iDreamPost

వైద్యానికి రూ. 16 కోట్ల ఇంజక్షన్.. అందరూ కలిసి సాయం చేసినా

పదివేల మందిలో వచ్చే అరుదైన వ్యాధి బారిన పడ్డాడు భవిక్ రెడ్డి. కొడుకును కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఆసుపత్రికి తిరిగారు తల్లిదండ్రులు. చివరకు ఓ ఆసుపత్రిలో చేర్చుకోగా.. ఈ డిసీజ్ నయం కావాలంటే.. కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు వైద్యులు. అయితే

పదివేల మందిలో వచ్చే అరుదైన వ్యాధి బారిన పడ్డాడు భవిక్ రెడ్డి. కొడుకును కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఆసుపత్రికి తిరిగారు తల్లిదండ్రులు. చివరకు ఓ ఆసుపత్రిలో చేర్చుకోగా.. ఈ డిసీజ్ నయం కావాలంటే.. కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు వైద్యులు. అయితే

వైద్యానికి రూ. 16 కోట్ల ఇంజక్షన్.. అందరూ కలిసి సాయం చేసినా

బాబు పుట్టాడని సంబర పడేలోపు.. అరుదైన వ్యాధి వచ్చి సంతోషాన్ని హరించేసింది. కష్టమైనా, నష్టమైనా చిన్నారిని బతికించుకోవాలని తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రులు తిప్పారు. అయితే ఈ రేర్ డిసీజ్‌కు ట్రీట్‌మెంట్ చేయాలంటే కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడించారు వైద్యులు. అంత డబ్బు పెట్టలేని స్థితి వారిది. పేదరికం వెక్కిరిస్తోన్న తమ కంటి పాపాయిని కాపాడుకోవాలని.. చేతులు చాచి డబ్బు సాయం చేయాలని దాతలను వేడుకున్నారు. డబ్బు మెల్లిగా సమకూరుతుందని, తమ బాబు తమకు దక్కుతాడు అనుకుంటున్న సమయంలో ఆ ప్రాణాంతక వ్యాధి ప్రాణాలను తీసుకుని.. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చింది. తిరిగి మామూలు మనిషిగా కొడుకుని చూసుకుంటాం అనుకున్న తల్లిదండ్రులకు.. పుత్ర శోకం మిగిలింది.

యాద్రాద్రి భువన గిరి జిల్లాలోని వలిగొండ మండలం పుల్లిగిల్ల గ్రామానికి చెందిన దిలీప్ రెడ్డి-యామిని కుమారుడు భవిక్ రెడ్డి.. అరుదైన వ్యాధితో పోరాడుతూ.. కన్నుమూశాడు. తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం వృధాగా మారింది. ఇంతకు ఆ రేర్ డిసీజ్ ఏంటంటే.. స్పైనల్ మస్క్యూలర్ అట్రోఫీ (సైంధవ్ మూవీలో చిన్నారి కూడా ఇదే వ్యాధితో బాధపడుతున్నట్లు చూపించాడు దర్శకుడు). నరాల కండరాల బలహీనత ఎస్ఎమ్ఏ టైన్ -1 హైరిస్క్‌గా వైద్యులు నిర్ధారించారు. భవిక్ బతకాలంటే రూ. 16 కోట్లు ఇంజెక్షన్ అవసరమని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని  రెయిన్ బో ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అప్పటి నుండి అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు చిన్నారి. కాగా, తండ్రి ఎలక్ట్రీషియన్ కావడంతో బాబుకు ఖరీదైన వైద్యం ఇప్పించాలంటే.. తలకు మించిన భారంగా మారింది.

తల్లిదండ్రులు కష్టాన్ని గ్రహించిన ఆసుపత్రి.. విరాళాలను సేకరించడం ప్రారంభించింది. బాబు చికిత్సకు అవసరమైన డబ్బు కోసం క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే రూ. 10 కోట్ల విరాళాలు సేకరించింది. విదేశాల నుండి ఇంత డబ్బు సమకూరింది. మరో 6 కోట్లు సమకూరాల్సి ఉంది. దీని కోసం దాతల్ని ఆశ్రయించారు. అంతలోనే చిన్నారి భవిక్ ఆరోగ్యం విషమించి.. చిన్నారి మృత్యు ఒడికి చేరుకున్నాడు. వైద్యానికి అవసరమైన సగానికి పైగా డబ్బులు అందినా కూడా బిడ్డను బ్రతికించుకోలేక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. స్పైనల్ మస్క్యూలర్ అట్రోఫీ జన్యుపరమైన డిసీజ్. మనుషుల్లోని 23 జత క్రోమోజోములు ఉంటాయి. క్రోమో జోమ్-5లో సర్వైవల్ మోటార్ న్యూరాన్ -1 వంటి జన్యు లోపం ఏర్పడుతుంది. ఇది కండరాల స్పందనకు కీలకం. ఈ లోపంతోనే ఏటా అమెరికాలో 400 మంది పిల్లలు జన్మిస్తారని అంచనా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి