iDreamPost

రూ.1000 రుణానికి.. 2 కోట్లు చెల్లించిన CEO.. ఇది కదా స్నేహమంటే..

Bank CEO Two Crores Repays Old Friend: ఈ మధ్య డబ్బు విషయంలో సొంత వారిని కూడా నమ్మే పరిస్థితి లేదని అంటారు. అలాంటిది ఓ వ్యక్తి ఏమాత్రం సంబంధం లేని వారికి ఏడ లక్షల షేర్లు గిఫ్ట్ ఇచ్చాడన్న వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.

Bank CEO Two Crores Repays Old Friend: ఈ మధ్య డబ్బు విషయంలో సొంత వారిని కూడా నమ్మే పరిస్థితి లేదని అంటారు. అలాంటిది ఓ వ్యక్తి ఏమాత్రం సంబంధం లేని వారికి ఏడ లక్షల షేర్లు గిఫ్ట్ ఇచ్చాడన్న వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.

రూ.1000 రుణానికి.. 2 కోట్లు చెల్లించిన CEO.. ఇది కదా స్నేహమంటే..

సొసైటీలో కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా ఇంకా ఇంకా సంపాదించాలని భావిస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం సంపాదించిన డబ్బు మంచి పనుల కోసం ఖర్చుపెడుతుంటారు. పేద ప్రజలు, అనాథలు, అంగవైకల్యంతో బాధపడేవారు ఇలా ఎంతోమందికి సాయం అందింస్తుంటారు. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తుంటారు. వి వైద్యనాథన్ ఈ పేరు ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. కానీ ఆయన చేసి పనులు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైద్యనాథన్ ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ సీఈఓ, ఎండీగా పనిచేస్తున్నారు. ఆయన ఎంతోమందికి సేవలు అందిస్తూ వస్తున్నారు. తన స్నేహితుడి కోసం ఆయన చేసిన పనికి అందరూ హర్షిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ఆపదలో ఉన్న వారికి వైద్యనాథన్ సాయం చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు బ్యాంకు లో తన వాటాలో నుంచి షేర్లను బహుమతిగా ఇస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 80 కోట్ల విలువైన షేర్ల.. తన స్నేహితుడు సహా ఇంకా కష్టాల్లో ఉన్నవారికిపంచి పెట్టారు. ఇప్పటి వరకు ఏడు లక్షల షేర్లు.. ఐదుగురు వేర్వేరు వ్యక్తులకు విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఐడీఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ షేరు ధర రూ.78 లెవెల్స్ లో ఉండగా.. 7 లక్షల షేర్ల విలువన దాదాపు రూ.5.5 కోట్ల వరకు ఉంటుంది. అంటే ఇంత విలువను ఆయన దానం చేశారు. ఈ ఐదుగురు వ్యక్తుల్లో చాలా మంది తెలియని వారే ఉన్నారు. ఇందులో రిటైర్ట్ ఎయిర్ ఫోర్స్ అధికారి ఒకరు ఉన్నారు.. ఆయన పేరు సంపత్ కుమార్.

ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే.. సంపత్ కుమార్ ఎప్పుడో వైద్యనాథన్ కి అవసరం కోసం రూ.1000 అప్పుగా ఇచ్చాడట. దాన్ని గుర్తు పెట్టుకొని వైద్యనాథన్ చాలా కాలం తర్వాత స్నేహాన్ని మర్చిపోకుండా ఆ రోజుల్లో చేసిన సాయం గుర్తు పెట్టుకొని తన రెండు విలువైన షేర్లను గిఫ్ట్ గా ఇచ్చారట. వీటి విలువ సుమారు రూ.2 కోట్ల వరుకు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అంటే రూ. 1000 కి బదులుగా రూ. 2 కోట్లు తిరిగి చెల్లించాడన్నమాట. స్నేహం అంటే ఇదేరా.. ఈ కాలంలో గుర్తు పెట్టుకొని స్నేహితుడి కోసం ఇంత గొప్ప పని చేసిన వైద్యనాథన్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి