iDreamPost

వేసిన అన్ని ఓవర్లు మెయిడెన్‌..! లూకీ ఫెర్గుసన్‌కు ఇది ఎలా సాధ్యమైంది?

  • Published Jun 18, 2024 | 4:23 PMUpdated Jun 18, 2024 | 4:23 PM

Lockie Ferguson, NZ vs PNG, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో ఫెర్గుసన్‌ 4 ఓవర్లు మెయిడిన్‌ వేయడం క్రికెట్‌ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఇంతకీ ఇది ఎలా సాధ్యమైందో ఇప్పుడు తెలుసుకుందాం..

Lockie Ferguson, NZ vs PNG, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో ఫెర్గుసన్‌ 4 ఓవర్లు మెయిడిన్‌ వేయడం క్రికెట్‌ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఇంతకీ ఇది ఎలా సాధ్యమైందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 18, 2024 | 4:23 PMUpdated Jun 18, 2024 | 4:23 PM
వేసిన అన్ని ఓవర్లు మెయిడెన్‌..! లూకీ ఫెర్గుసన్‌కు ఇది ఎలా సాధ్యమైంది?

అతని బౌలింగ్‌లో ఆడాలంటే బ్యాటర్లు భయపడ్డారు. పరుగులు చేయడం పక్కనపెడితే.. కనీసం డిఫెన్స్‌ ఆడేందుకు కూడా వణికిపోయారు. అంతర్జాతీయ క్రికెట్‌లో, టీ20 వరల్డ్‌ కప్‌ లాంటి ప్రతిష్టాత్మక వేదికపై న్యూజిలాండ్‌ బౌలర్‌ లూకీ ఫెర్గుసన్‌ సంచలన బౌలింగ్‌ గణంకాలు నమోదు చేశాడు. తన నాలుగు ఓవర్ల పూర్తి కోటా పూర్తి చేసి.. ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా అద్భుతమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అయితే.. బ్యాటర్లకు పండగలాంటి ఫాస్ట్‌ ఫార్వర్డ్‌ ఫార్మాట్‌ అయిన టీ20ల్లో ఒక్క రన్‌ కూడా ఇవ్వకుండా 4 ఓవర్ల కోటా ఎలా పూర్తి చేశాడా? అనే అనుమానం ప్రతి క్రికెట్‌ అభిమానిలో ఉంది. మరి ఫెర్గుసన్‌ ఎలా ఈ అరుదైన రికార్డును సాధించాడో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా సోమవారం ట్రినిడాడ్‌లోని బ్రియన్‌ లారా స్టేడియంలో న్యూజిలాండ్‌, పీఎన్‌జీ(పాపువా న్యూ గినియా) జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ రెండు జట్లు అప్పటికే వరల్డ్‌ కప్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. దీంతో.. కివీస్‌ వర్సెస్‌ పీఎన్‌జీ మ్యాచ్‌ను అంతా నామమాత్రమే అనుకున్నారు. కానీ, ఫెర్గుసన్‌ చేసిన అద్భుతంతో ఇదే మ్యాచ్‌ టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌ అయింది. ట్రినిడాడ్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు కాస్త ఇబ్బందికరంగా ఉండటం.. బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఫెర్గుసన్‌ రెచ్చిపోయాడు. అతని దెబ్బకు పీఎన్‌జీ బ్యాటర్లకు అసలు బాల్‌ కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. దీంతో పాటు ఫెర్గుసన్‌ బౌలింగ్‌లో పీఎన్‌జీ బ్యాటర్లు పరుగులు చేయలేకపోవడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

పాపువా న్యూ గినియా ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో బుడిబుడి అడుగులు వేస్తున్న జట్టు. సరైన ఫాస్ట్‌ ట్రాక్‌ పిచ్‌ ఎదురుపడితే.. ఫెర్గుసన్‌ లాంటి బౌలర్‌ను ఎదుర్కొవడం వారికి చాలా కష్టం. గంటకు 140 నుంచి 150కి పైగా స్పీడ్‌తో బౌలింగ్‌ వేసే ఫెర్గుసన్‌కు కరెక్ట్‌ పిచ్‌ ఉండాలని కానీ, బ్యాటర్లను వణికించగలడు. పీఎన్‌జీతో మ్యాచ్‌లో సరిగ్గా అదే జరిగింది. పిచ్‌లో అనూహ్యమైన బౌన్స్‌తో పాటు, బాల్‌ ఎప్పుడూ బౌన్స​ అవుతుందో, ఎప్పుడు కాట్లేదో అంచనా వేయడం కష్టంగా మారింది. బాల్‌ కిందికి వస్తుందని ఆడితే.. పైకి వస్తుంది. పైకి వస్తుందని రెడీగా ఉంటే కిందికి వస్తోంది.. ఇలా ఏ మాత్రం అర్థం కాక బ్యాటర్లకు చుక్కలు కనిపించాయి. పైగా.. పిచ్‌ నుంచి వచ్చిన మద్దతును ఫెర్గుసన్‌ అద్భుతంగా వినియోగించుకున్నాడు.

తన స్కిల్‌కు తగ్గట్లు బౌలింగ్‌ వేస్తూ.. కరెక్ట్‌గా లైన్‌ అండ్‌ లెంత్‌ పాటిస్తూ సూపర్‌ బౌలింగ్‌తో పీఎన్‌జీ బ్యాటర్లను కట్టిపడేశాడు. పిచ్‌ ఎలా ప్రవర్తిస్తుందో తెలియకపోవడంతో బాల్‌ లోపలికి వస్తుందా? బయటికి వెళ్తుందా? అనేది బ్యాటర్లకు ఏ మాత్రం అర్థం కాలేదు. పైగా ఫెర్గుసన్‌ బాల్‌ను రెండు వైపులా అద్భుతంగా స్వింగ్‌ చేయగలడు. అవుట్‌ సైడ్‌ది ఆఫ్‌ స్టంప్‌ బాల్స్‌ వేస్తూ.. సడెన్‌గా ఇన్‌ స్వింగ్‌ బాల్‌ వేయడంతో పీఎన్‌జీ బ్యాటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఫర్గుసన్‌కు టీమ్‌ నుంచి కూడా మంచి మద్దతు లభించింది. అద్భుతమైన ఫీల్డింగ్‌తో పరుగులు రాకుండా కట్టడి చేశారు. వీటికి తోడు.. గ్రూప్‌ దశలోనే టోర్నీ నిష్క్రమించడంతో కివీస్‌ బౌలర్లలో కాస్త కోపం, కసి కూడా కనిపించాయి. ఇలా పిచ్‌, ఫెర్గుసన్‌ స్కిల్‌, టీమ్‌ ఫీల్డింగ్‌, పీఎన్‌జీ ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌ అన్ని కలిపి.. టీ20 క్రికెట్‌లో లూకీ ఫెర్గుసన్‌ అద్భుతమైన రికార్డు సాధించేందుకు కారణం అయ్యాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి