Somesekhar
క్రికెట్ చరిత్రలో తాజాగా ఓ అరుదైన ఘటన జరిగింది. ఒకే ఫ్యామిలీ నుంచి రెండు తరాల వారు, ఒకే మ్యాచ్ లో ఆడుతూ.. అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. మామ, అల్లుడు ఓపెనర్లుగా బరిలోకిగి దిగారు.
క్రికెట్ చరిత్రలో తాజాగా ఓ అరుదైన ఘటన జరిగింది. ఒకే ఫ్యామిలీ నుంచి రెండు తరాల వారు, ఒకే మ్యాచ్ లో ఆడుతూ.. అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. మామ, అల్లుడు ఓపెనర్లుగా బరిలోకిగి దిగారు.
Somesekhar
ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా క్రికెట్ లోకి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు(అన్నదమ్ములు, తండ్రీకొడులు) రావడం మనం చూసే ఉన్నాం. అయితే ఎక్కువగా బ్రదర్స్ కలిసి క్రికెట్ ఆడటమే మనం చూశాం. కానీ క్రికెట్ చరిత్రలో తాజాగా ఓ అరుదైన ఘటన జరిగింది. ఒకే ఫ్యామిలీ నుంచి రెండు తరాల వారు, ఒకే మ్యాచ్ లో ఆడుతూ.. అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. మామ, అల్లుడు ఓపెనర్లుగా బరిలోకిగి దిగారు. ఈ మ్యాచ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రపంచ క్రికెట్ లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒకే మ్యాచ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగారు మామ, అల్లుడు. ఈ ఇంట్రెస్టింగ్ సీన్ ఐర్లాండ్-ఆఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో కనిపించింది. ఇరు జట్ల మధ్య అబుదాబిలోని టాలరెన్స్ ఓవల్ మైదానంలో ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయ్యింది. ఈ మ్యాచ్ లో ఆఫ్గాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్.. తన మామ అయిన నూర్ అలీ జద్రాన్ తో కలిసి ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. మామ-అల్లుడు కలిసి ఓపెనర్లుగా బరిలోకి దిగారు. 22 సంవత్సరాల ఇబ్రహీం.. 35 ఏళ్ల తన మామతో కలిసి ఆడుతుండటం, పైగా ఓపెనర్లుగా బరిలోకి దిగడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే.
కాగా.. కొలంబోలో శ్రీలంకతో ఏకైక టెస్ట్ స్టార్టింగ్ కు ముందు ఇబ్రహీం తన అంకుల్ నూర్ అలీకి తొలి టెస్ట్ క్యాప్ ను అందించాడు. అప్పట్లో ఈ న్యూస్ వైరల్ గా కూడా మారింది. నూర్ అలీకి ఇది రెండో టెస్ట్ మాత్రమే కాగా.. జద్రాన్ కు 7వది. నూర్ అలీ 51 వన్డేల్లో 1216 రన్స్, 23 టీ20ల్లో 597 పరుగులు చేశాడు. ఇక మ్యచ్ విషయానికి వస్తే.. ఆఫ్గాన్ తొలి ఇన్నింగ్స్ లో 155 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మామ, అల్లుడు గొప్ప ఆరంభం ఇవ్వలేకపోయారు. ఇబ్రహీం జద్రాన్ 53 పరుగులు చేయగా.. మామ నూర్ అలీ 7 రన్స్ మాత్రమే చేసి నిరాశపరిచాడు. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్ టీమ్ తొలిరోజు ఆటముగిసే సమయానికి 4 వికెట్లకు 100 పరుగులు చేసింది. మరి ఒకే మ్యాచ్ లో ఓపెనర్లుగా మామ, అల్లుడు బరిలోకి దిగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ibrahim Zadran opening with his uncle Noor Ali Zadran in a Test match.
– Ibrahim handed the Test cap to his uncle Noor a few weeks back. pic.twitter.com/kyBIMAG3B8
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 28, 2024
ఇదికూడా చదవండి: దంచికొట్టిన తిలక్ వర్మ.. కేవలం 43 బంతుల్లోనే..!