iDreamPost

ఏప్రిల్ నెల జీతాలు ఎలా ఇవ్వబోతున్నారు..?

ఏప్రిల్ నెల జీతాలు ఎలా ఇవ్వబోతున్నారు..?

కరోనా వైరస్ నియంత్రణ కోసం విధించిన లాక్ డౌన్ వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో గత నెల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల జీతాల్లో 50 శాతం కోత విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెల జీతాలు ఎలా ఇవ్వాలో ఓ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం గత నెల పరిస్థితే ఉండడంతో ఏప్రిల్ నెలలోనూ పలు విభాగాల ఉద్యోగులకు 50శాతం జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, వైద్య సిబ్బందికి పూర్తి వేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది. పించన్ దారులకు ఈ నెల మొత్తం సొమ్మును చెల్లించనుంది. అదే విధంగా సచివాలయ ఉద్యోగులకు గత నెలలో 10 శాతం కొత్త విధించగా ఈ నెలల్లో పూర్తి జీతం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.

కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను రెండు దఫాలుగా ఇస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కోత విధించిన జీవితం మొత్తాన్ని భవిష్యత్తులో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత విధించారు. కరోనా వైరస్ నియంత్రణ విధుల్లో.. సచివాలయ ఉద్యోగులు పూర్తిస్థాయిలో పని చేస్తున్న నేపథ్యంలో వారికి ఈనెల పూర్తి వేతనం చెల్లించాలని నిర్ణయించారు. అదేవిధంగా పింఛన్ దారుల నుంచి వచ్చిన విజ్ఞాపణలు పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వారికి ఈనెల పూర్తిగా పెన్షన్ చెల్లించాలని నిర్ణయించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి