iDreamPost

తెలుగు రాష్టాల నుంచి అయోధ్యకు ఎలా వెళ్లాలంటే.. ఇవే బెస్ట్ రూట్స్

  • Published Jan 22, 2024 | 7:27 PMUpdated Jan 22, 2024 | 7:27 PM

Ayodhya Temple: ఎంతో అట్టాసంగా అయోధ్యలోని బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవన్ని నిర్వహించారు. కోట్ల మంది భక్తులు ఆరాధించే ఆ బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ వేడుకను దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా నిర్వహించారు. అయితే ఆ అయోధ్య బాల రాముడిని టీవీల్లో చూడటమే కాకుండా.. అయోధ్యకు వెళ్లి రాముడిని కనులారా దర్శించుకోనేల కొన్ని ప్రత్యేక మార్గాలు ఉన్నాయి. అదే ఎలా అంటే..

దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిరస్మరణీయమైన ఘట్టంగా నేడు అయోధ్యలో ఆవిష్కృతం అయ్యింది. ఎంతో అట్టాసంగా అయోధ్యలోని బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవన్ని నిర్వహించారు. కోట్ల మంది భక్తులు ఆరాధించే ఆ బాల రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్ఠ వేడుకను దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా నిర్వహించారు. ఎన్నో ఏళ్ల నిరిక్షణకు ఈరోజు స్వస్తి పలుకుతు ఆ కొదాండ రాముడు తన జన్మ స్థానంలో కొలువుదీరాడు. ఆ రాం లాలా విగ్రహ ప్రాణ ప్రతిష్టను అభిజిత్ లగ్నం లో వేద పండితులు, వేద మంత్రల సాక్షిగా మధ్యహ్నం 12.30 గంటల సమయంలో జరిపారు. అంతేకాకుండా ఆ బాల రాముడి దివ్యమంగల స్వరూపం చూసి భక్తులు ప్రత్యేక్ష ప్రసారంగా చూసి మంత్ర ముగ్దులయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు 4వేల మంది సాధువులు పాల్గొన్నారు. అలాగే దేశవ్యాప్తంగా వేల మంది సెలబ్రిటీలు అయోధ్య ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. ఆ అయోధ్య బాల రాముడిని టీవీల్లో చూడటమే కాకుండా.. అయోధ్యకు వెళ్లి రాముడిని కనులారా దర్శించుకోనేల కొన్ని ప్రత్యేక మార్గాలు ఉన్నాయి. అదే ఎలా అంటే..

జగమంతా బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ అద్భుతమైన ఘట్టన్నీ వీక్షించేందుకు కోట్లాది మంది భక్తులు ఎంతో ఆశక్తితో ఎదురు చూశారు. ఆ విగ్రహ ఆవిష్కరణలో బాల రాముని సౌందర్య తేజస్సును చూసిన భక్తులు పులకరించిపోయారు. అయితే అంతటి అపూరపమైన రూపాన్ని టీవీల్లో చూడటమే కాకుండా..అయోధ్య వెళ్లి రాముడిని కనులారా దర్శించుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. మరి అలా వెళ్లడానికి సాధ్యమయ్యే మార్గలు ఏపీ, తెలంగాణ నుంచి ఉన్నాయి. అవి ఎలా అంటే.. ముందుగా తెలంగాణలో శంషాబాద్​ నుంచి అయోధ్యకు నేరుగా​ విమాన సర్వీసులు ఉన్నాయి. కానీ, అవి ఎక్కువ సంఖ్యలో లేవు.

అలా విమాన మార్గం నుంచి గోరఖ్​ పూర్, లక్నో ఎయిర్​పోర్ట్​లకు వెళ్తాలి. ఆ తర్వాత అక్కడ నుంచి 140 కీలో మీటర్ల దూరంలో ఉన్న అయోధ్యకు చేరలంటే నాలుగు గంటలు బస్సు లేదా ట్రైన్లలో ప్రయాణం చేయాలి. ఇలా దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు మార్గం ఉంది. అయితే తెలంగాణ నుంచి మాత్రం అయోధ్యకు డైరెక్ట్ రైళ్లు లేవు. ఒక వేళ ట్రైన్​లో వెళ్లాలనుకుంటే… సికింద్రాబాద్​ నుంచి గోరఖ్​పూర్ వెళ్లాలి. అక్కడి నుంచి రైలు లేదా రోడ్డు మార్గంలో వెళ్లాలి.

కాగా, ప్రతి శుక్రవారం ఉదయం10 :50కి ట్రైన్ బయల్దేరుతుంది. 30 గంటలపాటు ప్రయాణం ఉంటుంది. దీంతోపాటు సికింద్రాబాద్ నుంచి బీదర్ – అయోధ్య వీక్లి ఎక్స్​ప్రెస్‌ ఆది, సోమ వారాల్లో ఉంది. తెలంగాణ నుంచి అయోధ్యకు ట్రైన్​లో వెళ్లాలనుకుంటే ఆది, సోమ, శుక్ర వారాల్లో వెళ్లొచ్చు. మరి, అయోధ్య రాముడిని దర్శించుకునటకు వీలైయ్యే ప్రత్యేక మార్గాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి