iDreamPost

వైసీపీ డబ్బు,మద్యం పంపిణీ చేస్తే ఫోటోలు తీసి పంపండి – చంద్రబాబు

వైసీపీ డబ్బు,మద్యం పంపిణీ చేస్తే ఫోటోలు తీసి పంపండి – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి డబ్బు, మద్యం పంచినట్లు తెలిసినా, లేదా మంత్రుల సొంత నియోజకవర్గంలో పార్టీ ఓడిపోయినా మంత్రిపదవులు తీసివేస్తానని వైఎస్ జగన్ గతంలో వార్నింగ్ ఇచ్చారు.

అయితే  తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలు డబ్బు మద్యం పంచుతున్నట్లు తెలిస్తే డబ్బు పంచుతున్న ఫోటోలను, వీడియోలను తమకు పంపాలని తెలుగుదేశం నేతలకు కార్యకర్తలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ భవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని, టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు.

Read Also: స్థానిక సంస్థల ఎన్నికలపై “నిఘా”

వైసీపీ నేతలు డబ్బు, మద్యం పంపిణి చేస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలని, అందుబాటులో ఉన్న మీడియాను వాడుకోవాలని సలహా ఇచ్చారు. ఆధారాలు తమకు పంపితే వెంటనే చర్యలు చేపట్టేలా అధికారులకు తాము పిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ విషయంలో స్థానిక నేతలు యువతను ప్రోత్సహించాలని, యువ నాయకత్వం ఎదిగే అవకాశం ఇదేనని చంద్రబాబు టీడీపీ నేతలకు కార్యకర్తలకు టెలికాన్ఫరెన్స్‌ ద్వారా పిలుపునిచ్చారు.

కాగా చంద్రబాబు వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ, వైసీపీ డబ్బు పంపిణీ చేస్తే టీడీపీ నేతలకు సమాచారం ఇవ్వాలి, ఒకవేళ టీడీపీ నేతలే స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బును పంచితే ఎవరికి సమాచారం ఇవ్వాలో సూచించాలని పలువురు వ్యాఖ్యానిస్తుండటం విశేషం. స్థానిక సంస్థల ఈనెలలో జరగనున్న నేపథ్యంలో గెలుపుకోసం అధికారంలో ఉన్న వైసీపీ,ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. బీజేపీ జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి