iDreamPost

వేసవిలో ‘కృత్రిమ మామిడిపండ్ల’ ముఠా! చీ ఇదేమి పనిరా బాబు!

  • Published Mar 20, 2024 | 6:48 PMUpdated Mar 20, 2024 | 6:48 PM

కాలం మారుతున్న కొద్దీ తినే ఆహార పదార్దాలు కల్తీకి గురి అవుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలను ఎక్కువగా వింటున్నాం. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి సమ్మర్ స్పెషల్ మామిడి పళ్ళు కూడా యాడ్ అయ్యాయి. వీటిని ఏ విధంగా కల్తీ చేస్తున్నారో తెలుసుకుందాం.

కాలం మారుతున్న కొద్దీ తినే ఆహార పదార్దాలు కల్తీకి గురి అవుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలను ఎక్కువగా వింటున్నాం. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి సమ్మర్ స్పెషల్ మామిడి పళ్ళు కూడా యాడ్ అయ్యాయి. వీటిని ఏ విధంగా కల్తీ చేస్తున్నారో తెలుసుకుందాం.

  • Published Mar 20, 2024 | 6:48 PMUpdated Mar 20, 2024 | 6:48 PM
వేసవిలో ‘కృత్రిమ మామిడిపండ్ల’ ముఠా! చీ ఇదేమి పనిరా బాబు!

వాతావరణంలో వచ్చిన మార్పుల కారణాల వలన .. సహజంగా కొన్ని ఆహార పదార్ధాలు కలుషితం అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం వాతావరణంలో కాలుష్యంతో పాటు.. ఆహార పదార్ధాలలో కలుషితం ఏ రేంజ్ లో అవుతుందో అందరికి తెలిసిందే. చిన్న పిల్లలు తినే చాక్లేట్లు, ఐస్ క్రీమ్స్, పీచు మిఠాయి, నకిలీ అల్లం పేస్ట్ లు, సాస్ లు ఇలా ఒకటి రెండు కాదు. దాదాపు తినే ఆహార పదార్ధాలు అన్ని కూడా కల్తీ అవుతూనే ఉన్నాయి. ఇటీవల కల్తీ ఆహార పదార్ధాల గురించి .. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే. ఏ మాత్రం లెక్కచేయకుండా .. రకరకాల కెమికల్స్ ను ఉపయోగించి ఆహార పదార్ధాలను కల్తీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ కల్తీ ఆహార పదార్ధాల జాబితాలో సమ్మర్ స్పెషల్ మామిడి పళ్ళు కూడా చేరాయి. ఇక వీటిని ఏ విధంగా కల్తీ చేస్తున్నారో తెలుసుకుందాం.

వేసవి కాలం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మామిడి పళ్ళు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు సమ్మర్ లో దొరికే మామిడి పళ్ళను ఇష్టపడుతూ ఉంటారు. ఒక అప్పుడు పండు మామిడి కాయలను తినాలంటే.. ఎటువంటి రసాయాలను ఉపయోగించకుండా సహజంగా పండ్లను పండిస్తూ ఉండేవారు. కానీ, ఇప్పుడు ఎక్కడా కూడా ఇటువంటి ప్రక్రియ కనిపించడంలేదు. మార్కెట్ లో నిగ నిగలాడుతూ .. పసుపు పచ్చ రంగుతో ఆకర్షించే మామిడి పండ్లన్నీ కూడా కృత్రిమంగా మందులతో పండించేవే. రసాయనాలతో పండ్లను పండించి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. ఇంకా పూర్తిగా మామిడి పండ్ల సీజన్ రాక ముందే. రోడ్ల పైన, మార్కెట్లలో మామిడిపండ్ల విక్రయం కూడా మొదలైంది. తాజాగా కంటికి ఆకర్షణగా కనిపించే ఆ మామిడి పండ్లన్నీ కూడా.. సహజంగా పండించినవి కాదని ప్రజలు గుర్తుంచుకోవాలి. తాజాగా కృత్రిమంగా మామిడికాయలను మగ్గపెడుతున్న ముఠాను.. హైదరాబాద్ లోని బషీర్ బాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Mangoes

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న మామిడి పండ్ల వ్యాపారస్తులను.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి రూ.3 లక్షల విలువైన మామిడి పండ్లను సీజ్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం ఇద్దరు వ్యాపారస్తులు.. ఎథిలీన్‌ అనే రసాయనంతో కృత్రిమంగా మాగబెట్టి .. వాటిని పండిన మామిడి పండ్లుగా మార్చి.. ఇతర వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. దీని గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేసి.. అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, మాగబెట్టిన 18 మామిడ పండ్ల ట్రేలు, ఐదు ప్యాకెట్ల ఎథిలీన్‌ రైపనర్‌ను కూడా పోలీసులు సీజ్‌ చేశారు. ఏదేమైనా మార్కెట్ లో కల్తీ ఆహార పదార్ధాలు ఎక్కువగా ఉన్నందు వలన.. ప్రజలు ఈ ఆహార పదార్ధాలను కొనే ముందు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదని.. నిపుణులు చెబుతున్నారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి