iDreamPost

GHMC కార్మికురాలి మృతి.. భావోద్వేగానికి గురైన మేయర్!

GHMC కార్మికురాలి మృతి.. భావోద్వేగానికి గురైన మేయర్!

నగరాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండటంలో పారిశుద్ధ్య కార్మికులది కీలకపాత్ర. ప్రతి రోజూ ఉదయం నగరంలోని వీధుల్లో చెత్తను తొలగిస్తూ.. శుభ్రంగా ఉంచుతారు. అందుకే వారితో ప్రభుత్వ అధికారులకు కూడా మంచి  అనుబంధాలు ఉంటాయి. పారిశద్ధ్య కార్మికలకు ఏమైన జరిగితే.. కొందరు అధికారులు సైతం బాధ పడుతుంటారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలి మృతి పట్ల హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి విచారం వ్యక్తం చేశారు. కరోనా కష్టసమయంలో ఉత్తమ సేవలందించిన అలివేలు మృతి బాధకరమని ఆమె తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ మహానగరంలోని కార్వాన్ సర్కిల్ నానల్ నగర్ ప్రాంతంలో ఏడు మేకల అలివేలు అనే మహిళ పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తోంది.  నిత్యం విధులో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నే అలివేలు ఆకస్మికంగా మృతి చెందారు. ఇక ఆమె మృతి వార్త తెలుసుకున్న తోటి కార్మికులు విషాదంలో మునిగిపోయారు. అలానే అలివేలు మృతి వార్త తెలుసుకున్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి విచారం వ్యక్తం చేశారు. శనివారం మృతురాలి ఇంటికి వెళ్లి.. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన మేయర్ భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రోడ్లపై ఆకలితో  బాధపడుతున్న  అనేక మందికి  అలివేలు తన వంతుగా సహాయం చేసిందని మేయర్ గుర్తు చేసుకున్నారు.

అంతే కాకుండా తన ఒక నెల జీతాన్ని మంత్రి కేటీఆర్ చేతుల మీదుకు సీఎం రిలీప్ ఫండ్ కు అందజేసి.. మంచి మనస్సు చాటుకున్నారు.  కష్టకాలంలో విశిష్ట సేవలు అందించి ఆమె.. ఆర్థిక శాఖమంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా ‘ఉత్తమ కరోనా వారియర్’ అవార్డును సైతం అందుకున్నారని విజయలక్ష్మి తెలిపారు. అలాంటి మంచి మనిషిని కోల్పోవడం చాలా బాధకరమంటూ మేయర్ విజయలక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. అలివేలు కుటుంబానికి ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అండగా ఉంటుందని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని మేయర్ హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: రైలులో హత్యకు గురైన హైదరాబాదీ కుటుంబానికి కేసీఆర్ సర్కార్ భరోసా!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి