iDreamPost

World Cup: కోహ్లీకి కలిసొచ్చేలా ICC కొత్త రూల్‌! రోహిత్‌కి మాత్రం పెద్ద దెబ్బ

  • Published Oct 05, 2023 | 4:16 PMUpdated Oct 05, 2023 | 5:31 PM
  • Published Oct 05, 2023 | 4:16 PMUpdated Oct 05, 2023 | 5:31 PM
World Cup: కోహ్లీకి కలిసొచ్చేలా ICC కొత్త రూల్‌! రోహిత్‌కి మాత్రం పెద్ద దెబ్బ

నేటి నుంచి వరల్డ్‌ కప్‌ మహా సంగ్రామం షురువైంది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేసింది. అయితే.. ఈ వరల్డ్‌ కప్‌ కోసం ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) కొన్ని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అదేంటంటే.. వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ జరిగే ప్రతి స్టేడియంలో బౌండరీ లైన్‌ కచ్చితంగా 70 మీటర్ల దూరం ఉండాలనే రూల్‌ పెట్టింది. దీనికి సంబంధించిన ఆర్డర్స్‌ను వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు జరిగే ప్రతి గ్రౌండ్‌ నిర్వాహకులకు ఐసీసీ నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే.. గతంలో ఇలా కచ్చితంగా 70 మీటర్ల బౌండరీ ఉండాలన్న రూల్‌ లేదు. 70 కంటే తక్కువ కూడా ఉండేవి, 70 కంటే ఎక్కువ కూడా ఉండేవి.

అయితే.. ఈ వరల్డ్‌ కప్‌లో కచ్చితం 70 మీటర్లు, అంతకంటే ఎక్కువే ఉండాలని ఐసీసీ సూచించింది. అయితే.. ఈ కొత్త రూల్‌ మ్యాచ్‌లపైనే కాకుండా, కొంతమంది ఆటగాళ్లపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా టీమిండియా స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ గురించి మాట్లాడుకుంటే.. ఈ 70 మీటర్ల బౌండరీ రూల్ కోహ్లీకి ప్లస్‌ కానుండగా, రోహిత్‌ శర్మకు మైనస్‌ కానుంది. అదేలా అంటే.. కోహ్లీ, రోహిత్‌ బ్యాటింగ్‌ స్టైలే అందుకు కారణం. సాధారణంగా రోహిత్‌ శర్మ చాలా అగ్రెసివ్‌గా ఆడతాడు, కానీ, కోహ్లీ అలా కాదు. వన్డేల్లో కోహ్లీ ఇన్నింగ్స్‌ డిఫరెంట్‌ స్టైల్‌లో ఉంటుంది.

రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌లో ఎక్కువగా సిక్సులు ఉంటాయి. కోహ్లీ ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సింగిల్స్‌, డబుల్స్‌ ఎక్కువగా ఉంటాయి. రోహిత్‌ బాల్‌ను బౌండరీ లైన్‌ పైనుంచి కొట్టేందుకు ఇష్టపడుతుంటాడు. ఎక్కువగా బాల్‌ను గాల్లో ఉంచుతాడు. కానీ, కోహ్లీ అవసరమైన సమయంలో తప్పా.. పెద్దగా భారీ షాట్లు ఆడడు. బాల్‌ను ఎక్కువగా గ్రౌండ్‌పైనే ఉంచుతాడు. ఇప్పుడు 70 మీటర్ల బౌండరీ ఉండటంతో ఫీల్డర్ల మధ్య గ్యాప్‌ ఉంటుంది. దీంతో కోహ్లీకి ఫోర్లు, డబుల్స్‌ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అదే రోహిత్‌ శర్మ విషయంలో.. ఎక్కువగా బాల్‌ గాల్లోకి లేపుతాడు కాబట్టి.. బాల్‌ బౌండరీ లైన్‌ దాటితే ఓకే. లేదా బౌండరీ లైన్‌కి అటూ ఇటూ అయినా కూడా రోహిత్‌ క్యాచ్‌ అవుట్‌ అ‍య్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇలా ఐసీసీ 70 మీటర్ల రూల్‌ కోహ్లీకి ప్లస్‌ కానుండగా, రోహిత్‌కి మైనస్‌ అవుతుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఫ్రెండ్స్​తో కలసి ఫుల్​గా ఎంజాయ్ చేస్తున్న కోహ్లీ.. వీడియో వైరల్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి