iDreamPost

వీడియో: HYDలోని ప్రముఖ హోటల్‌లో ఎంగిలి చట్నీ వడ్డన! ఇదేమి కర్మరా బాబు!

టిఫిన్స్, భోజనం చేసేందుకు రెస్టారెంట్స్, హోటల్స్ బాట పడుతుంటాం. ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతుంటాయి కానీ.. శుచి, శుభ్రతలో మాత్రం నామ మాత్రపు సర్వీస్ అందిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వింత జీవులు కూడా దర్శనమిస్తుంటాయి. ఇప్పుడు మరో హోటల్ నిర్వాకం బయటకు వచ్చింది.

టిఫిన్స్, భోజనం చేసేందుకు రెస్టారెంట్స్, హోటల్స్ బాట పడుతుంటాం. ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతుంటాయి కానీ.. శుచి, శుభ్రతలో మాత్రం నామ మాత్రపు సర్వీస్ అందిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వింత జీవులు కూడా దర్శనమిస్తుంటాయి. ఇప్పుడు మరో హోటల్ నిర్వాకం బయటకు వచ్చింది.

వీడియో: HYDలోని ప్రముఖ హోటల్‌లో ఎంగిలి చట్నీ వడ్డన! ఇదేమి కర్మరా బాబు!

మన బద్ధకమే ఎదుటి వాళ్లకు అవకాశంగా మారింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకు ఉదాహరణ నగరాల్లో వెలుస్తున్న రెస్టారెంట్స్ అండ్ హోటల్స్. ముఖ్యంగా బ్యాచులర్స్ పాలిట వరంగా మారాయి ఇవి. లక్షల్లో సంపాదన.. భార్యా భర్తలిద్దరూ తీరిక లేని విధంగా పనుల్లో మునిగి తేలడంతో భోజనాలే కాదు.. టిఫిన్స్ కోసం ఈ ఆహార, ఫలహార శాలలనే ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా చూసుకుని రెస్టారెంట్స్ సైతం శుచి, శుభ్రత కన్నా డబ్బులను క్యాష్ చేసుకుంటున్నాయి. వెరసి తినే తిండిలో బల్లులు, బొద్దింకలు, చివరకు ఎలుకలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మరో హోటల్ నిర్వాకం బయటకు వచ్చింది.

హైదరాబాద్ బేగంపేటలోని మెజ్బాన్ రెస్టారెంట్ సిబ్బంది చేసిన నిర్వాకం బయటపడింది. ఈ హోటల్లో కస్టమర్లు మిగిల్చిన పదార్ధాలను.. మార్చి మరొకరికి అందిస్తున్నారు. మరుసటి రోజు ఇదే ఆహార పదార్ధాలను ఇతర కస్టమర్లకు అందిస్తున్నారు. ఓ కస్టమర్ ఫోనులో రికార్డు చేసి నెట్టింట్లో పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక బౌల్‌లో మిగిలిపోయిన గ్రీన్ చట్నీ, టొమాటా సాస్ మరొక బౌల్‌లోకి మారుస్తున్నారు అక్కడ పనిచేసే సర్వర్లు. అంటే కస్టమర్లకు సర్వ్ చేసిన గ్రీన్ చట్నీ, టొమాటా సాస్ తీసుకు వచ్చి.. మరొక గిన్నెలోకి మార్చి.. ఆ తర్వాత వచ్చే కస్టమర్లకు లేదా మరుసటి రోజు హోటల్స్‌కు వచ్చే వారికి వడ్డిస్తున్నారు. అంటే తెలియకుండానే ఎంగిలి చేసిన పదార్ధాన్ని తినేస్తున్నారు కస్టమర్స్.

ఇవేమీ తెలియని కస్టమర్లు.. అడిగి మరీ తెప్పించుకుని తింటున్నారు. అలాగే మనం మిగిల్చినవి కూడా మరొకరికి అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ వీడియో చూడటంతో మెజ్బాన్ హోటల్ పై మండిపడుతున్నారు నెటిజన్లు. ఓ నెటిజన్ అయితే.. అన్ని హోటల్స్‌లో రెగ్యులర్‌గా ఇలాంటివి జరుగుతున్నాయని, ఇలా చేయగానే సిబ్బందిపై మేం కోప్పడటం.. మేనేజర్లు వచ్చి సారీ చెప్పడం.. కొనసాగుతూనే ఉందని పేర్కొన్నాడు. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర .. ఇలాంటివి కొకొల్లలు అంటూ మరొక నెటిజన్ రాసుకొచ్చాడు. కొంత మంది జీహచ్ఎంసీ ఆన్ లైన్‌కు ట్యాగ్ చేశారు. ఇలాంటి దృశ్యాలు చూస్తుంటే.. టిఫిన్, లంచ్, డిన్నర్ తినేందుకు హోటల్స్‌కు వెళ్లాలంటే భయమేస్తుంది. ఇలాంటి హోటల్స్ ఎన్ని ఉన్నాయో ఈ నగరంలో అనిపించకమానదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి