iDreamPost

డిగ్రీ, BTech, PG పూర్తి చేశారా?.. ఈ కోర్సులు చేస్తే.. ఉద్యోగావకాశాలు క్యూకట్టడం ఖాయం

మీరు డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసినట్లైతే ఈ కోర్సులు చేస్తే ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు నిపుణులు. లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు పొందొచ్చు. ఇంతకీ ఆ కోర్సులు ఏంటంటే?

మీరు డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసినట్లైతే ఈ కోర్సులు చేస్తే ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు నిపుణులు. లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు పొందొచ్చు. ఇంతకీ ఆ కోర్సులు ఏంటంటే?

డిగ్రీ, BTech, PG పూర్తి చేశారా?.. ఈ కోర్సులు చేస్తే.. ఉద్యోగావకాశాలు క్యూకట్టడం ఖాయం

ఈ రోజుల్లో ఏం చదివామన్నది ముఖ్యం కాదు.. చదివిన చదువుతో కళ్లు చెదిరే ప్యాకేజీతో ఉద్యోగం సాధించామా లేదా అన్నదే ముఖ్యం. డిగ్రీ, బీటెక్, పీజీల్లో ఏది చదివినా సరే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో విస్తృతమైన ఉద్యోగావకాశాలున్నాయి. డిగ్రీ క్వాలిఫికేషన్ తో సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలను సాధించొచ్చు. బీటెక్ తో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు దిగ్గజ టెక్ కంపెనీల్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా రాణించొచ్చు. పీజీతో కూడా ఉన్నతమైన ఉద్యోగాలను పొందే వీలుంది. మరి ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ సెక్టార్ లో లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలను కొల్లగొట్టాలంటే ఏ చేయాలి? ఏ కోర్సులు చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది? అని డిగ్రీ, బీటెక్, పీజీ విద్యలను పూర్తి చేసుకున్నవారు ఆలోచిస్తుంటారు. అలాంటి వారు ఈ కోర్సులను చేస్తే ఉద్యోగావకాశాలు క్యూకట్టడం పక్కా అంటున్నారు నిపుణులు.

భవిష్యత్ కాలమంతా టెక్నాలజీదే. ఇప్పటికే ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలను సృష్టిస్తోంది. ఇలాంటి సమయంలో కొత్తగా ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారు, ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వారు స్కిల్స్ ను డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కంప్యూటర్ లాంగ్వేజ్ కోడింగ్ నేర్చుకుంటే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల్లో జాబ్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుతం పైథాన్, జావా ఫుల్ స్టాక్ డెవలపర్, ఏడబ్య్లూఎస్, ఎస్ క్యూఎల్ అజుర వంటి కోర్సులకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగ సాధనలో మీరు ముందువరుసలో ఉన్నట్లే.

పైథాన్:

ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. పైథాన్ డెవలపర్ లకు గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌, యాక్సెంచర్, కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ వంటి సంస్థలు ప్రియారిటీ ఇస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, టెస్టింగ్, వెబ్‌ డెవలప్‌మెంట్, యాప్‌ డెవలప్‌మెంట్, స్క్రిప్ట్‌ రైటింగ్, డేటాసైన్స్‌ వంటి అనేక విభాగాల్లో పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ను ఉపయోగిస్తున్నారు. డిగ్రీ, ఎంసీఏ, బీటెక్ చేసిన వారు ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ను నేర్చుకుని కెరీర్ ను మెరుగుపరుచుకోవచ్చు. మీకు ఆసక్తి ఉంటే ఇన్సిట్యూట్ లోనే కాకుండా యూట్యూబ్ లో కూడా ఈ కోర్సును నేర్చుకోవచ్చు. పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ నేర్చుకుంటే పైథాన్‌ డెవలపర్‌గా కెరీర్‌ ప్రారంభించొచ్చు. పైథాన్ డెవలపర్స్ వెబ్‌సైట్‌లను రూపొందించడం, డేటా అనలిటిక్స్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం, సమర్థమైన కోడింగ్‌ రాయడం, డేటా ప్రొటెక్షన్, సెక్యూరిటీ బాధ్యతలను నిర్వహిస్తారు. లక్షల్లో వేతనాలు అందించే ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.

After degree

అమెజాన్ వెబ్ సర్వీసెస్:

క్లౌడ్ కంప్యూటింగ్ సేవల్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఒకటి. ఈఎస్పీఎన్, అడోబ్, ట్విట్టర్, నెట్ ఫ్లిక్స్, ఫేస్ బుక్ వంటి సంస్థలు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ను వినియోగిస్తున్నాయి. మీరు ఏడబ్య్లూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఫ్రెషర్‌గా మీ కెరీర్‌ని ప్రారంభించాలనుకుంటే ఈ కోర్సును నేర్చుకుంటే ఉత్తమం. దిగ్గజ కంపెనీలన్నీ ఏడబ్య్లూఎస్ ఉపయోగిస్తుండడంతో క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణులకు ఉద్యోగావకాశాలు పెరిగాయి. ఈ కోర్సును నేర్చుకుంటే లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలను పొందొచ్చు.

జావా:

సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాలు దక్కించుకోవాలంటే మరో ఉత్తమమైన మార్గం జావా కోర్సు. దీన్ని నేర్చుకుంటే ఐటీ సెక్టార్ లో జాబ్స్ కు కొదవ లేదు. జావా స్కిల్స్ ఉన్నట్లైతే భారీ వేతనాలతో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను అందుకోవచ్చు. జావా డెవలపర్‌గా రాణించాలంటే ఆబ్జెక్ట్‌-ఓరియెంటెడ్‌ ప్రోగ్రామింగ్, ఎక్సెప్షన్‌ హాండ్లింగ్‌ సహా కోర్‌ జావా కాన్సెప్ట్‌లపై పట్టుండాలి. సర్వ్‌లెట్స్, జేఎస్‌పీ, రెస్ట్‌ఫుల్‌ వెబ్‌ సర్వీసెస్‌తో కూడిన వెబ్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యంతోపాటు స్ప్రింగ్, హైబర్నేట్‌ వంటి ఫ్రేమ్‌వర్క్‌లలో నైపుణ్యం పెంచుకోవాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి