iDreamPost

అంబానీ, అదానీ సైతం కొనని స్పోర్ట్స్‌ కారు.. జొమాటో CEO దగ్గర!

  • Published Mar 18, 2024 | 3:26 PMUpdated Mar 18, 2024 | 3:26 PM

ఇప్పుడు మారుతున్న టెక్నాలజీని బట్టి దేశంలో అనేక రకాల టాప్ బ్రాండ్ లగ్జరీ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక లగ్జరీ కార్స్ కొనాలంటే అది కేవలం అంబానీ అదానీ లాంటి వారికే సాధ్యం అని అందరికి తెలుసు. అయితే, తాజాగా ఓ ప్రముఖ కంపెనీ సీఈఓ అత్యంత ఖరీదైన టాప్ బ్రాండ్ లగ్జరీ కార్ ను కొనుగోలు చేశారు.

ఇప్పుడు మారుతున్న టెక్నాలజీని బట్టి దేశంలో అనేక రకాల టాప్ బ్రాండ్ లగ్జరీ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక లగ్జరీ కార్స్ కొనాలంటే అది కేవలం అంబానీ అదానీ లాంటి వారికే సాధ్యం అని అందరికి తెలుసు. అయితే, తాజాగా ఓ ప్రముఖ కంపెనీ సీఈఓ అత్యంత ఖరీదైన టాప్ బ్రాండ్ లగ్జరీ కార్ ను కొనుగోలు చేశారు.

  • Published Mar 18, 2024 | 3:26 PMUpdated Mar 18, 2024 | 3:26 PM
అంబానీ, అదానీ సైతం కొనని స్పోర్ట్స్‌ కారు.. జొమాటో CEO దగ్గర!

సాధారణంగా కార్ కొనాలనే కోరిక అందరికి ఉంటుంది. అయితే, అన్నిటిలో కంటే లగ్జరీ కార్స్ కు ఉండే క్రేజ్ , డిమాండ్ సెపరేట్ ఉంటుంది. ఇక లగ్జరీ కార్స్ అంటే వాటి ధరలు కూడా కోట్లలోనే ఉంటాయి. వాటిని కేవలం దేశంలో ఉండే అత్యంత సంపన్నులు మాత్రమే కొనగలరు. ఇండియాలో కంటే ఇతర దేశాల్లో వీటిని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. పైగా కొన్ని కోట్లు ఖర్చు చేసి మరి.. ఇతర దేశాల నుంచి ఈ లగ్జరీ కార్స్ ను.. తెప్పించుకుంటారు. అయితే, ఈ క్రమంలో తాజాగా.. కోట్ల విలువ చేసే ఓ టాప్ బ్రాండ్ లగ్జరీ కార్ ఇండియా రోడ్స్ పై తిరుగుతోంది. దాని ధర సుమారు నాలుగున్నర కోట్ల పై మాటే. మరి ఇండియాలో సంపన్నులంటే అందరికి ఆదానీ అంబానీలే గుర్తొస్తారు. కానీ, ఈ కార్ తీసుకుంది మాత్రం వారు కాదు. ఓ ప్రముఖ సంస్థ సీఈఓ.

నాలుగున్నర కోట్లకు పైగా విలువ చేసే ఈ కార్.. భారతదేశంలోనే మొట్ట మొదటి స్పోర్ట్స్ కార్. దీని పేరు ఆస్టన్ మార్టిన్ DB12 . ఇక ఈ కార్ ను కొనుగోలు చేసింది మరెవరో కాదు. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌. ప్రస్తుతం జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ కు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. రోజు రోజుకి ఈ యాప్ కు వినియోగదారుల సంఖ్య పెరుగుతూ పోతుంది. దీనితో అవకాశం దొరికినప్పుడే .. ఆస్తులను కూడపెట్టుకోవాలనుకున్నారో ఏమో కానీ, జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌.. ఇటీవల న్యూఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో 5 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేశారు. ఇక ఆ భూమి విలువ సుమారు రూ.79 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. వేరే ఓనర్స్ నుంచి కొనుగోలు చేసిన ఆ భూమికి మొత్తం స్టాంప్‌ డ్యూటీకే 5.24 కోట్ల రూపాయలు చెల్లించినట్లు.. ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ పేర్కొంది. ఇక ఇప్పుడు దేశంలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కార్ ను కూడా తన సొంతం చేసుకున్నారు .. జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌.

Zomato CEO buy sports car

ఇక ఆస్టన్ మార్టిన్ DB12 విషయానికొస్తే.. బ్రిటిష్ సూపర్ కార్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ.. గత ఏడాది సెప్టెంబరులోనే DB12 కారును లాంచ్ చేసింది. దీని ధర రూ.4.59 కోట్లు ఉంటుందని ప్రకటించింది. ఇక ఇప్పుడు ఈ ఖరీదైన కారు ఇండియన్ రోడ్స్ మీద తిరగడంతో.. అందరు ఆశ్చర్యపోతున్నారు. దీపిందర్‌ గోయల్‌ ఈ లగ్జరీ కారును సొంతం చేసుకోవడంతో.. సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇటువంటి లగ్జరీ స్పోర్ట్స్ కార్ ను కొనుగోలు చేసేందుకు.. అత్యంత సంపన్నులతో పోటీగా సీఈఓలు కూడా పోటీ పడుతున్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి