iDreamPost

బిగ్‌ బ్రేకింగ్‌: విజయవాడ కొత్త ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం!

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది . ఆటోనగర్ ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్ గౌడోన్ లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది..

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది . ఆటోనగర్ ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్ గౌడోన్ లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది..

బిగ్‌ బ్రేకింగ్‌: విజయవాడ కొత్త ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం!

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కానూరులోని కొత్త ఆటోనగర్ ఆయిల్ ట్యాంకర్ గౌడోన్‌లో ఈ ఘటన జరిగింది. మంటలు భారీగా ఎగసి పడుతుండటంతో భయాందోళనలకు గురౌతున్నారు స్థానికులు. అగ్ని కీలలు ఎగిసి పడుతున్నాయి. దీంతో పాటు దట్టమైన పొగ అలముకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్ని మాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా లేదా అన్న సమాచారం కూడా తెలియాల్సి ఉంది. ఆటోనగర్  వ్యాపార సముదాయాలు ఎక్కువ.  ఇక్కడ వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ట్రాన్స్ పోర్టేషన్ వాహనాలు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటాయి.

మంగళవారం ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్థి నష్టం జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.  కాగా, ప్రమాదం జరిగిన సమయంలో అందులో ఉద్యోగులు కానీ, వర్క్ చేసే వారు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు ఏం జరుగుతుందో తెలుసుకునే సరికి.. మంటలు అలముకున్నాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా ఆవరించింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.  కాగా, షార్ట్ సర్య్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.  పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి