iDreamPost

అయోధ్యకు సీమా హైదర్ పాదయాత్ర.. యోగి అనుమతి కోరిన పాక్ మహిళ!

  • Published Feb 15, 2024 | 6:22 PMUpdated Feb 15, 2024 | 6:51 PM

అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన ముగిసిన తర్వాత సెలెబ్రిటీలు, సాధారణ ప్రజలు అంతా రాముడిని దర్శించుకోవడం కోసం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పాకిస్థాన్ కు చెందిన ఓ మహిళా కూడా రాముడిని దర్శించుకోవాలి అని అనుకుంది. కానీ, అందుకోసం ఆమె అక్కడి ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంది.

అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన ముగిసిన తర్వాత సెలెబ్రిటీలు, సాధారణ ప్రజలు అంతా రాముడిని దర్శించుకోవడం కోసం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పాకిస్థాన్ కు చెందిన ఓ మహిళా కూడా రాముడిని దర్శించుకోవాలి అని అనుకుంది. కానీ, అందుకోసం ఆమె అక్కడి ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంది.

  • Published Feb 15, 2024 | 6:22 PMUpdated Feb 15, 2024 | 6:51 PM
అయోధ్యకు సీమా హైదర్ పాదయాత్ర.. యోగి అనుమతి కోరిన పాక్ మహిళ!

అట్టహాసంగా అంగరంగ వైభవంగా అయోధ్యలో బాల రాముడు కొలువుతీరాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో భక్తులు ఆ బాల రాముడిని వీక్షించేందుకు.. దేశ నలుమూలల నుంచి వచ్చి ఆ దేవాలయం ఎదుట బారులు తీరుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ కు చెందిన ఓ మహిళ కూడా అయోధ్యలో కొలువుదీరిన రాముడిని దర్శించుకోవాలి అనుకుంది. అది కూడా కాలి నడకన అక్కడకు చేరుకోవాలని నిశ్చయించుకుంది. కానీ, అందుకోసం ఆమె యూపీ సీఎం అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో తన వినతిని తెలియజేస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అనుమతి కోరింది. దీంతో ఈ వార్త అందరికి ఆసక్తిగా మారింది. అసలు ఆ పాకిస్థాన్ మహిళ ఎవరు! ఎందుకు అయోధ్య రామ మందిరానికి పాదయాత్ర కోసం అనుమతి కోరింది వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మూడేళ్ళ క్రితం వచ్చిన కరోనా కారణంగా .. ఆ సమయంలో ఎన్నో విచార సంఘటనలు జరిగాయి అలానే విచిత్ర సంఘటనలు కూడా జరిగాయి. అలాంటి విచిత్ర సంఘటనలో ఒకటి సీమా హైదర్ ఘటన. ప్రేమ కోసం పరాయి దేశం నుంచి పిల్లలతో సహా.. సరిహద్దులు దాటి మరీ అక్రమంగా భారత్ లోకి చొరబడింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె సృష్టించిన అలజడి అంత ఇంత కాదు.. తాను తిరిగి పాక్ కు వెళ్లనని.. ఇక్కడే ఉంది సచిన్ మీనాను పెళ్లి చేసుకుంటానని.. పైగా అందుకోసం భారత్ లో సిటిజన్ షిప్ కోసం కూడా అప్లై చేసుకుందనే వార్తలను కూడా విన్నాము. అయితే ఇవన్నీ కొంతకాలం క్రితం జరిగిన సంఘటనలు. మళ్ళీ ఇన్నాళ్లకు ఆమె మరోసారి వార్తల్లోకి వచ్చింది.

దానికి కారణం .. కాలినడకన అయోధ్యకు చేరుకోవాలి అని సీమా అనుకోవడం. అయితే, భారత్ పై ఎప్పటికపుడు తనకున్న ప్రేమను చూపిస్తున్న సీమా సైదర్.. ఇప్పుడు తాను అయోధ్యకు కాలినడకన వెళ్లి.. బాలరాముడ్ని దర్శించుకుంటానని.. అందుకోసం తనకు అనుమతి ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ క్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కు దరఖాస్తు చేసుకుంది. అంతేకాకుండా తాను స్వతహాగా కృష్ణుడి భక్తురాలిని అంటూ.. సుందరకాండ పఠిస్తున్న వీడియోను ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా తాను పూర్తిగా హిందువుగా మారినట్లు కూడా ఆమె తెలియజేసింది. పైగా పాకిస్థాన్‌ లో ఉన్నప్పడు కూడా హిందువుల పండుగలను రహస్యంగా చేసుకునేదాన్నని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఈమె సచిన్ మీనాతో కలిసి నోయిడాలో నివసిస్తుంది. అక్కడి నుంచే అయోధ్యకు కాలి నడకన చేరుకోనున్నట్లు తెలియజేసింది. మరో పక్క అధికారులు కూడా ఈమెకు అనుమతి ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి