iDreamPost

వారికి కేంద్రం శుభవార్త.. ఖాతాలో రూ.2,000.. ఎప్పుడంటే

  • Published May 17, 2024 | 3:30 PMUpdated May 17, 2024 | 3:40 PM

కేంద్ర ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది. త్వరలోనే వారి ఖాతాలో 2 వేల రూపాయలు జమ చేయనుంది. ఆ వివరాలు..

కేంద్ర ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది. త్వరలోనే వారి ఖాతాలో 2 వేల రూపాయలు జమ చేయనుంది. ఆ వివరాలు..

  • Published May 17, 2024 | 3:30 PMUpdated May 17, 2024 | 3:40 PM
వారికి కేంద్రం శుభవార్త.. ఖాతాలో రూ.2,000.. ఎప్పుడంటే

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులు, పేదలను ఆదుకునేందుకు అనేక నగదు బదిలీ పథకాలను తీసుకు వస్తున్నాయి. బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నగదు జమ చేస్తున్నాయి. అవినీతికి తావులేకుండా.. మధ్యవర్తులతో సంబంధం లేకుండా ఆయా పథకాలకు సంబంధించిన నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేస్తున్నారు. డబ్బుల పడ్డాయో లేదో అనే అనుమానం అక్కర్లేకుండా.. బ్యాంకు ఖాతాతో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ కు మెసేజ్ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వారి ఖాతాలో 2 వేల రూపాయలు జమ చేయనున్నట్లు వెల్లడించింది. ఆ వివరాలు..

అన్నదాతలను ఆదుకోవడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ స్కీమ్ ని తీసుకువచ్చింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు ఆర్థికంగా చేయూత అందిస్తోంది. ఈ స్కీమ్‌ను తొలిసారిగా 2019 ఫిబ్రవరిలో బడ్జెట్ సమయంలో ప్రకటించగా.. అప్పటి నుంచి ఏటా రూ. 6 వేలను రైతులకు అందిస్తూ వస్తోంది. ప్రతి ఏటా మూడు విడతల్లో.. ప్రతి సారి 2,000 రూపాయల చొప్పున రూ. 6 వేలను ప్రతి 4 నెలలకు ఓసారి రైతుల అకౌంట్లోలోనే నేరుగా జమ చేస్తుంది. ఇప్పటివరకు 16 విడతల డబ్బులు రైతులకు అందాయి. ఇక తాజాగా 17వ విడత కిసాన్ నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

ప్రతి సంవత్సరం ఏప్రిల్- జులై, ఆగస్ట్- నవంబర్, డిసెంబర్- మార్చి ఇలా ప్రతి 4 నెలలకు ఓసారి డబ్బుల్ని అందిస్తుంటుంది. చివరిసారిగా 2024, ఫిబ్రవరి 28వ తేదీన రైతుల ఖాతాలో రూ.2 వేలు జమ చేశారు. ఇప్పుడు పీఎం కిసాన్ 17వ విడత నిధులు.. మే నెల ఆఖర్లోనే పడతాయని తెలుస్తోంది. లేదా జూన్ నెల మొదటి వారంలోనైనా వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే డబ్బులు ఎప్పుడు పడాలన్నా.. ఇ-కేవైసీ అనేది కచ్చితంగా చేసుకోవాలన్న విషయం తెలిసిందే.

ఇ-కేవైసీ కోసం పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కు నేరుగా వెళ్లి అక్కడ ఇ-కేవైసీపై క్లిక్ చేసి.. ఓటీపీ సాయంతో దాన్ని పూర్తి చేయాలి. ఇంకా.. పీఎం కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు. ఇంకా.. కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి కూడా బయోమెట్రిక్ సాయంతో కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.

ఇక అర్హులైన రైతులు మాత్రమే పీఎం కిసాన్ ప్రయోజనాలు పొందాలి. టాక్స్ పేయర్లు ఈ స్కీమ్‌కు అనర్హులు. అర్హత లేని వారు ఎవరైనా ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందుతున్నట్లయితే వారిని గుర్తించి కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఆ డబ్బుల్ని కూడా వెనక్కి తీసుకుంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి