iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: HYD సీపీకి అస్వస్థత.. అపోలో ఆసుపత్రిలో చేరిక..!

హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సందీప్ శాండిల్య అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే సోషల్ మీడియాలో ఆయనపై పలు రూమార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సందీప్ వివరణ ఇచ్చారు.

హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సందీప్ శాండిల్య అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే సోషల్ మీడియాలో ఆయనపై పలు రూమార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సందీప్ వివరణ ఇచ్చారు.

బ్రేకింగ్: HYD సీపీకి అస్వస్థత.. అపోలో ఆసుపత్రిలో చేరిక..!

హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సందీప్ శాండిల్య ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. బషీర్ బాగ్ పాత సీపీ కార్యాలయంలో ఉన్న ఆయన ఒక్కసారిగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందికి గురయ్యారు. ఆఫీసులో ఉండగానే ఛాతీలో నొప్పి రావడంతో అధికారులు ఆయనను హుటాహుటిన హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు..వైద్య పరీక్షలు నిర్వహించారు. సీపీ సందీప్ పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఒక రోజంతా ఆసుపత్రిలో ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో ఉన్న సందీప్ శాండిల్యను సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ పరామర్శించారు. తన అనారోగ్యంపై పలువురు ఆందోళన చెందడంతో సీపీ స్పందించారు.

తనకు ఉదయం ఛాతీలో నొప్పిగా అనిపించడంతో కొంత అసౌకర్యానికి గురయ్యానని, వెంటనే అపోలో ఆసుపత్రికి వచ్చినట్లు వీడియో సందేశంలో పేర్కొన్నారు. తనను వైద్యులు పరీక్షించారని, వైద్యపరీక్షలు నిర్వహించారని చెప్పారు. స్పాండిలైటిస్ తో పాటు తనకు లో- బీపీ ఉందని, అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. అయితే కొంత రెస్ట్ నేపథ్యంలో 24 గంటల పాటు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు సూచించారని చెప్పారు. తిరిగి కోలుకుని విధులకు హాజరవుతానంటూ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తన గురించి రూమర్లు వస్తున్నాయని, అందులో వాస్తవం లేదని, ప్రస్తుతం తాను చాలా బాగున్నానని వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోను హైదరాబాద్ సిటీ పోలీస్ ఎక్స్ లో షేర్ చేసింది

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom giriş