iDreamPost

వరల్డ్ కప్​ ముందు కెప్టెన్సీ గురించి రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Author singhj Published - 06:53 PM, Wed - 4 October 23
  • Author singhj Published - 06:53 PM, Wed - 4 October 23
వరల్డ్ కప్​ ముందు కెప్టెన్సీ గురించి రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

వన్డే వరల్డ్ కప్​లో మొదటిసారి టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్​గా ఆసియా కప్ నెగ్గిన ఊపులో ఉన్న రోహిత్ సేన.. మెగా టోర్నీలోనూ ఛాంపియన్​గా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. భారత జట్టుకు కప్ అందించాలని హిట్​మ్యాన్ పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్​సైట్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నేషనల్ టీమ్​కు కెప్టెన్సీ చేసే ఛాన్స్ 26 లేదా 27 ఏళ్ల వయసులో వస్తే బాగుంటుందన్నాడు. అయితే లైఫ్​లో ఏదీ అనుకున్న వెంటనే జరిగిపోదన్నాడు హిట్​మ్యాన్.

ఇంతకుముందు చాలా మంది భారత జట్టుకు సారథ్యం వహించారని.. ఇప్పుడు తన వంతు వచ్చిందన్నాడు రోహిత్ శర్మ. మ్యాచ్ విన్నర్లుగా నిలిచిన అనేక మంది స్టార్ ప్లేయర్లకు కెప్టెన్సీ అందలేదని గుర్తుచేశాడు. టీమ్​లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నా.. ఇప్పుడు తనకు ఆ అవకాశం వచ్చిందని వెల్లడించాడు. కెప్టెన్సీ అందుకోవడానికి 26 లేదా 27 ఏళ్ల వయసు సరైందని రోహిత్ అన్నాడు. కానీ మనం కోరుకునేవి వెంటనే పొందలేమన్నాడు. ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో అద్భుతమైన స్టార్ ప్లేయర్లు ఉన్నారని.. వారంతా కెప్టెన్సీకి అర్హులేన్నాడు హిట్​మ్యాన్.

టీమిండియాలో ఉన్న స్టార్ ప్లేయర్లు అందరూ కెప్టెన్సీకి అర్హులే. కానీ, ఇప్పుడు నా వంతు వచ్చింది. నా కంటే ముందు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్లుగా వ్యవహరించారు. గతంలోనూ భారత జట్టులో గంభీర్, సెహ్వాగ్, యువరాజ్ లాంటి స్టార్లు ఆడారు. యువీ మ్యాచ్ విన్నర్. కానీ ఎప్పుడూ కెప్టెన్సీ చేయలేదు. ఒక టైమ్​లో అతడికి కెప్టెన్సీ ఛాన్స్ వచ్చినట్లే వచ్చి మిస్సయింది. లైఫ్ అంటే అదే. కెప్టెన్సీ గురించి ఏమీ తెలియనప్పటి కంటే ఇలా సరైన సమయంలో అవకాశం రావడం మంచిదని భావిస్తున్నా. వరల్డ్ కప్​లో గెలవాలంటే అందరూ కలసికట్టుగా ఆడాలి. మొత్తం 11 మ్యాచ్​ల్లో నెగ్గితేనే ఛాంపియన్లం అవుతాం’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ఇదీ చదవండి: VIDEO: ఓ వైపు వరల్డ్‌ కప్‌.. మరోవైపు ఆస్పత్రి బెడ్‌పై స్టార్‌ క్రికెటర్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి