచిదని టెక్నాలజీ నిపుణులు సైతం చెబుతున్నరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి