iDreamPost

వీడియో: ప్రియురాలితో భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

అతడికి పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. బిజినెస్ చేస్తున్నాడు. అంతలో వారి కంపెనీలో చేరింది ఓ అమ్మాయి .. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం గురించి భార్య నిలదీసింది. కానీ

అతడికి పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. బిజినెస్ చేస్తున్నాడు. అంతలో వారి కంపెనీలో చేరింది ఓ అమ్మాయి .. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం గురించి భార్య నిలదీసింది. కానీ

వీడియో: ప్రియురాలితో భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను కడతేర్చుతుంది ఓ ఇల్లాలు. అలాగే ప్రియురాలి కోసం కట్టుకున్న భార్యను మోసం చేస్తున్నాడు ఓ భర్త. ఇలాంటి కథనాలు ఇటీవల కాలంలో తరచుగా వస్తున్నాయి. పెళ్లినాటి ప్రమాణాలను తుంగలో తొక్కి, జీవిత భాగస్వామిని పక్కన పెట్టి.. పరాయి వ్యక్తులతో రాసలీలలు సాగిస్తున్నారు కొందరు. భర్త/భార్యకు నిజం తెలియనంత ఓకే. తెలిసినా కూడా కోర్టులు, చట్టాలు తమను ఏం చేయలేవన్న ఉద్దేశంతో మరింత రెచ్చిపోతున్నారు. తమ కడుపున పుట్టిన బిడ్డలపై ప్రేమ కనబర్చడం లేదు. చివరకు కట్టుకున్న భాగస్వామిని మరింత బాధపెట్టేలా ప్రవర్తిస్తున్నారు. పర్యావసానం.. ఆ కాపురం రచ్చ రచ్చగా మారుతుంది. తాజాగా అంబర్ పేటలో ఓ కాపురం రచ్చ కెక్కింది.

తనను పట్టించుకోకుండా.. ప్రియురాలితో రహస్యంగా కాపురం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదింది భార్య. ఈ ఘటన తెలంగాణలోని అంబర్ పేటలో జరిగింది. అంబర్ పేట డీడీ నగర్‌కు చెందిన ప్రవీణ్‌కు 15 సంవత్సరాల క్రితం పెళ్లైంది.  భార్యా భర్తలు బిజినెస్ చేసేవారు.  వీరికి ముగ్గురు పిల్లలు. అయితే అందులో పనిచేస్తున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు భర్త. భార్యను పట్టించుకోకుండా.. మరో మహిళతోనే గడుపుతున్నాడు. దీనిపై గొడవలు జరగ్గా..  ప్రియురాలు వదిలేసి వెళ్లిపోతానని చెప్పింది. కానీ వీరి మధ్య రహస్యంగా అక్రమ సంబంధం కొనసాగుతుంది. ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు భర్త. ఇదంతా గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నానని అనుకున్నాడు. కానీ భర్త తన ప్రియురాలితో ఉండగా.. కుటుంబ సభ్యులతో కలిసి భర్తను పట్టుకుంది భార్య.

అనంతరం భర్త ప్రవీణ్‌తో పాటు అతడి ప్రియురాల్ని చావకొట్టింది. భార్య తిరగబడుతుంటే.. భర్త కూడా ఆమెపై దాడి చేశాడు. ఆమె తన బండారాన్ని బయటపెట్టిందని, తనపై చేయి చేసుకుందని ప్రవీణ్  భార్యపై పిడి గుద్దులు కురిపించాడు. అలాగే ఆమె వెంట వచ్చిన కొడుకుపై కూడా చేయిచేసుకున్నాడు.  ఆ అమ్మాయిపై చేసుకోకుండా అడ్డుపడ్డాడు. కాగా, కుటుంబ సభ్యులతో ప్రవీణ్ వాదిస్తూ.. తాను ఇంటికి వస్తే భార్య అవమానిస్తుందని అంటూ మండిపడ్డాడు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో విషయం సద్దుమణిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.  ఈ విషయంలోకి వివాహేతర సంబంధాల కారణంగా ఇంతటి విప్తతు జరుగుతున్న కూడా.. సుప్రీంకోర్టుతో సహా పలు స్థానిక కోర్టులు.. వివాహేతర సంబంధాలు మరింత బలపడేలా తీర్పులు ఇవ్వడం శోచనీయం. మరీ ఇన్ని ఘోరాలు జరుగుతుంటే.. పరిష్కార మార్గాలు కూడా కోర్టులు సెలవు ఇస్తే బాగుంటుందని కొంత మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి