iDreamPost

ఓ చిన్న ఫుడ్ ట్రక్.. పెద్ద రెస్టారెంట్ లా! ఏకంగా ఆనంద్ మహీంద్రాని మెప్పించారు!

  • Published Feb 21, 2024 | 6:36 PMUpdated Feb 21, 2024 | 6:36 PM

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహేంద్ర గురించి అందరికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా ఉంటూనే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త టెక్నాలిజీకి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు ఆనంద్ మహేంద్ర.

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహేంద్ర గురించి అందరికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా ఉంటూనే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త టెక్నాలిజీకి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు ఆనంద్ మహేంద్ర.

  • Published Feb 21, 2024 | 6:36 PMUpdated Feb 21, 2024 | 6:36 PM
ఓ చిన్న ఫుడ్ ట్రక్.. పెద్ద రెస్టారెంట్ లా! ఏకంగా ఆనంద్ మహీంద్రాని మెప్పించారు!

ప్రస్తుతం వ్యాపార రంగంలోనూ, వాణిజ్య రంగంలోనూ.. ఎప్పటికపుడు కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంటుంది. వీటికి సంబంధించిన వీడియోలను నిత్యం సామాజిక మాధ్యమాలలో చూస్తూనే ఉన్నాము. ఇక ఈ టెక్నాలజీని ఎప్పటికపుడు అందిపుచ్చుకోవడంలో అందరు పోటీ పడుతూ ఉంటారు. అయితే , నిత్యం వీటికి సంబంధించిన విషయాలను షేర్ చేసే వ్యక్తి ఆనంద్ మహేంద్ర. ఈ ప్రముఖ పారిశ్రామిక వేత్త గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయనకు వ్యాపార రంగంలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో.. ఇటు సోషల్ మీడియాలోను అంతే యాక్టీవ్ గా ఉంటారు. ఆనంద్ మహేంద్ర ఏ వీడియో పెట్టినా అది నిమిషాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు ఆనంద్ మహేంద్ర.

ఆనంద్ మహేంద్ర ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ వీడియోస్ షేర్ చేస్తూ.. తనదైన శైలిలో క్యాప్షన్స్ ఇస్తూ ఉంటారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వీడియోను తన సోషల్ మీడియా ఖాతలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్ షికార్లు చేస్తుంది. ఓ ఫుడ్ ట్రక్‌.. రెస్టారెంట్‌గా ఎలా మారింది అనే వీడియోను షేర్ చేశారు ఆనంద్ మహేంద్ర. ఆయన షేర్ చేసిన వీడియోను గమనిస్తే.. ఓ చిన్న ఫుడ్ ట్రక్ కు సంబంధించని వ్యాన్ లో నుంచి ఓ వ్యక్తి బయటకు వచ్చి.. క్షణాల్లోనే ఆ ట్రక్ ను .. ఓ మినీ రెస్టారెంట్ గా మార్చేస్తాడు. చూస్తుంటే ఓ విధంగా ఇది రెస్టారెంట్ ఆన్ వీల్స్ అనే కాన్సెప్ట్ ను ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న అప్ డేటెడ్ టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని .. ఈ ఫుడ్ ట్రక్ ఓనర్ ఈ ఛాన్స్ ను బాగా యూజ్ చేసుకుంటున్నాడని చెప్పి తీరాలి.

మరో వైపు వ్యాపారస్తుడికి లాభం కూడా చేకూరుతుంది. ఎందుకంటే, ఈ ఫుడ్ ట్రక్ రెస్టారెంట్ కేవలం ఒకే దగ్గర ఉండాల్సి పని లేదు. ఎక్కడ మార్కెట్ ఎక్కువగా ఉంటే అక్కడకు మార్చుకోవచ్చు. ఈ వ్యాపారస్థుడి ఆలోచనకు ఆనంద్ మహేంద్ర ఆశ్చర్య పోయి.. ఈ వీడియోను షేర్ చేశారు. అంతేకాకుండా దానికి ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ను కూడా యాడ్ చేశారు. “ఫాస్ట్ ఫుడ్.. ఫాస్ట్ ట్రక్స్.. ఇప్పుడు ఫాస్ట్ రెస్టారెంట్స్. ఈ న్యూ బిజినెస్ ఐడియా చాలా బావుంది. ఈ రెస్టారెంట్ ఒకే స్థానంలో ఉండాల్సిన పనిలేదు. ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడకు వెళ్లొచ్చు” అంటూ రాసుకొచ్చారు ఆనంద్ మహేంద్ర. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి