iDreamPost

మిడిల్‌ క్లాస్‌ వాళ్లకి బెస్ట్‌ బడ్జెట్‌ కారు.. దీన్ని మించినది లేదు

  • Published Nov 09, 2023 | 1:24 PMUpdated Nov 09, 2023 | 1:24 PM

ప్రస్తుత కాలంలో కారు అనేది కనీస అవసరంగా మారింది. మిడిల్‌ క్లాస్‌ వాళ్లు కూడా కారు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో మధ్యతరగతి వాళ్ల కోసం బెస్ట్‌ బడ్జెట్‌ కారు డీటెయిల్స్‌ ఇలా ఉన్నాయి..

ప్రస్తుత కాలంలో కారు అనేది కనీస అవసరంగా మారింది. మిడిల్‌ క్లాస్‌ వాళ్లు కూడా కారు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో మధ్యతరగతి వాళ్ల కోసం బెస్ట్‌ బడ్జెట్‌ కారు డీటెయిల్స్‌ ఇలా ఉన్నాయి..

  • Published Nov 09, 2023 | 1:24 PMUpdated Nov 09, 2023 | 1:24 PM
మిడిల్‌ క్లాస్‌ వాళ్లకి బెస్ట్‌ బడ్జెట్‌ కారు.. దీన్ని మించినది లేదు

ఒకప్పుడు ఇంట్లో సైకిల్‌ ఉంటే చాలా గొప్పగా భావించేవారు. దాన్ని ఎంతో అపురూపంగా చూసేవారు. ఆ తర్వాత కాలం మారడం.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో.. సైకిల్‌ స్థానంలోకి టూవీలర్స్‌ వచ్చాయి. ఈఎంఐ పద్దతి అందుబాటులోకి వచ్చాక జనాలు కొనుగోళు శక్తి పెరిగి.. విపరీతంగా ఖర్చు చేయడం మొదలు పెట్టారు. ఒకేసారి పెద్ద మొత్తం కట్టేబదులు.. దాన్ని మొత్తాలుగా విభజించి నెలకింత చెల్లించే వెసులుబాటు రావడం వల్ల.. కాస్త ఎక్కువ జీతం వచ్చే వాళ్లు.. సౌకర్యవంతమైన జీవితం దిశగా అడుగులు వేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో భాగంగా సైకిల్‌ స్థానంలోకి స్కూటర్లు, బైక్‌లు వచ్చి చేరాయి.

ఇక ప్రస్తుత కాలంలో అయితే కారు కనీస అవసరం అయ్యింది. మధ్యతరగతి వారు సైతం కారు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. కార్ల తయారీ కంపెనీలు.. మిడిల్‌ క్లాస్‌ బడ్జెట్‌కు తగ్గట్టుగా కార్లను తీసుకువస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో మంచి కార్లను అందివ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన దగ్గర బడ్జెట్‌తో పాటు లుక్‌, ఫీచర్లకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో కార్ల తయారీ కంపెనీలు కూడా మధ్యతరగతి వారి డిమాండ్‌కి అనుగుణంగా బడ్జెట్ కార్లను తీసుకువస్తున్నాయి.

దీనిలో భాగంగా ఇప్పుడు మిడిల్‌ క్లాస్‌ వాళ్లకి బెస్ట్‌ బడ్జెట్‌ కారు గురించి చెప్పబోతున్నాము. అదే హ్యుందాయ్ ఎక్స్‌టర్‌. ఈ కారు ప్రారంభ ధర 6 లక్షల రూపాయలు ఉండగా.. టాప్‌ మోడల్‌ ధర వచ్చి రూ.10.15 లక్షలుగా ఉంది. 17 వేరియంట్లు అందుబాటులో ఉండగా.. ఎక్స్‌టర్‌ ఈఎక్స్‌ బేస్‌ మోడల్‌ కాగా.. ఎక్స్‌టర్‌ ఎస్‌ఎక్స్‌ ఆప్ట్‌ కనెక్ట్‌ డీటీ ఏఎంటీ టాప్‌ మోడల్‌. ఇక బేస్‌ మోడల్‌ ఈఎక్స్‌ ధర వచ్చి 6 లక్షల రూపాయలు. ఆ తర్వాత వేరియంట్ల ధరలు పెరుగుతూ పోతాయి. ఇక టాప్‌ మోడల్‌ ఎస్‌ఎక్స్‌ ఆప్ట్‌ కనెక్ట్‌ డీటీ ఏఎంటీ రేటు రూ.10.15 లక్షలుగా ఉంది.

స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి..

హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ కారు ఇంజన్‌ కెపాసిటీ వచ్చి 1197 సీసీ, లీటర్‌కి 19.2-19.4 కేఎంపీఎల్‌ మైలేజీని అందిస్తుంది. ఇది పెట్రోల్/సీఎన్‌జీ ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. పవర్‌ వచ్చేసి 67.72-81.8 బీహెచ్‌పీ ఉంది. అలానే ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్ తో వస్తుంది

సేఫ్టీ విషయానికి వస్తే.. హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ఎలాక్ట్రానిక్‌ స్టేబిలిటీ కంట్రోల్‌, టీపీఎంఎస్‌, రేర్‌ పార్కింగ్‌ కెమెరాతో వస్తుంది. ఇవే కాక దీనిలో 8 ఇంచుల టచ్‌ స్క్రీన్‌ సిస్టమ్‌, వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జింగ్‌, ఆటో ఏసీ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

ఇక ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న టాటా పంచ్‌, మారుతి ఇగ్నిస్‌, నిస్సాన్‌ మాగ్నైట్‌, రెనాల్ట్‌ కైగర్‌, మారుతి ఫ్రోనాక్స్‌తో పోలిస్తే.. హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ హాట్‌ సెల్లింగ్‌ మోడల్‌గా ఉంది. కనుక ఈ దీపావళి సందర్భంగా మీరు కారు కొనాలనుకుంటే.. దీన్ని పరగణలోకి తీసుకొండి అంటున్నారు ఆటోమొబైల్‌ నిపుణులు. అంతేకాక మైక్రో ఎస్యూవీగా పిలవబడుతున్న ఈ కారు మిడిల్ క్లాస్ వారికి బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ ధరకు అసలు ఎస్యూవీ కారు రావడం కష్టం. కానీ హ్యుందాయ్ కంపెనీ ఎస్యూవీ డిజైన్ తో ఎక్స్ టర్ ని తీసుకొచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి