SNP
SNP
ఆసియా కప్ 2023 ఫైనల్ కోసం ఇండియా-శ్రీలంక జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య కొలంబోలో ఫైనల్ పోరు జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన ఆసియా కప్ ఫైనల్స్‌లో టీమిండియా 7 సార్లు విజేతగా నిలిస్తే.. లంక 6 సార్లు కప్పు కొట్టింది. దీంతో ఈ రెండు ఆసియా కప్ పోటీల్లో బలమైన ప్రత్యర్థులు. ఈ సారి టోర్నీలో కూడా సూపర్ 4లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ హోరాహోరీగా, రసవత్తరంగా సాగింది. ప్రస్తుతం ఆసియా కప్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న లంక.. ఇండియాను ఓడించే పనిచేసింది. దీంతో ఫైనల్ కూడా చాలా టఫ్‌గా జరగడం ఖాయంగా కనిపిస్తుంది. కానీ, అభిమానులు వర్షం కలవరపెడుతోంది.
ఫైనల్ జరగాల్సిన కొలంబోలో వర్షం వస్తూ పోతూ ఉంది. ఆదివారం కూడా భారీ వర్షం వస్తే.. ఫైనల్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఫైనల్ వర్షార్పణం అయితే.. ఎవర్ని విజేతగా ప్రకటిస్తారో అంటూ ఆలోచనలో పడ్డారు. కాగా.. ఆదివారం జరిగే ఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే.. సోమవారం రిజర్వ్ డే కేటాయించారు. దీంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండు రోజుల్లో ఏదో ఒక రోజు లేదా.. రెండు రోజులు సగం సగం మ్యాచ్ అయినా సరిగే అవకాశం ఉంది.
మరీ దురదృష్టవశాత్తు రెండు రోజులు కూడా వర్షం ఆగకుండా వస్తే మాత్రం.. ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే ఛాన్స్ ఉంది. కాగా.. ఆదివారం జరగబోయే ఫైనల్‌లో ఇండియాకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సూపర్ 4 స్టేజ్‌లో లంకను ఓడించడంతో పాటే టీమ్‌లోని ఆటగాళ్లంతా అద్భుత ఫామ్‌లో ఉండటం టీమిండియా ప్లస్ కానున్నాయి. పైగా లంక టీమ్‌లో అనుభవం లేని ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు.. ఫైనల్ లాంటి మ్యాచ్‌లో భారీ ఒత్తిడి ఉంటుంది. దాన్ని తట్టుకుని వాళ్లు ఎలా రాణిస్తారో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Star Sports promo for the Asia Cup final….!!!!!!pic.twitter.com/tD5eCsoZ9R
— Johns. (@CricCrazyJohns) September 16, 2023