iDreamPost

ఇన్ స్టా- వాట్సాప్ లింక్స్ తో ఐటమ్స్ కొనే ముందు ఈ వెబ్ సైట్ లో చెక్ చేసుకోండి!

అందరూ ఆన్ లైన్ షాపింగ్ బాగా అలవాటు పడ్డారు. ఈ రోజుల్లో షాపింగ్ కాస్తా.. ఇ-కామర్స్ సైట్స్ నుంచి వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ కు వచ్చేసింది. అయితే అక్కడ జరిగే స్కామ్స్ నుంచి తప్పించుకోవాలి అంటే ఈ వెబ్ సైట్ ఫాలో అవ్వాల్సిందే.

అందరూ ఆన్ లైన్ షాపింగ్ బాగా అలవాటు పడ్డారు. ఈ రోజుల్లో షాపింగ్ కాస్తా.. ఇ-కామర్స్ సైట్స్ నుంచి వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ కు వచ్చేసింది. అయితే అక్కడ జరిగే స్కామ్స్ నుంచి తప్పించుకోవాలి అంటే ఈ వెబ్ సైట్ ఫాలో అవ్వాల్సిందే.

ఇన్ స్టా- వాట్సాప్ లింక్స్ తో ఐటమ్స్ కొనే ముందు ఈ వెబ్ సైట్ లో చెక్ చేసుకోండి!

ప్రస్తుతం అంతా కూడా ఆన్ లైన్ షాపింగ్ మీదే ఆధారపడుతున్నారు. ఏది కావాలన్నా కూడా ఆన్ లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం చాలానే ఇ-కామర్స్ సైట్స్ ఉన్నాయి. వాటిలో చాలా ప్రముఖ వెబ్ సైట్స్ ద్వారానే కొంటూ ఉంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లో లింకుల ద్వారా కొనుగోలు చేయాలి అనుకుంటారు. అలా చేయడం కచ్చితంగా సేఫ్ కాదనే చెప్పాలి. అయితే అందరూ అలా ఉంటారని కాదు. కాకపోతే మోసపోయే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. అలాంటి సందర్భంలో మీరు ఈ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకుంటే మోసపోకుండా ఉండేందుకు ఎక్కు ఛాన్స్ ఉంటుంది. వాటిని కొనాలా? వద్దా? అనే ప్రశ్నకు సమాధానం కూడా దొరుకుతుంది.

మీరు ఇప్పటికే చాలాసార్లు ఆన్ లైన్ లో షాపింగ్ చేసుంటారు. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్ సైట్స్ ద్వారా ఎన్నో ఉత్పత్తులు కొనుంటారు. ట్రస్టెడ్ వెబ్ సైట్స్ ద్వారా కొంటే గనుక సాధ్యమైనంత వరకు మోసపోయే ప్రమాదం ఉండదు. అయితే ఈ రోజుల్లో షాపింగ్ కాస్తా ఇ-కామర్స్ వెబ్ సైట్స్ నుంచి వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ వరకు వచ్చేసింది. ఎవరో ఒకరు ఒక బిజినెస్ పెడతారు. వారికి ఒక వెబ్ సైట్ ఉంటుంది. మీకు లింకులు ఫార్వార్డ్ చేస్తూ ఉంటారు. మీరు ఆ లింకు ద్వారా కొనుగోలు చేస్తారు. అలా చేశాక ఇంటికి మీరు పెట్టిన వస్తువు కాకుండా ఏ సబ్బు బిళ్లో డెలివరీ అవుతుంది. అలాంటప్పుడు మీ డబ్బు వృథా అవుతుంది. మీరు పక్కాగా మోసపోయినట్లే అనమాట. చాలామందికి ఇప్పటికే ఇది అనుభవం కూడా అయిఉంటుంది. అయితే ఆ మోసాల నుంచి తప్పించుకునేందుకు చాలా మంది వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లింక్స్ ద్వారా కొనుగోలు చేయడం మానేసే ఉంటారు. అది మంచి విషయమే.

కాకపోతే ఈ వెబ్ సైట్ ద్వారా మీరు కొనాలి అనుకునే వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లింక్ నిజమో కాదో తెలుసుకోవచ్చు. అంటే ఆ లింక్ ద్వారా మీరు కొనుగోలు చేయడం మంచి నిర్ణయమేనా అనే విషయాన్ని వెల్లడిస్తుంది. ఆ వెబ్ సైట్ పేరు ‘స్కామ్ అడ్వైజర్’. మీరు ఈ వెబ్ సైట్ లో మీరు కొనాలి అనుకుంటున్న వెబ్ సైట్ లింక్ ని తీసుకుని కాపీ చేసి సెర్చ్ చేస్తే.. అది ఎంత వరకు సేఫ్ అనే విషయాన్ని తెలియజేస్తుంది. అది కూడా కొనుగోలుదారులు ఇచ్చిన రివ్యూస్ ఆధారంగానే సజీషన్ ఇస్తుంది. ఈ వెబ్ సైట్ లో మీరు ఒక్క ఆన్ లైన్ షాపింగ్ గురించే కాదు.. ఇన్వెస్ట్ మెంట్ స్కామ్స్, క్రిప్టో కరెన్సీ స్కామ్స్, అడ్వాన్స్ ఫీర్ స్కామ్స్, రొమాన్స్ స్కామ్స్, ఎంప్లాయిమెంట్ స్కామ్స్, సబ్ స్క్రిప్షన్ స్కామ్స్ కు సంబంధించిన లింక్స్, వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే మార్కెట్ లో జరుగుతున్న నయా మోసాల గురించి కూడా వీళ్లు అవగాహన కలిగిస్తూ ఉంటారు. మరి.. ఈ ScamaAdviser.com వెబ్ సైట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి