iDreamPost

రైలులో హత్యకు గురైన హైదరాబాదీ కుటుంబానికి కేసీఆర్ సర్కార్ భరోసా!

రైలులో హత్యకు గురైన హైదరాబాదీ కుటుంబానికి కేసీఆర్ సర్కార్ భరోసా!

ఇటీవల కొన్ని రోజుల క్రితం జైపూర్-ముంబై ఎక్స్ ప్రెస్ రైలులో ఓ వ్యక్తి కాల్పులు జరిపి.. నలుగురిని హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. క్షణికావేశంలో తనపై అధికారితో సహా మరో ముగ్గురిని ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరణించిన నలుగురిలో సైపుద్దీన్ అనే వ్యక్తి హైదరాబాద్ కు చెందిన వాడు. అతడి మరణంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అయితే తాజాగా సైపుద్దిన్ కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. జులై 31న ఆర్ఫీఎస్ కానిస్టేబుల్ చేతన్ సింగ్.. జైపూర్-ముంబై ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. అది కాస్తా పెద్దదిగా మారి.. చేతన్ సింగ్ క్షణికావేశంలో తనపై అధికారిపై కాల్పు జరిపాడు. అనంతరం మరో ముగ్గురిపై కూడా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందారు. నలుగురిలో హైద‌రాబాద్ లోని బజార్ఘాట్ నివాసి సయ్యద్ సైఫుద్దీన్ ఒకరు. ఈ క్రమంలో హత్యకు గురైన హైదరాబాద్ వాసి సయ్యద్ సైఫుద్దీన్ కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.

తాజాగా ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తున్నట్లు  పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మృతుడి భార్యకు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే రెండో రోజు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఈ సంఘటన గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్.. మృతుడి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, రెండు పడకల  ఇళ్లు ఇస్తామని మంత్రి తెలిపారు. అలానే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తామని హామి ఇచ్చారు. మరి.. మంత్రి కేటీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం.. RDO వ్యవస్థ రద్దు!?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి