iDreamPost

డిగ్రీ అర్హతతో 600 బ్యాంక్ ఉద్యోగాలు.. సంవత్సరానికి జీతం రూ. 6.50 లక్షలు!

డిగ్రీ అర్హతతో 600 బ్యాంక్ ఉద్యోగాలు.. సంవత్సరానికి జీతం రూ. 6.50 లక్షలు!

మంచి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలని ప్రతిఒక్కరు కలలు కంటుంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలను సాధించడానికి అలుపెరుగని కృషి చేస్తుంటారు. ఇలాంటి వారికోసం ప్రముఖ బ్యాంక్ శుభవార్తను అందించింది. భారీస్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిగ్రీ పూర్తై ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి ఇది గొప్ప సువార్ణావకాశంగా చెప్పవచ్చు. ఐడీబీఐ ఏకంగా 600 జూనియర్‌ అసిస్టెంట్ మేనేజ‌ర్ల భ‌ర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన వారు సంవత్సరానికి రూ. 6.50 లక్షల వరకు జీతం అందుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 600 జూనియర్‌ అసిస్టెంట్ మేనేజ‌ర్ల భ‌ర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంపికైన‌ వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది పాటు పీజీడీబీఎఫ్‌లో శిక్షణ ఇస్తారు. కోర్సు పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ గా ఉద్యోగం అందించనున్నారు. కాబట్టి అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 30 లోపు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్ లో కోరింది. ఈ ఉద్యోగాలకు వయసు నిబంధనలు, దరఖాస్తు ఫీజు వంటి తదితర వివరాలు మీకోసం..

ముఖ్య సమాచారం:

బ్యాంక్: ఐడీబీఐ

పోస్టులు: 600 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ ఉద్యోగాలు

అర్హత‌: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత

వయో పరిమితి: అభ్యర్థుల వ‌య‌సు 31/08/2023 నాటికి 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగులకు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఇస్తారు.

ఎంపిక ప్రక్రియ: అర్హులైన అభ్యర్థుల‌కు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రతిభ క‌న‌బ‌ర్చిన వారు ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూల‌కు అర్హత సాధిస్తారు. అందులో ప్రతిభ, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపిక‌లు చేప‌డ‌తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200, ఇతరులు రూ.1000 చెల్లించాలి.

శిక్షణ, ఫీజు వివ‌రాలు: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల‌ను ఏడాదిపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్‌) కోర్సులో చేరుస్తారు. ఆ స‌మ‌యంలో అభ్యర్థులు కోర్సు ఫీజు కింద రూ.3,00,000 చెల్లించాల్సి ఉంటుంది.

జీతం: ఎంపికైన అభ్యర్థుల‌కు శిక్షణ కాలంలో నెల‌కు రూ.5000 అందిస్తారు. ఇంట‌ర్న్‌షిప్ స‌మ‌యంలో నెల‌కు రూ.15 వేలు చెల్లించనున్నారు. శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగానికి ఎంపికైనవారికి ఏడాదికి రూ.6.14 నుంచి రూ.6.50 లక్షల వ‌ర‌కు జీతం ఉంటుంది.

దరఖాస్తులు ప్రారంభ తేదీ: సెప్టెంబర్‌ 15, 2023

దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 30, 2023

ఫీజు చెల్లింపు చివరి తేదీ: సెప్టెంబర్‌ 30, 2023

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: అక్టోబర్‌ 20, 2023

ఐడీబీఐ అధికారిక వెబ్‌సైట్‌ : https://www.idbibank.in/

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి