iDreamPost

ఇండో-పాక్ మ్యాచ్.. ఆ స్టార్ సింగర్ సహా ఆడిపాడనున్న సెలబ్రిటీస్ వీళ్లే..!

  • Author singhj Published - 11:00 AM, Fri - 13 October 23
  • Author singhj Published - 11:00 AM, Fri - 13 October 23
ఇండో-పాక్ మ్యాచ్.. ఆ స్టార్ సింగర్ సహా ఆడిపాడనున్న సెలబ్రిటీస్ వీళ్లే..!

వన్డే వరల్డ్ కప్​-2023లో బిగ్​ మ్యాచ్​కు అంతా రెడీ అయిపోయింది. భారత్, పాకిస్థాన్​లు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ స్టేడియం దాయాదుల పోరుకు వేదిక కానుంది. శనివారం జరగనున్న ఈ మ్యాచ్​ కోసం భారత క్రికెట్ బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సెలబ్రిటీస్ ఆటపాటలతో వేరే లెవల్లో ఈ మ్యాచ్ సెర్మనీని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు వినిపించింది. దీంతో వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచ్​కు సెర్మనీ నిర్వహించలేదని.. అలాంటిది ఇండో-పాక్ మ్యాచ్​కు ఎలా సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తారని బీసీసీఐపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ఇండియా-పాకిస్థాన్​ మ్యాచ్​కు గనుక ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తే అది మిగతా జట్లను, ఆయా టీమ్స్ కెప్టెన్స్​ను అవమానించడమేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అయ్యారు. అయినా భారత క్రికెట్ బోర్డు వెనక్కి తగ్గడం లేదు. ఇండో-పాక్ మ్యాచ్​కు ముందు మ్యూజికల్ ఒడిస్సీకి ఏర్పాట్లు చేస్తోందట. బాలీవుడ్ స్టార్ సింగర్ అరిజిత్ సింగ్ ఇందులో పాల్గొంటారని టాక్. అరిజిత్​తో పాటు పాపులర్ సింగర్స్ శంకర్ మహదేవన్, నేహా కక్కర్, సుఖ్వీందర్ సింగ్ కూడా తమ ఆటపాటలతో ఫ్యాన్స్​ను ఉర్రూతలూగించనున్నారని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ కార్యక్రమంలో స్టార్ హీరో రణ్​వీర్ సింగ్, హీరోయిన్ తమన్నా భాటియాలు కూడా తమ పెర్ఫార్మెన్స్​లతో రచ్చ చేయనున్నారని సమాచారం.

ఇక, ఒకప్పటితో పోలిస్తే ఇండియా-పాకిస్థాన్​ మ్యాచ్​లంటే ఉండే టెన్షన్ వాతావరణంలో కాస్త మార్పు వచ్చింది. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్​పై ఫ్యాన్స్​లో ఉండే ఇంట్రెస్ట్​లో ఎలాంటి మార్పు లేదు. కానీ గ్రౌండ్​లో అప్పటిలా ఉద్రిక్త వాతావరణం కనిపించడం లేదు. ప్లేయర్లు ఫ్రెండ్లీగా ఉంటున్నారు. రెండు టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్​లు చాలా తక్కువ. ఇండో-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్​లు జరగట్లేదు. దీంతో ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. అయితే దాయాదుల సమరంలో తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగే ఆటగాళ్లు తప్పక రాణించాల్సిన పరిస్థితి. బాగా ఆడితే ప్రశంసలు.. ఫెయిల్ అయ్యారా విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఈసారి మ్యాచ్ ఎలా జరుగుతుందో చూడాలి. మరి.. భారత్-పాక్ మ్యాచ్​కు ముందు బాలీవుడ్ సెలబ్రిటీల పెర్ఫార్మెన్స్ చూడటానికి మీరెంత ఆసక్తిగా ఉన్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్​లో సామాన్యుడికి సత్కారం.. ఎవరితను?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి